భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి
![]()
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల లో ఊసర వెళ్లిలా పార్టీలుమార్చేరాజకీయ నాయకులను ఓడించండి
మచ్చలేని నాయకుడు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ గారిని గెలిపించండి
ఆదివారం సిపిఎం భువనగిరి మండలం నమాత్ పల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ గారిని గెలిపించాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోముఖ్య అతిధి గా పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అవకాశవాద రాజకీయనాయకులను ఓడించి ప్రజల కోసంపోరాటాలు నిర్వహించే ప్రశ్నించే ఉద్యమకారున్ని గెలిపించాలని కార్మికులు కర్షకులు పేదలు పోరాటాల ముద్దుబిడ్డ ఎండి జహంగీర్ ను భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు రాజకీయాలు అంటే కోట్లాది రూపాయల డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యంగా నేటి రాజకీయ నాయకులు మారిపోయారని పదవుల కోసం పూటకో పార్టీ మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఇలాంటి పరిస్థితులలో భువనగిరి పార్లమెంటుకు సీపీఎం పార్టీ అభ్యర్థి. 35 సంవత్సరాలుగా పేదల కోసం , రైతాంగానికి సాగునీటికోసo నిరాహారదీక్షలు , పాదయాత్రలుచేసి అనేకసమస్యలనుపరిష్క రించిన ఎండి జహంగీర్ గారిని ఎన్నికలలో అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని ఈ ఎన్నికలలో జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ప్రజలందరూ ఓటు వేసి అత్యధికమెజారిటీ ఓట్లతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలనిభువనగిరి పార్ల మెంట్ పరిధి లోపరిశ్రమలు, విద్యా,వైద్యం, ఐటీ,హబ్. గాఅభి వృద్ది జరగాలంటే
ఢిల్లీ పార్లమెంట్ లో రావి నారాయణ రెడ్డి వారాసుడీ గా md జహంగీర్ కు ఓట్లు వేసిగెలిపించాలని
ఆయన ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మందల కార్యదర్శి
దయ్యాల నర్సింహా, మండలకమిటి సభ్యులు
ఎల్లంల వెంకటేశం, రైతు సంఘం జిల్లాకమిటిసభ్యులుజిట్టా అంజిరెడ్డి పార్టీ సీనియర్ నాయకులు బ త్తిని దానయ్య , అయిత రాజు కిష్టయ్య, ఎల్లంల అయి లయ్య, తదితరులు పాల్గొన్నారు.
![]()


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మోత్కూరు పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ట్రస్ట్ అధ్యక్షులు మోత్కూరి బ్రహ్మ ఆచార్య అధ్యక్షతన అవార్డుల ప్రధాన ఉత్సవం కొనసాగింది. నిస్వార్ధంగా సమాజ సేవ చేస్తున్న ప్రజా సేవకులను గుర్తించి మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఉగాది పురస్కారాలు ప్రధానం చేయడం అభినందనీయమని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు నరహరి తెలుగు ప్రాత్య కళాశాల విశ్రాంత ప్రధాన చార్యులు, గుర్రం కవిత లక్ష్మీనరసింహారెడ్డి మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ ఎస్ ఎన్ చారి రాష్ట్ర ఉత్తమ గ్రామీణ విలేఖరి ముఖ్య అతిథులుగా పాల్గొని పురస్కారాలు అందజేశారు. ట్రస్టు కార్యకలాపాలు మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులను సన్మానించారు.
ఈ దేశంలో ప్రేరేపిస్తూ దేశంలో మత చిచ్చు రేపుతున్న మతోన్మాదులను వారి ఆలోచన విధానాలను వారి వల్ల ఈ దేశానికి జరిగేటువంటి నష్టాన్ని ప్రజలందరూ గమనించాలి.ఒకవైపు హిందూ రాష్ట్ర హిందువుల కోసం అని ప్రచారం చేస్తూ దేశమంతగా కార్పొరేటీకరణను వేగవంతం చేయడం హిందుత్వ ఫాసిస్టుల వ్యూహం. అందుకే దేశంలోని సమస్త ప్రజల సంపద కార్పొరేట్ల పరం అవుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పబ్లిక్ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ పేరుతో అమ్మి వేస్తున్నారు. ఈ దేశ ప్రాకృతిక వనరుల మీద ఎటువంటి అధికారం ఉండదు. ఇవన్నీ పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తుల సంపదను పెంచడానికే తప్ప సాధారణ ప్రజల కోసం కాదు అని అన్నారు.

Apr 07 2024, 17:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.8k