/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఏపీలో రికార్డు స్థాయి తుది పోలింగ్ శాతం... ఎంతంటే... Miryala Kiran Kumar
ఏపీలో రికార్డు స్థాయి తుది పోలింగ్ శాతం... ఎంతంటే...

ఏపీలో తుది పోలింగ్‌ శాతం ప్రకటించిన ఈసీ

ఏపీలో రికార్డుస్థాయిలో 80.66 శాతం పోలింగ్‌

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 1.2 శాతం మేర నమోదు

మొత్తంగా 81.86 శాతం పోలింగ్‌ నమోదు

TS:రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతాం:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: దేశంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు.. కాంగ్రెస్‌, బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెళితే ఆ పార్టీ ఉండదు.. రేపటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతాం.. రుణమాఫీ, విద్యాశాఖపై ఫోకస్ పెడతాం.. అన్ని హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ చేస్తాం.. త్వరలో బ్యాంకర్లతో సమావేశం.. రుణమాఫీపై చర్యలు చేపడతాం.. రైతుల రుణాల మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.. తెలంగాణలో మేము 13 సీట్లు గెలుస్తున్నాం. -మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ రెడ్డి.

ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..

ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు.. ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. కోర్టు విచారణకు కవితను వర్చువల్‌గా హాజరుపర్చిన తీహార్ జైలు అధికారులు.. 8 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని 20న విచారిస్తామన్న జడ్జి.

తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరవాసులకు వాతావరణ శాఖ మరో మూడు రోజులు పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించారు. అలాగే ఆయా జిల్లాలో ఎన్నో అలర్ట్‌ జారీ చేశారు.

తెలంగాణకు వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా వాతవరణంలో భిన్నమైన మార్ఫులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఓ వైపు భగ భగ మంటూ ఎండలు దంచికొడుతున్నాయి. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అత్యధిక ఉష్ణోగ్రతలతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నా వేళ.. గత వారం రోజుల నుంచి వాతవరణం చల్లబడింది. కాగా, పలు ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరవాసులకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే ఆయా జిల్లాలో ఎన్నో అలర్ట్‌ జారీ చేశారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పగటి పూట ఎండలు దంచికొడుతుంటే.. మరో వైపు సాయంత్రం వేళ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు అనగా ఈనెల 17 వరకు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా.. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేశారు.

అయితే ఆ వర్షాలు అనేవి కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడుతుందని.. మరి కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందన్నారు. అలాగే ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. కాగా, నేడు మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, నారాయణపేట, గద్వాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.

ఇక బుధవారం మే 15వ తేదీన పై జిల్లాతోపాటు సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, వికారాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్‌ నగరంలో నేడు, రేపు సాయంత్రం, రాత్రి సమయాల్లో జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. మాగ్జిమం 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పారు. మరి, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతవరణ శాఖ తెలియజేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఓటు హక్కును వినియోగించుకున్న అడ్వకేట్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెల శివకుమార్

ఓటు హక్కును వినియోగించుకున్న అడ్వకేట్ కట్టెల శివకుమార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు

నల్గొండ నియోజకవర్గ 92 పార్లమెంట్ ఎలక్షన్ లో పోలింగ్ బూత్ 50 jbs స్కూల్ పాతబస్తీ నల్గొండ నందు ఓటు వేసి అనంతరం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ...

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని భారత రాజ్యాంగం మరియు రాజ్యాంగ పరిరక్షణకై కృషి చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ విధిగా బాధ్యతతో ఓటు వెయ్యాలని తెలియజేయడం జరిగింది.

త్రీనయని సీరియల్ నటి పవిత్ర జయరాం దుర్మరణం

త్రీనయని సీరియల్ నటి పవిత్ర జయరాం దుర్మరణం

హైదరాబాద్‌: తెలుగు సీరియల్‌ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు. మహబూబ్‍నగర్‌ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం సీరియల్‌ షూటింగ్‌ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె, శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను తాకి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర తీవ్రంగా గాయపడగా, ఆమెను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్‌ గాయపడ్డారు. ధారావాహికలు ‘త్రినయని’ , ‘నిన్నే పెళ్లాడుతా’ సీరియల్స్‌ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పవిత్ర మృతిపై జీ తెలుగు విచారం వ్యక్తం చేసింది. ‘‘తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్రా జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు’’ అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.

కర్ణాటకలోని మండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ‘జోకలి’ సీరియల్‍తో ఆమె నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘రోబో ఫ్యామిలీ’, ‘గాలిపటా’, ‘రాధారామన్’, ‘విద్యా వినాయక’ సహా కన్నడలో పలు సీరియళ్లు చేశారు. తెలుగులో ‘త్రినయని’ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో తిలోత్తమగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో తనదైన నటన ప్రదర్శించారు. పవిత్ర మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తోటి నటీనటులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఓటు హక్కును వినియోగించుకోండి సమర్థులను ఎన్నుకోండి: సమాచార హక్కు వికాస సమితి నల్గొండ ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్

ఓటు హక్కును వినియోగించుకోండి సమర్థులను ఎన్నుకోండి

నేడు నలగొండ లో జరిగిన ఓటర్ల చైతన్య అవగాహన కార్యక్రమంలో సమాచార హక్కు వికాసమితి ముఖ్యఅతిథిగా ఎర్ర మాద కృష్ణారెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించు కోవాలని, సమర్ధులను, సేవకులను ఎన్నుకోవాలని అన్నారు. 

సోమవారం రోజు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి వున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వెయ్యడం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వేచ్ఛాయుతంగా నిర్భయంగా ఓటరుకు నచ్చిన సమర్ధుడైన అభ్యర్థికి ఓటు వెయ్యడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చెయ్యడం జరుగుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలని, సేవకులైన వారిని పాలకులగా ఎన్నుకోవాలని , నల్గొండలో ని క్లాక్ టవర్ వద్ద జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఓటర్ల అవగాహన చైతన్య కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సూచించిన సమాచార హక్కు వికాస సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్.

మతోన్మాద బీజేపీనీ చిత్తు చిత్తుగా ఓడించండి* *బీఆర్ఎస్ ను తిరస్కరించండి.భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్

 మతోన్మాద బీజేపీనీ చిత్తు చిత్తుగా ఓడించండి 

బీఆర్ఎస్ ను తిరస్కరించండి.భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ 

 ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించండి.

సిపిఐ (ఎం_ఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల మండలం త్యాగడ గ్రామంలో ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించాలని, బిజెపిని ఓడించాలని, బి ఆర్ ఎస్ ను తిరస్కరించాలని గ్రూప్ మీటింగ్ నిర్వహించారు.

 ఈ సందర్భంగా భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్

 పాల్గొని మాట్లాడుతూ పదేళ్ల పాలనలో ప్రజల సంపదను ,వనరులను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం అప్పచెప్పిందని అన్నారు. దేశంలో కులం,మతం,బాషా పేరుతో మతోన్మాద విద్వేషాలను, వైశామ్యాలను బి జె పి సృష్టిస్తుందన్నారు.రాజ్యాంగాన్ని రద్దు చేసి,రిజర్వేషన్లు ఎత్తివేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయుటకు కుట్ర జరుగుతోందని అన్నారు. నిర్బంధం, నియంతృత్వం, దేశద్రోహం కేసులతో ప్రశ్నించే వారిపై కుట్రలు కేసులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. మహిళలపై, ఆదివాసులపై, దళితులపై,ముస్లిం లపై రోజురోజుకు దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ధ్వంసం చేస్తూ కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలంటే,ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన కొనసాగించిన బిజెపిని ఓడించాలని, తగిన బుద్ధి చెప్పాలని, ఇండియా కూటమి బలమైన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో సమ్మక్క రాంబాబు రాజు పార్వతి సంధ్య కావేరి సుజాత సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించండి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రెస్ మీట్ లో ప్రజలను కోరిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

కుందూరు రఘువీరారెడ్డి నీ గెలిపించాలని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొని సూర్యాపేట ప్రజలను కోరిన రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్

*సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్ కుమార్ గారితో కలిసి నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ..... ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు, భారత రాజ్యాంగం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.ఐదు లక్షల భారీ మెజార్టీతో కుందూరు రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను, ప్రజలను కోరడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కస్తాల సైదులు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం హుజూర్నగర్ నాయకులు మంగపల్లి శోభన్ సోమపంగు వీరబాబు సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ 

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న నియోజకవర్గ అధ్యక్షులు పగడాల శివతేజ సురేందర్ ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో కుందూరి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కదిలి రండి: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టేల శివకుమార్

వందలాది మంది యువకులు కలిసి కుందూరి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కదిలి రండి: ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టేల శివకుమార్

రాబోయే ఎలక్షన్లో రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కదిలి రావాలని, నేను మార్నింగ్భా లో గంగా కొంతమంది యువకుల్ని కలిసి రఘువీర్ రెడ్డిని గెలిపించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ సూచించారు.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు వస్కుల మహేష్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న నియోజకవర్గ అధ్యక్షులు పగడాల శివతేజ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.