/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz TS News: పనస పండ్ల మధ్య గంజాయి తరలింపు Raghu ram reddy
TS News: పనస పండ్ల మధ్య గంజాయి తరలింపు

గంజాయి అక్రమ రవాణాలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు నిందితులు. చివరకు పనస పండ్లను సైతం గంజాయి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు.

అయినా సరే పోలీసులు మరింత తెలివిగా వ్యవహరించి వారిని పట్టుకుంటున్నారు. పనస పండ్ల మధ్యలో గంజాయిని పెట్టి తరలిస్తుండగా షామీర్ పేట్ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్: గంజాయి అక్రమ రవాణాలో మరింత తెలివిగా వ్యవహరిస్తున్నారు నిందితులు. చివరకు పనస పండ్లను సైతం గంజాయి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు. అయినా సరే పోలీసులు మరింత తెలివిగా వ్యవహరించి వారిని పట్టుకుంటున్నారు. పనస పండ్ల మధ్యలో గంజాయిని పెట్టి తరలిస్తుండగా షామీర్ పేట్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులతో పాటు 33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై ఎవరికి అనుమానం రాకుండా పనస పండ్ల మధ్య గంజాయిని అమర్చి నిందితులు తరలిస్తున్నారు.

పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి శామీర్ పేట్ టోల్‌గేట్ వద్ద నిందుతులను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా మేడ్చల్ నుంచి శామీర్ పేట వైపునకు వెళుతున్న వాహనాన్ని అడ్డగించి పట్టుకున్నారు.

ఏపీలోని విశాఖపట్నం నుంచి తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం వైపునకు రాజీవ్ రహదారి మీదుగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు అవుట్ రింగ్ రోడ్డు టోల్ గేట్ వద్ద బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ వాహనంలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.

వాసుదేవరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు

అత్యంత నాసిరకం మద్యాన్ని కనీవినీ ఎరుగని బ్రాండ్ల పేరిట ఏ రాష్ట్రంలోనూ లేని ధరలకు విక్రయించిన ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది

అత్యంత నాసిరకం మద్యాన్ని కనీవినీ ఎరుగని బ్రాండ్ల పేరిట ఏ రాష్ట్రంలోనూ లేని ధరలకు విక్రయించిన ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. తాడేపల్లి ప్యాలె్‌సకు ఎంత డబ్బు తరలించారో సీఐడీ తవ్వి తీస్తోంది. ప్రభుత్వం మారగానే తెలంగాణకు పారిపోయిన ఆయనపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు మొత్తం కుంభకోణాన్ని వెలికి తీస్తున్నారు.

విజయవాడలోని ఏపీ బేవరేజెస్‌ కార్యాలయాన్ని ఇప్పటికే అధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం కొందరు సిబ్బందిని పిలిచి కంప్యూటర్లు ఓపెన్‌ చేయించారు.

అందులోని సమాచారంతోపాటు డిలీట్‌ చేసిన వివరాలనూ నిపుణుల ద్వారా రికవరీ చేయిస్తున్నారు. ఇప్పటి వరకూ సోదాల్లో లభించిన ఆధారాలపై కసరత్తు చేసిన సీఐడీ అధికారులు శుక్రవారం మరిన్ని కీలక ఆధారాలు సేకరించారు. మద్యం కుంభకోణం ఎలా జరిగింది..?

ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలె్‌సకు చేరిన డబ్బు సంచుల్లో ఎన్ని వందల కోట్లు ఉన్నా యి..? ఎక్కువ ఆర్డర్‌ పొందిన మద్యం కంపెనీ ఏది.. అనధికారికంగా ఎవరెవరు ఎంతిచ్చారనే అంశాలపై కూపీ లాగుతున్నారు. అసలు సూత్రధారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు.

Adilabad:మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. శనివారం ఉదయం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆయన మరణించారు.

బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు.

శనివారం ఉదయం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆయన మరణించారు.

శుక్రవారం రాత్రి రమేష్ రాథోడ్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అయితే శనివారం ఉదయం మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఆ క్రమంలో ఆయన మృతి చెందారు.

ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గానే కాకుండా లోక్‌సభ సభ్యుడిగా రమేష్ రాథోడ్ పని చేశారు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో రమేశ్ రాథోడ్ కీలక నేతగా పని చేశారు. ఆయన స్వస్థలం నార్నూర్ మండలం తాడిహాత్నూర్.

స్టిక్కర్లు అంటించడం ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ఉందండోయ్

ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పలు పథకాల పేర్లు మారాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్‌లకు కొత్త స్టిక్కర్లను అంటించింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం.

ఈ క్రమంలో- వైఎస్ఆర్ భరోసా కాస్తా ఎన్టీఆర్ భరోసాగా మారింది.

జగన్ ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనను పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌గా, జగనన్న విదేశీ విద్యాదీవెనను అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధిగా, వైఎస్సార్‌ కల్యాణమస్తును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చింది కూటమి సర్కార్. ఉచిత విద్యుత్ స్కీమ్ పేరూ మారింది.

సంపూర్ణ పోషణ పథకాన్ని బాల సంజీవినిగా పేరు పెట్టింది.

Hyderabad: అదానీ సంస్థకు విద్యుత్తు బాధ్యత!

విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది.

విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది.

నష్టాల నుంచి తప్పించుకునేందుకే..!

అప్పగించే యోచనలో ఎస్‌పీడీసీఎల్‌?

హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో అమలు

ఢిల్లీలో సూచనప్రాయంగా సీఎం వెల్లడ

విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్‌)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో అధిక నష్టాలు మూటగట్టుకుంటున్న దక్షిణ సర్కిల్‌ బాధ్యతను ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి చెందిన సంస్థకు ఇవ్వనున్నట్లు స్పష్టమైంది. ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ పాత బస్తీలో విద్యుత్తు బిల్లుల వసూలును అదానీ కంపెనీకి ఇచ్చామని, భూగర్భ లైన్లు వేసి అక్కడ మొత్తం వ్యవస్థను మార్చాలని కోరామని తెలిపారు. ఈ నేపథ్యంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న సర్కిళ్లను ప్రైవేటుకు అప్పగిస్తారని ఖాయమైంది. అయితే, విద్యుత్తు సరఫరా, లైన్ల నిర్వహణ, మీటర్‌ రీడింగ్‌, బిల్లుల జారీ, వసూళ్లు.. ఇలా అన్నింటిలోనూ పైవ్రేట్‌ వ్యవస్థను భాగస్వామ్యం చేస్తారా? బిల్లుల జారీ, వసూళ్ల వరకేనా? అన్నది తెలియాల్సి ఉంది.

బకాయిలు అధికం

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో గృహ/వాణిజ్య విభాగంలో 60 లక్షల విద్యుత్తు కనెక్షన్లున్నాయి. ప్రతి నెల బిల్లుల రూపంలో రూ.900 కోట్లు వసూలవుతుంటాయి. గత మే నెల నాటికి రూ.380 కోట్ల బకాయిలు పేరుకున్నాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్‌ దక్షిణ సర్కిల్‌లో రూ.83.4 కోట్లు, రాజేంద్రనగర్‌లో రూ.63.8 కోట్లు చెల్లించాల్సి ఉంది. హబ్సిగూడలో రూ.48.3 కోట్లు, హైదరాబాద్‌ సెంట్రల్‌లో రూ.45.4 కోట్లు, సైబర్‌ సిటీలో రూ.45.4 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటితోపాటు 41 శాతం నష్టాలు దక్షిణ సర్కిల్‌లోనే నమోదవుతున్నాయి. అయినా, వాటిని నియంత్రించడానికి విద్యుత్తు సంస్థలు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. బిల్లుల వసూళ్ల కోసం ఇళ్లకు వెళ్లిన సిబ్బందిపై దాడులు జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. గతంలో పలువురు ఇంజనీర్లు, సిబ్బంది దక్షిణ సర్కిల్‌లో తాము పని చేయలేం అని, బదిలీ చేయాలని లేఖలు రాయడం పరిస్థితికి అద్దం పడుతోంది

ఇదీ హైదరాబాద్‌ దక్షిణ సర్కిల్‌ స్వరూపం

ఫ మొత్తం విద్యుత్‌ కనెక్షన్లు- 7.21 లక్షలు ఫ వాణిజ్య: 1.40 లక్షలు ఫ గృహ విద్యుత్తు: 5.68 లక్షలుఫ హెచ్‌టీ కనెక్షన్లు: 241 ఫ డివిజన్లు: బేగంబజార్‌, అస్మాన్‌ఘడ్‌, చార్మినార్‌ ఫ సబ్‌ డివిజన్లు: 9 ఫ సెక్షన్లు: 30 ఫ ప్రతి నెల రావాల్సిన బిల్లులు: రూ.110 కోట్ల నుంచి రూ.120 కోట్లు.

Tank Accident Ladakh: లడఖ్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు సైనికులు మృతి..

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై ఐదుగురు సైనికులు మరణించారు

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా నది దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై ఐదుగురు సైనికులు మరణించారు.

T-72 ట్యాంక్‌లో మందిర్ మోర్హ్ నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరిగి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. దౌలత్‌ బెగ్‌ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిని దాటే ట్యాంక్‌ విన్యాసాలు చేస్తుండగా..

ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి ఉన్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.

విన్యాసాలు చేస్తుండగా..

దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఆర్మీ సైనికులు నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్యాంక్ నీటిలో చిక్కుకుంది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. లడఖ్‌లోని ఎల్‌ఎసి సమీపంలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో ఐదుగురు ఆర్మీ సైనికులు కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. నీటిలోంచి ఇప్పటి వరకు కొందరి మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

నేడు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు రాక

అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం నగరానికి రానున్నారు.

అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం నగరానికి రానున్నారు. సభాపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జిల్లాకు వస్తుండడంతో ఘనంగా స్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి పది గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.

ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా దసపల్లా హోటల్‌కు వెళతారు. అక్కడ ఆయన్ను నగర ప్రముఖులు, అధికారులు, టీడీపీ నాయకులు కలవనున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత అనకాపల్లి వెళ్లి నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ నుంచి నర్సీపట్నం వెళతారు.

జిల్లా ప్రజా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు శనివారం ఉదయం పది గంటల నుంచి జరుగుతాయని సీఈఓ ఎం.పోలినాయుడు తెలిపారు. జడ్పీ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన ఉదయం 10 గంటలకు రెండు, ఐదు, 11 గంటలకు మూడు, నాలుగు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ఒకటి, ఆరు, ఏడు స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని...ఈ సమావేశాలకు సభ్యులు హాజరుకావాలని ఆయన కోరారు.

ఆవులు, గొర్రెలు మరియు కోళ్ల పెంపకానికి ప్రభుత్వం నుండి 58,000 సబ్సిడీ. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు వ్యవసాయం స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని భరోసా ఇవ్వలేరు. ఎందుకంటే మన దేశంలో వ్యవసాయం వాతావరణంపై ఆధారపడి ఉండడం, కరువు, అనావృష్టి, చీడపీడలు, సీజన్‌లో కనీస ధర లేకపోవడం తదితర కారణాల వల్ల రైతు కష్టాలు పడుతున్నాయి. వీటన్నింటి మధ్య భారతదేశం ప్రాథమికంగా గ్రామాల దేశం మరియు మన దేశంలో చాలా మంది ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు.

ఈ విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక పథకాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, సబ్సిడీ రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల బీమా, కిసాన్ సమ్మాన్ ద్వారా సబ్సిడీ నిధులు పెద్ద మొత్తంలో కేటాయించాయి. ఫండ్ పథకాలు మరియు ఇతర పథకాలు.

ఇప్పుడు వ్యవసాయం, పాడిపరిశ్రమ, గొర్రెలు, కోళ్లు మరియు మేకల పెంపకానికి అనుకూలం మరియు అభివృద్ధి చెందింది. వ్యవసాయంతో పాటు వ్యవసాయం, గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడిపరిశ్రమ, పందుల పెంపకం, పశుపోషణ, చేపల వేట మొదలైన వాటి కోసం రైతులు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, తద్వారా ఆర్థికంగా బలపడాలని ప్రోత్సహిస్తారు.

దీన్ని ఎలా పొందాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ పత్రాలు అందించాలి, వివరాలు ఇలా ఉన్నాయి ప్రస్తుతం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా గొర్రెలు, కోళ్లు, మేకల పెంపకం, పాడిపరిశ్రమపై ఆధారపడిన రైతులకు షెడ్డు అవసరం కాబట్టి షెడ్డు నిర్మాణానికి రూ.57 వేల వరకు సబ్సిడీ ఇస్తారు.

తెలుగు రాష్టాల న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

దరఖాస్తుదారులు షెడ్ నిర్మాణానికి సొంత వ్యవసాయ భూమిని కలిగి ఉండి, గొర్రెల కోళ్ల మేకల పెంపకం లేదా పాడి లేదా చేపల వేటలో నిమగ్నమై ఉండాలి.

షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన దరఖాస్తుదారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నాలుగు కంటే ఎక్కువ పశువులను తరలించే రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పశువైద్యుని నుండి ధృవీకరణ పొందాలి.

ఈ పథకం కింద నిర్మించే షెడ్డు 10 అడుగుల వెడల్పుతో పాటు 18 అడుగుల గోడతో పాటు 5 అడుగుల ఎత్తులో గోడ, పార, పశుగ్రాసం ట్యాంక్‌తో నిర్మించాలి. లోపల పశువులకు వెంటిలేషన్ మరియు వెలుతురు వచ్చే విధంగా షీట్లను కూడా నిర్మించాలి.

రూ.57,000 బడ్జెట్ లో రూ.10,556 వేతనాలకు, రూ.46,444 అవసరమైన సామగ్రి కొనుగోలుకు వినియోగిస్తున్నారు.

అవసరమైన పత్రాలు

దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరి

బ్యాంక్ పాస్ బుక్ వివరాలు

షెడ్ నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలం గురించి పత్రాలు పశువుల కోసం పొందిన మెడికల్ సర్టిఫికేట్

సూచించిన దరఖాస్తు ఫారమ్

ఇతర ముఖ్యమైన పత్రాలు

jagan: ఫలితాలు చూసి.. అన్నీ వదిలేసి హిమాలయాలకు పోదామనిపించింది!

ఫలితాలు చూశాక.. షాక్‌ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్‌ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలివి.

ఫలితాలు చూశాక.. షాక్‌ అయ్యా.. ఇదేంటి, ఇంత చేస్తే ఈ రిజల్ట్‌ ఏంటి? అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనిపించింది’.. మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ చేసిన వ్యాఖ్యలివి.

ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటికొచ్చాయి.

ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయనీ మాటలు అన్నట్లు తెలిసింది. ‘నిజంగా వెళ్లిపోదామనే అనిపించింది. ఆ షాక్‌లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజుల పైనే పట్టింది.

కానీ, ఎన్నికల్లో సీట్లు రాకపోయినా 40 శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి, అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది చూశాకనే మనం నిలబడాలి, మనకు ఓట్లు వేసిన జనం కోసం పని చేయాలనిపించింది. దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటికొచ్చా.

Telangana Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

శని ఆదివారాల్లో 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లోనూ తేలికిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

ఇక రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్లాయిలో అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 3.6, రాయికల్ మండలం అల్లీపూర్‌లో 3.1, హనుమకొండ జిల్లా నడికుడిలో 2.6, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 2.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోనూ చిరు జల్లులు పడ్డాయి