ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్
![]()
భువనగిరిలో స్వర్ణగిరి మానేపల్లి హిల్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నూతనంగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు.
మంగళవారం రోజున స్వర్ణగిరి ఆటో డ్రైవర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నూతనంగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా 100 మంది ఆటో డ్రైవర్లు ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ వారిని సాధారణంగా యూనియన్ లోకి ఆహ్వాణించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, భువనగిరి కొత్త బస్టాండ్ లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగం లో సుమారుగా 15 లక్షల మంది ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నారని, గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో, చాలా మంది డిగ్రీలు, ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించడంతో ప్రయాణికులు ఆటోలు ఎక్కకపోవడంతో ప్రస్తుతం రోజుకు 200 నుండి 300 మాత్రమే సంపాదించడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనివలన ప్రతినెలా ఫైనాన్స్ కట్టలేక మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఫైనాన్స్ కట్టలేక ఆటోలను కోల్పోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.10,000/- ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విదంగా ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలని, డిమాండ్ చేశారు.
అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
అధ్యక్షులు:- తారాల ఉపేందర్
ఉపాధ్యక్షులు:- గోపరాజు గణేష్ , బింగి సురేష్
ప్రధాన కార్యదర్శి:- మర్రి శివ
సహాయ కార్యదర్శులు:- మాటూరి దుర్గ, బోడ స్వామి
కోశాధికారి :- ఎడ్ల నరేందర్
వర్కింగ్ ప్రెసిడెంట్ :- ఎండీ ఇమ్రాన్
గౌరవ సలహా దారులు:- సామల శోభన్ బాబు,
గనబోయిన వెంకటేష్,
సామల భాస్కర్
గౌరవ అధ్యక్షులు :- గొర్ల లక్ష్మణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.




ఒక ముస్లిం అమ్మాయి తనని ఇష్టపడుతుందని తెలుసుకొని,ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మతసామరస్యానికి ప్రతీకైనాడని, ఆమె సోదరుని సాయంతో భువనగిరి కోటను స్వాధీనం చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించి చరిత్ర సృష్టించిచాడని, ఆతర్వాత గోల్కొండ కోట పై దండయాత్ర చేసి విజయం సాధించిన పాపన్న గౌడ్ బహుజన రాజ్యం జెండాను గోల్కొండ కోట పై ఎగురవేసాడని వారు తెలిపారు. గత పాలకులు సర్థార్ సర్వాయి పాపన్న చరిత్రను కనుమరుగు చేసారని,ఆ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించటానికి నేటి యువత కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వర్థంతి కార్యక్రమంలో భువనగిరి మాజీ కౌన్సిలర్ దేవరకొండ సత్యనారాయణ, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బత్తుల గణేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఎర్ర శివరాజ్, గోపరాజు వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు


అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ సహకారంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగు తుందన్నారు. ప్రతి ఏటాలాగే ఈసారి కూడ మేరాజ్ గ్రూప్ వారి సౌజన్యంతో ఇప్పటికే ఆదివారం రెండు లక్షల రూపాయల విలువగల నిత్యవసర సరు కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా సోమవారం రెండవ విడతలో భాగంగా పట్టణంలోని పేద ముస్లిం కుటుంబాల కు ఒక్కొక్కరికి 3000.రూపాయల రంజాన్ తోఫా కిట్టును మరో రెండు లక్షల రూపాయల తో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు . తమపై ఎంతో నమ్మకంతో ప్రతి ఏటా భువనగిరి పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులు అందజేస్తున్న మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో పేదలను గుర్తించి వారికీ తమకు తోచిన సహాయం అందించాలన్నదే తమ లక్ష్య మన్నారు.ఈ కార్య క్రమంలో టీజేయు జిల్లా అధ్యక్షుడు ఎండి శానూర్ బాబా,మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీఇస్తియాక్ అహ్మద్,సయ్యద్ రఫీఖ్ అహ్మద్,ఎండీ కామ్రాన్ హుస్సేన్,ఎండీ సలీం ఎండీ గయాజ్ అహ్మద్ ఎండీ సిరాజ్, ఎండీ మొఖ్తార్,అహ్మద్,ఆదిల్ రాషేద్,షకీల్,రెయ్యాన్ తదితరులు పాల్గొన్నారు.
Apr 02 2024, 21:02
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
7.4k