సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు యువత పునరంకితం కావాలి : పంజాల జైహింద్ గౌడ్ నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు
నిజమైన స్నేహానికి ప్రతిరూపం , యువతకు ఆదర్శం, మతసామరస్యానికి ప్రతీకైన సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ను నేటి యువత ఆదర్శంగా తీసుకుని బహుజన రాజ్యాన్ని స్థాపించాలని నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు పంజాల జైహింద్ గౌడ్, పాపన్న యువసేన జాతీయ కన్వీనర్ పరిటాల రవి గౌడ్ లు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక భువనగిరి కోట వద్ద జరిగిన సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్థంతి సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ స్నేహితున్ని అప్పటి ఔరంగజేబు సైన్యం తీవ్రంగా కొడుతుంటే తాను వీరసైనికునిగా మారి నలుగురు ఔరంగజేబు సైనికులను హతమార్చాడని వారన్నారు.ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి నాలుగువేల మంది యువకులను సమీకరించి పాపన్న గౌడ్ ప్రైవేటు సైన్యాన్ని తయారుచేసుకొని ఆనాటి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించాడని వారన్నారు.
ఒక ముస్లిం అమ్మాయి తనని ఇష్టపడుతుందని తెలుసుకొని,ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మతసామరస్యానికి ప్రతీకైనాడని, ఆమె సోదరుని సాయంతో భువనగిరి కోటను స్వాధీనం చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించి చరిత్ర సృష్టించిచాడని, ఆతర్వాత గోల్కొండ కోట పై దండయాత్ర చేసి విజయం సాధించిన పాపన్న గౌడ్ బహుజన రాజ్యం జెండాను గోల్కొండ కోట పై ఎగురవేసాడని వారు తెలిపారు. గత పాలకులు సర్థార్ సర్వాయి పాపన్న చరిత్రను కనుమరుగు చేసారని,ఆ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించటానికి నేటి యువత కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వర్థంతి కార్యక్రమంలో భువనగిరి మాజీ కౌన్సిలర్ దేవరకొండ సత్యనారాయణ, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బత్తుల గణేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఎర్ర శివరాజ్, గోపరాజు వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు
Apr 02 2024, 20:58