/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీ కొడుకుల మృతి Vijay.S
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీ కొడుకుల మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ ఎం మండల పరిధిలోని రాయిపల్లి గ్రామానికి చెందిన బోడ నరేష్,అతని కుమారుడు సాయి 10 చాడ గ్రామంలో బంధువులు ఇంటికి పండుగకి వెళ్లి.ఇంటి పక్కనే ఉన్న బావిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రి కొడుకులు ఇద్దరు మరణించారు.మృతి చెందిన బాలుడు సాయి ఆత్మకూరు ఉన్నత పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్నాడు.మృతుడు నరేష్ గతంలో చాలా రోజులు ఆత్మకూరు రాంనగర్ కాలనిలో నివాసం ఉండి మేస్త్రి పని చేసుకునేవాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అంగన్వాడి స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు, పిల్లలకు అసెస్మెంట్ కార్డులు అందజేసిన ఐసిడిఎస్ సూపర్వైజర్ గోద ధనలక్ష్మి


వలిగొండ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ- 2 మరియు 6 కేంద్రాల్లో ఈసీసీ డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ గొద ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లలకు ఆటపాటతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ సేవలు వినియోగించుకోవాలని తల్లులకు బాలింతలకు సూచించారు. వలిగొండ మండల కేంద్రంలోని అంగన్‌వాడీ- 2 మరియు 6 కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో అసెస్మెంట్ కార్డు ఇవ్వడం జరిగింది. అంగన్‌వాడీ స్కూల్ లను సద్వినియోగం చేసుకోవాలని టీచర్లు జి. బాలవిజయ, సిహెచ్ సబిత సూచించారు. ఈ కార్యక్రమంలో తల్లులు,బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ లో చేరిన మోటకొండూరు వైస్ ఎంపీపీ మల్లేష్


యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య నివాసంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు శ్రీ,, బీర్ల ఐలయ్య మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరుపు యాదగిరి గౌడ్ సమక్షంలో మరియు మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యెల్లoల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మోటకొండూరు మండలం మాటూరు గ్రామం నుండి బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మోటకొండూర్ వైస్ ఎంపీపీ ఇల్లందుల మల్లేష్ గౌడ్ ఎంపీటీసీ అంబాల శ్రీనివాస్ మరియు 100 మందికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీల స్తూపం వద్దకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు


రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి సవాలు చేసి తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు వచ్చిన హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాలను స్వీకరించాలి

తను రావడానికి మొహమాటంగా ఉంటే తన పిఏతో అయినా స్టాఫ్ తో అయినా రాజీనామా లేఖను పంపించాలి

జర్నలిస్టులసాక్షిగా లేదా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్న

ఆగస్టు 15th లోగా ఏకకాలంలో రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు(13 హామీలు) అమలు చేయాలి

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది

డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది

సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు

రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను

రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు.

బునాది గాని కాలువను సాధించి రైతాంగానికి సాగునీరు అందించిన సిపిఎం ను గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ


బునాది గాని కాలువను సాధించి రైతాంగానికి సాగునీరు అందించిన సిపిఎం పార్టీ అభ్యర్థి యండి జహంగీర్ గారి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల పరిధిలోని నందనము, నమాత్ పల్లి, తుక్కాపురం బొల్లెపల్లి, నాగిరెడ్డిపల్లి తో పాటు పలు గ్రామాలలో సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి ఎండి. జాహంగీర్ ను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ ఎర్రజెండా సిపిఐ ఎం పార్టీ నాటి నుండి నేటి వరకు భూమి కోసం భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం అనేక పోరాటాలు నిర్వహించి పేదలకు అండగా ఉన్నదని అన్నారు. దున్నేవాడికి భూమి కావాలని, ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లు ఇళ్ల స్థలాలు కావాలని రైతుకు గిట్టుబాటు ధర కావాలని, వ్యవసాయ కూలీలకు కూలి రేట్లు పెరగాలని సమరశీలంగా ఉద్యమించి ప్రజలకు అండగా నిలిచిందని అలాంటి ఎర్రజెండా పార్టీకి పార్టీ అభ్యర్థికి ప్రజలు ఎన్నుకుంటే ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారని తెలియజేశారు. అవకాశవాద రాజకీయాలతో డబ్బుల సంచులతో కులము మతము ప్రాంతము పేర్లతో ప్రజల్ని విభజించు పాలించు అనే విధంగా కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ అభ్యర్థులు ముందుకు వస్తున్నారని వారికి ఏనాడు ప్రజల పక్షాన పోరాడిన చరిత్ర లేదని అలాంటి వారికి ఓట్లు వేస్తే ఈ నియోజకవర్గ మరింత వెనుక పాటు గురవుతుందని అన్నారు. ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాగు, సాగునీరు కోసం, విద్య, వైద్యం కోసం నిరంతరం పోరాడే ఎర్రజెండా అభ్యర్థి జహంగీర్ గారి గెలిపించాలని నర్సింహ ప్రజలను కోరినారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, కారేపల్లి సిపిఎం మండల కార్యదర్శి కే నరేంద్ర, గిరిజన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రామారావు, సిపిఎం భువనగిరి మండల కమిటీ సభ్యులు ఎల్లంల వెంకటేష్, కొండాపురం యాదగిరి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, ఎన్.పి.ఆర్. డి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, దానయ్య, శివ, తదితరులు పాల్గొన్నారు.

       

చికిత్స పొందుతూ నా తాళ్ల గూడెంకు చెందిన వ్యక్తి మృతి

గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలోని నా తాళ్ల గూడెం లో గురువారం చోటు చేసుకుంది .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండలంలోని నాతాల్ల గూడెం కు చెందిన కొరబోయిన కృష్ణ వయస్సు 29 ,ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. మంగళవారం స్వగ్రామానికి చేరుకున్న అతను గ్రామములో నిర్మించ తలపెట్టిన ఇంటి నిర్మాణం విషయంలో మానసిక ఒత్తిడికి తట్టుకోలేక, జీవితం మీద విరక్తి చెంది రైల్వే ట్రాక్ సమీపంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు .గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న కృష్ణను స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

భువనగిరి రోడ్ షో లో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేసీఆర్ బస్సు యాత్ర - 2 వ రోజు.

సూర్యాపేట నుంచి మధ్యాహ్నం బయలుదేరిన కేసీఆర్, వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి చేరుకున్నారు.

మార్గమధ్యంలో పలు చోట్ల కార్యకర్తలు ప్రజలు అభిమానం తో దారిపొడవునా ఘన స్వాగతం పలికారు.

సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన భువనగిరి రోడ్డు షోలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సాయంత్రం భువనగిరి లో నిర్వహించిన రోడ్డు షోలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం - ముఖ్యాంశాలు :

మొత్తం మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి.

పిచ్చిగా ఉన్మాదం తో కాకుండా ఏపార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీ మనకోసం పనిచేస్తదో ఆలోచించి ఓటేయాలి

బీజేపీ మేకిన్ ఇండియా అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఒక్కటి అమలు చేస్తాలేదు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మీద దాడులు

డాలరు విలువ 83 రూపాయలకు పెరిగింది

ఒకపార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతంది.. ఇంకో పార్టీ దేవుని మీద ఒట్లు .. ఇదీ నడుస్తాంది

మనం అద్భుతంగా యాదాద్రిని నిర్మించుకున్నం కానీ ఎన్నడూ ఓట్లకోసం వాడుకోలే

భోనగిరిలో బిజెపి కాంగ్రెస్ మిలకత్ అయినయి

అక్షింతలు తీర్థాలు మన పిలగాన్ల కడుపునింపుతదా .?

తలకాయ తెగిపడ్డా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన మోడీ కి

కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే

ఇవ్వాళ ఎంపీ గా పోటీ చేసేటాయిన అయ్యల ఎంత అడిగిన ఇయ్యాలే 

తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ

ఇప్పుడు యువత ఆలోచించాలి భవిష్యత్తు మీదే

మన శత్రువే కాంగ్రెస్ పార్టీ

నాడు ఎవ్వడు లేకున్నా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుని పదేండ్లు నడిపినాం

తల్లికొడివలే అందరినీ కాపాడుకున్నాం

మొదటి సంవత్సరం లోనే చెడిపోయిన కరెంటును బాగుచేసుకున్నాం రైతుబంధు ఇచ్చుకున్నాం

బసవపురం రిజర్వాయర్ కట్టుకున్నం

ఐదేకురాలకు ఇస్తామంటే ఆరో ఏకురం వాడు ఎటుపోవాలి

పొలాలను ఎండబెట్టిండ్రు

బోర్లు ఎండినాయి పూడికలు తీసే క్రేన్లు మల్లోచ్చినాయి

ధాన్యం కొంటలేరు

రాత్రిపూట మోటర్ పెట్టి పాము కాట్లకు సచ్చే దుర్మార్గపు పాలన కాంగ్రెస్ ది

కేసీఆర్ పొంగనే కట్క బంజేసినట్టే నీళ్లు ఆగినాయి కరెంటు ఆగింది

దద్దమ్మనప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు

రైతులు చనిపోతే ఒక్క మంత్రి పోలె సీఎం పోలె

నా కండ్లముందాలనే పంట ఎండిపోతే ఎంజేయాల్నే నోరుమూసుకుని ఊకోవాల్నా కొట్లాడాల్నా.?

ఫీజు రీబర్సంట్ ఇస్తాళేరు

చేనేత కార్మికులను ఆదుకుంటాలేరు

నిరుద్యోగ బృతి లేదు బోగస్

ఐదొందలు బోనస్ అన్నరు ఇప్పుడు లేదు అంటున్రు

రెండు లక్షలు రుణ్మాఫీ అన్నారు ఇచ్చిండ్రా

తులం బంగారం తుస్సుమన్నది బోనస్ బోగస్ అయింది

గృహకు జ్యోతి విద్యుత్తు పరిస్థితి అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు అయింది 

స్కూటీ రాలేదు కానీ లూటీ అయితాది

తెలంగాణ కు కాంగ్రెస్ కు పంచాతి పడ్డది మీరు ఎవలిని కోరుకుంటారు పంచ్ గా…

కేసీఆర్ కేసీఆర్ ప్రజల స్పందన  

నన్ను తెలంగాణ కోసం పుట్టించిండ్రు దేవుడు

ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్… కేసీఆర్ గుండె చీలిస్తే కనపడితే కనిపించేది తెలంగాణ ప్రజలు

దేర్ హోగా మగర్ అందేర్ నహీ

మనది సెక్యులర్ పార్టీ

నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిండ్రు.. ప్రాణం పోయేదాకా న్యాయం కోసం కొట్లాడుతాం

బిఆర్ఎస్ కార్ గుర్తుమీద ఓటేసి క్యామ మల్లేష్ గారిని గెలిపించండి

ఆయన 24 గంటలు మీ సేవలో వుంటాడు తలలో నాలుక లాగా ఉంటాడు

* ఇదే ఉత్సాహం మే 13 దాకా చూయించి బీఆర్ ఎస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి.

సొంతగూటికి చేరుకున్న గోదా రాహుల్ గౌడ్


గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాయినింగ్ కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి మరియు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మరియు మన ఎమ్మెల్సీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మహేష్ కూమార్ గౌడ్ ఆధ్వర్యంలో యాదాద్రి బోవనగిరి జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ ఓబీసి విభాగం చైర్మన్ గోద రాహుల్ గౌడ్ మరియు వారి బృందం తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

జారగాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కాంగ్రెస్ పార్టీ పెద్దలు బలపరిచిన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారి గెలుపు కోసం పని చెస్తాను తెలపడం జరిగింది.

భువనగిరి పార్లమెంట్ మైనార్టీ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో సమావేశం


 భువనగిరి పట్టణంలోని న్యూ వివేరా హోటల్లో భువనగిరి పట్టణ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ రాశేద్ హుస్సేన్ అధ్యక్షతన భువనగిరి పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల మైనార్టీ ఇన్చార్జిలు మరియు ముఖ్య మైనారిటీ నేతలతో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంటు మైనార్టీ ఇన్చార్జ్ జమల్ షరీఫ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఇంచార్జ్ జమాల్ షరీఫ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి ఖిలా మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు. దేశంలో కొనసాగుతున్న మోడీ నియంతృత్వ పాలనను ప్రాలదొలి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. బిజెపి ప్రభుత్వము మతాల మధ్య చిచ్చుపెట్టి దేశంలో కలిసిమెలిసి అన్నదమ్ముల లాగా ఉంటున్న అమాయక ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను దోసి అదానీ అంబానీలకు కట్టబెట్టడమే కాకుండా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం దుర్మార్గం అని దుయ్యబట్టారు. అంతేకాకుండా మళ్ళీ తిరిగి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రతి ఒక్కరూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పై ఓటు వేసి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీ తో గెలిపియాలని కోరారు.కోరారు. 2009 లో భువనగిరి పార్లమెంటు నూతనంగా ఏర్పడిన తర్వాత మొత్తం మూడుసార్లు ఎన్నికలు జరిగితే రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ ఇన్చార్జ్ మహమ్మద్ రఫీ, భువనగిరి అసెంబ్లీ ఇంచార్జ్ సయ్యద్ రాషేద్ హుస్సేన్, రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రెటరీ రఫీయొద్దీన్ గౌరీ, మున్సిపల్ కౌన్సిలర్ సలావుద్దీన్, మాజీ కోఆప్షన్ ఆబిద్ అలీ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అవెస్ చిష్టి,మైనార్టీ నాయకులు యూనుస్, మొహమ్మద్ అతహర్,షేక్ షబ్బీర్, అబ్దుల్ మన్నన్, అబ్బు చావుష్. తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు


వలిగొండ మండల పరిధిలోని కెర్చిపల్లి గ్రామం నుండి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ శాఖ అధ్యక్షులు కందకట్ల సత్తిరెడ్డి,కళ్ళం అచ్చిరెడ్డి,వలమల్ల అమరేందర్,దయ్యాల కృష్ణ,దయ్యాల యాదయ్య,దయ్యాల ఐలయ్య,దొడ్డారపు పెంటయ్య,భర్మ గణేష్,భర్మ శ్రీ శైలం,శిలోజు వెంకటేష్ చారి,కళ్ళెం రామరెడ్డి,లోడె యాదయ్య,శ్యామల లక్ష్మయ్య,కందడి నర్సిరెడ్డి,దయ్యాల సత్యనారాయణ,కందడి రాంచంద్రారెడ్డి,గుండు సత్తిరెడ్డి,కందగట్ల లక్ష్మారెడ్డి,కందకట్ల వెంకట్, రెడ్డి కళ్ళెం సత్తిరెడ్డి 100 మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు ఎమ్మె వెంకటేష్,యూత్ అధ్యక్షులు లోడె శ్రీకాంత్,ఉపాధ్యక్షులు కోల వెంకటేష్,గునిగంటి బాలయ్య,శివకుమార్,శ్రీనివాస్ రెడ్డి,కిష్టారెడ్ది పాల్గోన్నారు.