/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిలాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ Raghu ram reddy
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిలాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు

తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని చెప్పారు. దాని ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. అల్పపీడన ప్రభావం ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై ఉంటుందన్నారు.

నేడు ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు.

ఇక ఈ ఏడాది నైరుతి రుతపవానాలు జూన్ మెుదటివారంలోనే వచ్చినా.. ఆశినంతగా వర్షాలు కురవలేదు. తెలంగాణలోని 111 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 210 మండలాల్లో సాధారణ వర్షపాతం కురవగా.. 166 మండలాల్లో అధికంగా, మరో 125 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. జూన్‌ 1 నుంచి 29 వరకు తెలంగాణ వ్యాప్తంగా సగటున 149 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు చెప్పారు

SBI Clerk Notification 2024: Check Post For 4613 Vacancies, Eligibility Criteria

State Bank of India (SBI) has announced the recruitment for the Clerk position in 2024. This article provides a detailed guide about the recruitment process, eligibility criteria, application process, and more.

The SBI Clerk Recruitment 2024 is a golden opportunity for candidates preparing for the SBI Clerk examination. The bank has released a notification for the recruitment of 4613 Clerk posts. The application forms are expected to be available soon on the SBI’s official website.

Eligibility Criteria

Educational Qualification

Candidates applying for the SBI Clerk position should have a Bachelor’s Degree in any discipline. Those appearing for their final year exams or postgraduates in respective disciplines with experience in the relevant field are also eligible to apply. You should check the official notification for more details on the required educational qualifications.

The age limit for the SBI Clerk position is a minimum of 21 years and a maximum of 30 years. However, there is age relaxation for reserved categories:

Check the official notification for more details on the age limit and relaxation.

The application fee for the General, OBC, and EWS categories is Rs. 750. There is no application fee for SC, ST, and PH candidates. The payment can be made through Debit Card, Net Banking, or E Challan.

The selection process for the SBI Clerk position involves two stages:

చూడటానికి సంప్రదాయనీ.. పనులు మాత్రం సుద్దపూసనీ తలపిస్తాయి

Kerala Crime News ఈ అమ్మాయి చూడటానికి సంప్రదాయనీలా ఉంటుంది. కానీ ఆమె చేసే పనులు సుద్దపూసనీ తలపిస్తుంటాయి. కానీ పోలీసులు సైతం ఖంగుతినేలా చేసింది. ఆమె ఏం చేసిందంటే..?

వ్యాపారం చేయడంలో ఈ అమ్మాయి ముందు ఎవరైనా దిగదుడుపే. విలాసవంతమైన జీవితం.. గోవా, బెంగళూరు ట్రిప్స్. ఎక్కడకు వెళ్లినా పెద్ద పెద్ద హోటల్స్‌లోనే బస. తనకు నచ్చినట్లు లైఫ్ లీడ్ చేస్తుంది. తాను చేసే బిజినెస్ డబ్బుతోనే ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ ఓ డౌట్ రావొచ్చు. బిజినెస్ చేస్తున్నదంటే.. అసలు తీరిక ఉండదు కదా అని.

మరీ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటుందని. ఆమె చేసే వ్యాపారం అలాంటి, ఇలాంటిది కాదు.. పోలీసులు సైతం ఖంగుతిన్నారు. ఇంతకు ఆ వ్యాపారం ఏంటనేగా.. మాదక ద్రవ్యాల సరఫరా. అవాక్కయ్యారు కదా. రెండు కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం కేసులో తాజాగా ఈ మహిళను అరెస్టు చేశారు. ఈమెది గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళ.

గత నెల 19న కేరళలోని పుయ్యింగడి ఎటక్కల్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. తనిఖీలు నిర్వహించగా.. రెండు కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు వస్తున్నారని తెలిసి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. మొత్తం రూ. 2 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దృష్టి సారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. నిలంబూరుకు చెందిన షైన్ షాజీని తొలుత అరెస్టు చేశారు. ఆ తర్వాత మరో నిందితుడు పెరువన్నముళికి చెందిన అల్బిన్ సెబాస్టియన్‌ను అరెస్టు చేసి కుమిలిలో రిమాండ్‌కు తరలించారు.

నిందితుల్ని విచారించగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వీరే కాదూ.. వీటి వెనుక మరో కిలాడీ లేడీ ఉందని గుర్తించారు. అయితే అసలైన స్మగ్లర్‌గా జుమీ అని నిర్దారించారు. షైన్ షాజీ డ్రగ్స్ కొరియర్ చేసేందుకు ఆమెనే వినియోగించే వాడని విచారణలో తేలింది. బెంగళూరు నుండి టూరిస్టు బస్సుల ద్వారా ఆమెతో డ్రగ్స్ రవాణా చేయించేవాడు. పోలీసులకు నిందితులు పట్టుబడటంతో ఆమె కూడా బెంగళూరులో తలదాచుకుంది. ఆమెను కూడా పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. మద్యానికి బానిసైన జుమీ.. డ్రగ్స్ కొరియర్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో విలాసవంతమైన జీవనాన్ని గడిపేది. తరచుగా గోవా, బెంగళూరు టాప్ హోటల్లోనే బస చేసేది. ఈ కేసులో మొత్తం ముగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్ కేసులో మరెవరైనా ఉన్నారేమోనన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది.

GHMC: గ్రేటర్ ఆస్తుల పరిరక్షణపై సర్కార్ ఫోకస్..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో(GHMC) చాలా ఏరియాల్లో కోట్ల విలువైన భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. ఇటీవలే మియాపూర్‌లో రాత్రికి రాత్రే టెంట్లు వేసి ఆక్రమించడానికి ప్రయత్నించారు.

అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఇదే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో(GHMC) చాలా ఏరియాల్లో కోట్ల విలువైన భూములపై అక్రమార్కులు కన్నేస్తున్నారు. ఇటీవలే మియాపూర్‌లో రాత్రికి రాత్రే టెంట్లు వేసి ఆక్రమించడానికి ప్రయత్నించారు.

అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఇదే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సీఎం రేవంత్ సర్కార్ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కమిషనర్ అసెట్స్ ప్రొటక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేకంగా విభాగాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇప్పటి వరకు ఉన్న EVDM ను అసెట్స్ ప్రొటక్షన్ లో విలీనం చేయనున్నారు. GHMC, HMDA పరిధికి ఈవీడీఎంను విస్తరించనున్నారు. ఆస్తుల రక్షణ కోసం ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, 8 మంది డీఎస్పీలు, సీఐలు, డిప్యూటీ కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ వాటర్ బోర్డు, ఫైర్ అధికారులను ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం మూడు వేల మంది సిబ్బందితో ప్రత్యేక టీం ఏర్పాటు చేయనున్నారు.

NEET | నీట్‌ ఎత్తేయండి.. ప్రధాని మోదీ, 8 మంది సీఎంలకు స్టాలిన్‌ లేఖ

NEET | వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష (నీట్‌) విధానాన్ని ఎత్తేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీతోపాటు ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖలు రాశారు.

చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష (నీట్‌) విధానాన్ని ఎత్తేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీతోపాటు ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖలు రాశారు. అలాగే నీట్‌ (NEET ) నుంచి తమిళనాడును మినహాయించాలని పునరుద్ఘాటించారు.

వృత్తిపరమైన కోర్సుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా 12 వ తరగతి మార్కుల ద్వారా మాత్రమే ఉండాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు. నీట్‌ అనేది విద్యార్థులపై అనవసరమైన అదనపు ఒత్తిడి అని ఆరోపించారు.

కాగా, ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలు తమిళనాడు వ్యతిరేకతను సమర్థిస్తున్నదని స్టాలిన్‌ తెలిపారు. ‘ఈ ఎంపిక ప్రక్రియను తొలగించాల్సిన అవసరంపై ఇతర రాష్ట్రాలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి’ అని ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్ల కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించినట్లు సీఎం స్టాలిన్‌ తెలిపారు. రాష్ట్రపతి ఆమోదం కోసం ఈ బిల్లును పంపామని, ఇది పెండింగ్‌లో ఉందన్నారు.

మరోవైపు నీట్‌ రద్దు కోసం అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ సూచించారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ సీఎంలకు ఈ మేరకు లేఖలు పంపారు. అలాగే నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా స్టాలిన్‌ లేఖ రాశారు.

CM Chandrababu : స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లను ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను స్వయంగా ఇవ్వనున్నారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో పెన్షనర్ల ఇంటికి వెళ్లి పెన్షన్లను తన చేతుల మీదుగా అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి.

పేదింటి మహిళకు సీఎం స్వయంగా పెన్షన్ అందచేయడం ఇదే ప్రథమం. సీఎం పర్యటనతో పెనుమాక వచ్చి అధికారులు పరిశీలించారు. పెన్షన్ లబ్ధిదారుల జాబితా అధికారులు సేకరించారు.

జూలై ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీ

కాగా.. ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను జూలై ఒకటో తేదీనే పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పింఛన్లు పంపిణీ జరగాలన్నారు. ప్రతి ఉద్యోగి 50 పింఛన్లు పంచేలా సర్దుబాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు క్లస్టర్‌ విధానం అనుసరించాలన్నారు. ప్రతి క్లస్టర్‌కు సిబ్బందిని పక్కాగా మ్యాపింగ్‌ చేయాలన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఇవ్వరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Delhi CM Arvind Kejriwal Sent To Judicial Custody Till July 12 In Excise Policy Case

Earlier, the CBI had sought five days of remand, but was granted three, after claiming that Kejriwal's custody was necessary to confront him with evidence and documents

The Rouse Avenue Court on Saturday sent Delhi CM Arvind Kejriwal to judicial custody for 14 days till July 12 in connection to the liquor policy case. The development came after Kejriwal’s three-day CBI custody ended today.

The court’s decision came after hearing both the parties on Saturday afternoon. Notably, Kejriwal was arrested by the CBI on June 26.

The arrest order of Delhi Chief Minister was passed by Special Judge Amitabh Rawat on the application by CBI on Wednesday. “In view of the factum of the investigation leading to the arrest of the accused, the role ascribed to him and the necessity to confront the accused with the evidence in the present case of conspiracy, the present police remand application of the accused is allowed. However, it shall be for a period of three days from today. Accused Arvind Kejriwal will be produced on June 29, 2024 before 7 pm," the judge had said in the order.

When the court asked Senior Advocate Vikram Chaudhary, who was appearing for Kejriwal, about the grounds for opposing remand, he said, “The arrest and police custody orders were based the collection of evidence, which they had apparently collected in January."

The court said the matter related to evidence was between the court and the investigation officer.

The court also said that according to the provisions of the Code of Criminal Procedure (CrPC), once the police custody was over, the court was bound to grant judicial remand.

Kejriwal’s lawyer then demanded that the CBI should disclose the evidence against the Delhi CM, based on which it was seeking a remand.

Kejriwal was arrested by the central agency in connection with the liquor policy case on Wednesday.

Earlier, the CBI had sought a five-day remand but was granted three, after claiming that Kejriwal’s custody was necessary to confront him with evidence and documents in the case.

TS News: పనస పండ్ల మధ్య గంజాయి తరలింపు

గంజాయి అక్రమ రవాణాలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు నిందితులు. చివరకు పనస పండ్లను సైతం గంజాయి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు.

అయినా సరే పోలీసులు మరింత తెలివిగా వ్యవహరించి వారిని పట్టుకుంటున్నారు. పనస పండ్ల మధ్యలో గంజాయిని పెట్టి తరలిస్తుండగా షామీర్ పేట్ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్: గంజాయి అక్రమ రవాణాలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు నిందితులు. చివరకు పనస పండ్లను సైతం గంజాయి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు. అయినా సరే పోలీసులు మరింత తెలివిగా వ్యవహరించి వారిని పట్టుకుంటున్నారు. పనస పండ్ల మధ్యలో గంజాయిని పెట్టి తరలిస్తుండగా షామీర్ పేట్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులతో పాటు 33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ఎవరికి అనుమానం రాకుండా పనస పండ్ల మధ్య గంజాయిని అమర్చి నిందితులు తరలిస్తున్నారు.

పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి శామీర్ పేట్ టోల్‌గేట్ వద్ద నిందుతులను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మేడ్చల్ నుంచి శామీర్ పేట వైపునకు వెళుతున్న వాహనాన్ని అడ్డగించి పట్టుకున్నారు.

ఏపీలోని విశాఖపట్నం నుంచి తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం వైపునకు రాజీవ్ రహదారి మీదుగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు అవుట్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ వాహనంలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

వాసుదేవరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు

అత్యంత నాసిరకం మద్యాన్ని కనీవినీ ఎరుగని బ్రాండ్ల పేరిట ఏ రాష్ట్రంలోనూ లేని ధరలకు విక్రయించిన ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది

అత్యంత నాసిరకం మద్యాన్ని కనీవినీ ఎరుగని బ్రాండ్ల పేరిట ఏ రాష్ట్రంలోనూ లేని ధరలకు విక్రయించిన ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. తాడేపల్లి ప్యాలె్‌సకు ఎంత డబ్బు తరలించారో సీఐడీ తవ్వి తీస్తోంది. ప్రభుత్వం మారగానే తెలంగాణకు పారిపోయిన ఆయనపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు మొత్తం కుంభకోణాన్ని వెలికి తీస్తున్నారు.

విజయవాడలోని ఏపీ బేవరేజెస్‌ కార్యాలయాన్ని ఇప్పటికే అధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం కొందరు సిబ్బందిని పిలిచి కంప్యూటర్లు ఓపెన్‌ చేయించారు.

అందులోని సమాచారంతోపాటు డిలీట్‌ చేసిన వివరాలనూ నిపుణుల ద్వారా రికవరీ చేయిస్తున్నారు. ఇప్పటి వరకూ సోదాల్లో లభించిన ఆధారాలపై కసరత్తు చేసిన సీఐడీ అధికారులు శుక్రవారం మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు. మద్యం కుంభకోణం ఎలా జరిగింది..?

ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలె్‌సకు చేరిన డబ్బు సంచుల్లో ఎన్ని వందల కోట్లు ఉన్నా యి..? ఎక్కువ ఆర్డర్‌ పొందిన మద్యం కంపెనీ ఏది.. అనధికారికంగా ఎవరెవరు ఎంతిచ్చారనే అంశాలపై కూపీ లాగుతున్నారు. అసలు సూత్రధారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు.

Adilabad:మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. శనివారం ఉదయం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆయన మరణించారు.

బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు.

శనివారం ఉదయం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆయన మరణించారు.

శుక్రవారం రాత్రి రమేష్ రాథోడ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అయితే శనివారం ఉదయం మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఆ క్రమంలో ఆయన మృతి చెందారు.

ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గానే కాకుండా లోక్‌సభ సభ్యుడిగా రమేష్ రాథోడ్ పని చేశారు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో రమేశ్ రాథోడ్ కీలక నేతగా పని చేశారు. ఆయన స్వస్థలం నార్నూర్ మండలం తాడిహాత్నూర్.