/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz హజ్ కమిటీ సభ్యులు షర్పోద్దీన్ ను సన్మానించిన మైనార్టీ నాయకులు Vijay.S
హజ్ కమిటీ సభ్యులు షర్పోద్దీన్ ను సన్మానించిన మైనార్టీ నాయకులు

హజ్ కమిటీ సభ్యులు షర్ఫోద్దీన్ ను సన్మానించిన మైనారిటీ నాయకులు షానూర్ బాబా* ఆలేరు టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కి చెందిన మహమ్మద్ షర్ఫుద్దీన్ కి ఇటీవల తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులుగా నియామకమైన సందర్భంగా బుధవారం రోజున ఆలేరులో మైనార్టీ డెవలప్మెంట్ కమిటీ ఆఫీషియల్ సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ షానూర్ బాబా వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు జహంగీర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పుస్తకాలు , నోట్ బుక్స్ ,యూనిఫామ్ అందజేసిన చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

విద్యార్థులకి పుస్తకాలు, నోట్ బుక్స్, మరియు యూనిఫామ్ అందజేస్తున్న ప్రజల మనిషి రాజన్న* చౌటుప్పల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, చిన్న కొండూరు రోడ్డు జిల్లా పరిషత్ హై స్కూల్, లింగోజిగూడెంలోని పాఠశాలను సందర్శించారు పండుగ వాతావరణం లో పాఠశాలలో పునప్రారంభం చేసుకోవడం జరిగినది. *ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ వెన్ రెడ్డి రాజు* గారు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ..*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. రెసిడెన్షియల్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఉన్నత స్థాయికి వెళుతున్నారు ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం లక్ష్యంగా మంచి విద్యను బోధించడం జరుగుతుంది. ఉచితంగా అందిస్తున్న విద్యను అభ్యసించి పై స్థాయికి వెళ్ళాలని కోరారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వారు కూడా భాగస్వాములు అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కౌన్సిలర్ శ్రీమతి ఉబ్బు వరమ్మ వెంకటయ్య, ఆలె నాగరాజు,శ్రీధర్ బాబు, బొడిగె బాలకృష్ణ పాల్గొన్నారు.
బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చి దిద్దుదాం : వి మాధవి లత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దినోత్సవం" సందర్భంగా తేదీ 12-06-2024 బుధవారం ఉదయం 09 గంటలకు భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశానుసారం, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఆద్వర్యంలో "బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన" కోసం సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సదస్సులో ప్రభుత్వఅధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, వ్యాపారులు, వివిధ కర్మాగారాల యాజమాన్యాలు , ప్రజలు పాల్గొని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, బాలల హక్కుల పరిరక్షణ కోసం, బడి ఈడు పిల్లలు బడిలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.

వంట కార్మికులకు గౌరవ వేతనం రూ. 10వేలు వెంటనే ఇవ్వాలి : AITUC రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్

యాదాద్రి భువనగిరి జిల్లా : మధ్యాహ్న భోజన వంట కార్మికులకు రావలసిన పెండింగ్ మెస్ బిల్లులు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో నెలకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేసి కోడిగుడ్లు మరియు వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేసి, నాణ్యమైన బియ్యాన్ని పాఠశాలలకు పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కోరారు.
            మంగళవారం రోజున మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్
(ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో   కార్మికుల సమస్యలు పరిష్కరించాలి  కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏ. ఓ జగన్ గారికి మరియి డీఈఓ కార్యాలయంలో ఏ. డి ప్రశాంత్ రెడ్డి గారికి వేరువేరుగా  వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  మేనిఫెస్టో పెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తామని దానిని వెంటనే అమలు చేయాలని, మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించరాదని,  కార్మికులను తొలగించరాదని,  ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, వయసు పై బడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగుల గుర్తించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫాం ఇవ్వాలని, అదేవిధంగా స్లాబ్ రేటు పెంచుతూ నిత్యవసర వస్తువులన్నిటిని కూడా సరఫరా చేస్తూ పిల్లలకు పౌష్టికాహారం కింద కోడి గుడ్డను కూడా సరఫరా చేయాలని అయన కోరారు.
          ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాగుల వసంత, ప్రధాన కార్యదర్శి ముంతాజ్ బేగం, నాయకులు సంధ్య, నిర్మల, లక్ష్మీ, అనసూర్య, వాణి, అండాలు, కృష్ణవేణి, సుగుణ తదితరులు  పాల్గొన్నారు.
వలిగొండ: వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామానికి చెందిన కసర బోయిన లింగయ్య మాజీ మత్స్యగిరి  గుట్ట డైరెక్టర్ కూతురు, కుమారుడి వస్త్ర అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గరిసె రవి , మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆవుల స్వామి, సింగిల్ విండో డైరెక్టర్ అరూర్ ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు చిలకమర్రి కనకా చారి ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బండారు మహిపాల్ రెడ్డి ,అరూరు మాజీ సర్పంచ్ చెమ్మయ్య ,మాజీ ఎంపీటీసీ చంద్రయ్య ,అరూరు హై స్కూల్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల సత్యనారాయణ, జినుకల మల్లేష్ యాదవ్, ప్రైమరీ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య, మండల కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్, వెలిమినేటి సంతోష్ కుమార్, కసర బోయిన సాయి మల్లు, గడ్డల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

తీన్మార్ మల్లన్నకు శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కట్ట శేఖర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కట్ట శేఖర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు నరసింహ నాయక్ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టపద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన తీన్మార్ మల్లన్న కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ సమితి నాయకులు ప్రమోద్ ,సంతోష్ ,రాజశేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

కూలి, భూమి పోరాటాలను ఉదృతంగా సాగిద్దాం: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు

సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ మండల కమిటీ సభ్యులు కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి (ధర్మ భిక్షం) గారి ఆశయ సాధనకై కూలీ, భూమి పోరాటాలను ఉదృతంగా కొనసాగిద్దామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ భువనగిరి మండలం చీమలకొండూరు గ్రామంలో రాత్రి జరిగిన కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి గారి సంతాప సభలో పాల్గొని మాట్లాడుతూ పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, కొండ అశోకు, మండల కమిటీ సభ్యులు సిల్వేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, మాజీ మండల కమిటీ సభ్యులు వడ్డెబోయిన వెంకటేష్, సిపిఎం శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు, ముత్తిరెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, ముస్త్యలపల్లి శాఖ కార్యదర్శి కళ్లెం లక్ష్మి నరసయ్య , శాఖ సభ్యులు రావుల పోషాలు, రావుల కిష్టయ్య , పల్లెర్ల వినోదు , గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

కూలి రేట్ల పెంపుకై కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బయలుదేరిన హమాలీ కార్మికులు

కూలి రేట్ల పెంపుకై కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు బయలుదేరి వెళ్లిన హమాలీ కార్మికులు ..* తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సప్లయి కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కూలి రేట్లు క్వింటాకు ఎగుమతి దిగుమతి రూ.40/-పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో కూలి రేట్లు పెంచాలని *చలో కమిషనర్ భవన్ (మహాధర్నా)* సందర్బంగా భువనగిరి నుండి కార్మికులు హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు రెండు సంవత్సరాలకు ఒకసారి కూలి రేట్లు పెంచేందుకు గత ప్రభుత్వాలు జీవో విడుదల చేశాయని దాని ప్రకారం జనవరి 2024 సంవత్సరం నుండి హమాలీ కార్మికుల రేట్లు పెంచాలని కానీ సివిల్ సప్లయి కమీషనర్ ఆరు నెలలు గడిచిన పట్టించుకోవడంలేదని అన్నారు. హమాలీ కార్మికులు చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా అందించే నిత్యవసర వస్తువులను పేద బడుగు బలహీన వర్గాలకు అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కానీ హమాలీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీగురిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లిన రేపు మాపు అంటూ కాలయాపన చేస్తుంది, తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు హమాలి కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ప్రతి కార్మికునికి ఈ ఎస్ ఐ, పి ఎఫ్, బోనస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు హమాలీ కార్మికులకు బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం 50 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులకు నెలకు 5వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు ,మహిళా స్వీపర్లకు నెలకు రూ.10వేలు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, సివిల్ సప్లై హమాలి వర్కర్స్ యూనియన్ భువనగిరి పాయింట్ అధ్యక్షులు ముదిగొండ బసవయ్య, నాయకులు మామిండ్ల సత్యనారాయణ, గొరవంతల శ్రీను, బొజ్జ గణేష్, పిన్నం జగన్, పల్లెర్ల మైసయ్య, కొండ మల్లేష్, స్వామి, వెంకటేష్, బాలరాజ్, నర్సింహా, మల్లేష్, పాండు, తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: వలిగొండలో ఉద్యమకారుల ఫోరం ప్రెస్ మీట్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో.తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు. రాష్ట్రవ్యాప్తంగా. నేడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25 వేల రూపాయల పెన్షన్ మిగతా రాయితీలు ఇచ్చి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ వలిగొండ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సంగిశెట్టి క్రిస్టఫర్. మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25 వేల పెన్షన్ వెంటనే అమలు చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఉద్యమకారుల పొలం.మండల అధ్యక్షులు మారగోని .శ్రీనివాస గౌడ్. చాంద్ పాష. శీలం స్వామి., గంధ మల్ల. మల్లమ్మ. బాలయ్య. నోముల శంకర్, సురుపంగా గణేష్. ,ఎక్కల. దేవి. శీను.. మంటి రమేష్. కదిరేణి స్వామి. ఐటిపాముల పుష్ప. మంటి. లింగం. మంటి శంకర్. మునుకుంట్ల ఎల్లయ్య. తదితరులు పాల్గొన్నారు.
నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై విచారణ జరపాలి : AISF జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్

భువనగిరి.: నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై విచారణ జరపాలి.* *ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి , ఉప్పుల శాంతి కుమార్
దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, మే 5న పరీక్షను నిర్వహించడం జరిగింది.దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షను రాశారు. ప్రకటించిన ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు, విద్యార్ధి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.వారి అనుమానాలకు సజీవ సాక్ష్యం ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం మరల వారి యొక్క పరీక్ష కేంద్రం ఒకటే కావడం వలన వారి అనుమానాలకు బలాన్నిస్తుంది. కావున తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి పరీక్ష రాసిన మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షను రద్దు చేయాలనీ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన కూడా వారి మాటని పెడచెవిన పెట్టి, నిర్లక్ష్యం చేయడం ద్వారా వేలాది మంది ప్రతిభగల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై, పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచేతవిచారణ జరిపించాలని ఉప్పుల శాంతి కుమార్ డిమాండ్ చేయడం జరిగింది.