ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ వెంకటరమణి
ఓ భూమిని ఎల్‌ఆర్‌ఎస్ చేయడం కోసం టీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుం ది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పాల్వంచ మున్సిపల్ కార్యా లయంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ టీపీఎస్ గాపని చేస్తున్న వెంకటర మణి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్నకుమార్ ఓ భూమి విషయంలో ఎల్‌ఆర్ ఎస్ చేయడం కోసం ప్లాట్‌కు రూ.10 వేల చొప్పున మూడు ప్లాట్లకు రూ.30 వేలు డిమాండ్ చేశారు.
తాను రూ.30 వేలు ఇవ్వలేనని, ప్లాట్‌కు రూ.5 వేల చొప్పున.. రూ.15 వేలు ఇస్తామని పాల్వంచకు చెందిన భూ యజమాని కాంపెల్లి కనకేష్ సదరు ఉద్యోగులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
తర్వాత ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించిన కనకేష్.. వారి సూచన మేరకు గురువారం టీపీఎస్‌కు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి రూ.15 వేలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ రమేశ్ వెల్లడించారు.
ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొ చ్చన్నారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, ఫిర్యాదుదారులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు...
Apr 19 2024, 07:52