సుదర్శన క్రియ, మెడిటేషన్, యోగ కార్యక్రమాల కరపత్రాల ఆవిష్కరణలో పాల్గొన్న గుత్తా అమిత్ కుమార్ రెడ్డి
చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం లో సుదర్శన క్రియ, మెడిటేషన్, యోగ కార్యక్రమాల కరపత్రాల ఆవిష్కరణలో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈనెల 27వ తేదీ నుండి ఉరుమడ్ల గ్రామంలో మూడు రోజులపాటు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ద్వారా 30 సంవత్సరాల అనుభవం కలిగిన శ్రీ శ్రీనివాస రావు గురూజీ గారిచే గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడే సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ క్లాస్ ద్వారా ప్రతి ఒక్కరు జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.
కరపత్రాల ఆవిష్కరణలో GVR ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారు, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు తో కలిసి మాట్లాడుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారదోలి, ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు. దీనివల్ల మీరు యోగా యొక్క ప్రాచీన ఆచరణాలు, ధ్యానం మరియు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను చక్కగా పొందుతారు అన్నారు.
సుదర్శన క్రియ ద్వారా శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి పొందుతారని, వ్యక్తిగత సంబంధాలను పెంపొందించుకుంటారని, రక్త పోటు, మధు మేహం, ఉబ్బసం మొదలగు వాటిని అరికట్టవచ్చని, గుండె జబ్బులు, పక్షపాతం, మైగ్రేన్, సైన సైటీస్, చర్మవ్యాధులు, గ్యాస్టిక్ మరియు ఎన్నో ఒత్తిడి వల్ల వచ్చే వ్యాధులను అరికట్టవచ్చునని తెలియజేశారు.
కాబట్టి ఈ యొక్క ఉరుమడ్ల గ్రామంలో నిర్వహించబడు సుదర్శన క్రియ, యోగ, మెడిటేషన్ కార్యక్రమాలు చిట్యాల మండల ప్రజలు యువకులు మహిళలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గుత్తా యువసేన నల్గొండ జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు జన్నపాల శ్రీను, బోయ స్వామి, పోలగోని శ్రీశైలం, మర్రి అశోక్, ఉడుగు పాండు, పోలగోని శంకరయ్య, మర్రి రమేష్, మాధగోని వెంకన్న, పోలగోని నరేష్, దినేష్, స్వామి, శివ, నరేష్, దిలీప్, లింగస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Apr 24 2024, 21:22