భద్రాచలం పారామెడికల్ విద్యార్థి మరణం పై న్యాయవిచారణ జరిపించాలి: PYL డిమాండ్
పత్రిక
భద్రాచలం పారామెడికల్ మారుతీ కాలేజీలో అనుమాన స్థితిలో మరణించిన పగిడిపల్లి కారుణ్య విద్యార్థి మరణం పై న్యాయ విచారణ జరిపించాలి.ఇండియన్ నర్శింగ్ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలి.పి వై ఎల్ డిమాండ్
కోడిజర్ల మండలం ఓ గ్రామం నుండి భద్రాచలం వచ్చి డాక్టర్ కాంతారావు నడుపుతున్న మారుతీ పారామెడికల్ కాలేజీలో BSC నర్సింగ్ చదువుతున్న పగిడిపల్లి కారుణ్య ఎలా చనిపోయిందో,కలెక్టర్, SP, పోలీస్ వారు విచారణ జరపాలని ప్రగతిశీల యువజన సంఘం(PYL )జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యం cc, పుటజ్ నీ డిలీట్ చేయడం అనుమానస్పదంగా మారిందని అయన ప్రకటనలో తెలిపారు. గురువారం రాత్రి 8,గంటలకు భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ లో చనిపోయినట్టు నిర్దారించారు.శుక్రవారం మధ్యాహ్నం 3,గంటలకు 25, లక్షలకు కాలేజీ యాజమాన్యం సెటిల్ మెంట్ చేశారు దీనిపైన హైకోర్టు విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్ శరత్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
పారామెడికల్ మారుతి కాలేజ్ కి దాని యాజమాన్యానికి ఎటువంటి సంబంధాలు లేదని వాళ్ల తల్లిదండ్రులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ గారు,SP గారు విచారణ జరిపి తగు న్యాయం జరిపించాలని ఒక డిమాండ్ అయితే మా డిమాండ్ విద్యార్థిని మరణించిన స్థలంలోకి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మిత్రబృందాన్ని కానీ తన ఉన్న రూముని కానీ తను క్రింద పడిన స్థలాన్ని కానీ జరుగుతున్న అన్నింటిని గమనించి సరైన మార్గంలో ఎంక్వారి చెయ్యాలని నిజనిర్ధారణ ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని వారు అన్నారు.ఇటువంటి సంఘటనలు ఇకముందు పునరుద్దరణ జరకుండ ఆ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తప్పు ఎవరిదైనా ఎంత వారిదైనా చట్టం న్యాయం ముందు అందరు సమానమే అని గుర్తించి కఠినంగా శిక్షంచాలని నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మారుతీ నర్సింగ్ కాలేజీపై ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కు కంప్లెన్ట్ లెటర్ సిపారస్ చెయ్యాలని ముసలి సతీష్ డిమాండ్ చేశారు.
అమ్మాయి తల్లిదండ్రులు కొట్టుకొని విడిపోయారు మేనమామ ఆ అనాధను కస్టపడి చదివించారు అమ్మ నాన్న లేకపోవడంతో భయంతో పెరిగింది ఆ అమ్మాయి చనిపోయిన ప్లేస్ కు వెళ్లకుండా ఆత్మ అత్య అని 25లక్షలు సెటిల్ మెంట్ చేశారు అధికారులు .దీన్ని విద్యార్థి సంఘలు యువజన సంఘలు తీవ్రంగా ఖండిస్తున్నాయి కరణ్యకు న్యాయం జరిగేదాకా ఉద్యమాలు జరుగుతాయి అని హెచ్చరించారు.
May 27 2024, 08:41