/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో త్వరలో సప్త వార్షికోత్సవ పంచాంగం ఆవిష్కరణ Miryala Kiran Kumar
భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో త్వరలో సప్త వార్షికోత్సవ పంచాంగం ఆవిష్కరణ

భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో త్వరలో సప్త వార్షికోత్సవ పంచాంగం ఆవిష్కరణ

శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ జరుగునని సేవా సంస్థ వ్యవస్థాపకులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మ గారు తెలిపారు గత ఆరు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పంచాంగ ఆవిష్కరణ జరుగుతుందని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పంచాంగ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది.ఈ యొక్క పంచాంగ ఆవిష్కరణ ఆర్జల భావి లో నిర్వహించడం జరుగుతుంది ఈ పంచాంగ ఆవిష్కరణకు అధిక సంఖ్యలో ప్రజలు బ్రాహ్మణులు ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమం అనంతరము అన్నదాన కార్యక్రమము నిర్వహించబడును.

నేతన్నలతో రాజకీయాలు మానండి: బీసీ రాజాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్

నేతన్నలతో రాజకీయాలు మానండి.. 

పద్మశాలీల్లో బలమైన నాయకత్వలేమితోనే సమస్యలు

దాసు సురేశ్ - బీసీ రాజ్యాధికార సమితి 

ప్రస్తుతం సిరిసిల్లలో నేత కార్మికులు ఎదుర్కుంటున్న దుర్బర పరిస్థితిలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిష్కరించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అభ్యర్థించారు..గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల పేరిట కొంతమంది మాస్టర్ వీవర్లకు లబ్బి చేకూర్చే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నేడు నేత కార్మికులు పనిలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దాసు సురేశ్ తెలిపారు.. బతుకమ్మ చీరల పేరిట నెలకొని ఉన్న 270 కోట్ల రూపాయల బకాయిలను, చేనేత సహకార సంఘాలకు చెల్లుంచాల్సిన 9 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు..

రాజకీయ కారణాలతోనే ప్రస్తుతం సిరిసిల్లలో కష్టాలను ఎదుర్కొంటున్న నేతన్నల పక్షాన కేటీఆర్ మాట్లాడడం లేదని వారి హయాంలో ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించిన బకాయిలను రాబట్టడానికి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని నేటికీ ఈ అంశంపై కనీసం స్పందించకపోవడం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు

కష్టకాలంలో ఉన్న నేతన్నలను ఓదార్చడం మాని స్థానిక కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్రెడ్డి నేతన్నల పట్ల దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటని తెలిపారు.. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాలతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలలో సాలీనా కావాల్సిన వస్త్ర వినియోగాన్ని లెక్కించి సమీకృత ప్రొడక్షన్ విధానాన్ని అధికారులు నిర్ణయించుకోకపోవడమే సమస్యకు అసలు కారణమని తెలియజేశారు.. అధికారులు వెంటనే ప్రొడక్షన్ ప్లాన్ ను తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి కావాల్సిన వ్యయం మొత్తాన్ని సమీకరించాలని కోరారు.. ఆపద కాలంలో నేతన్నలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలకు పాల్పడకుండా ధైర్యంగా మెదలాలన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయడంతో పాటు కార్మికులు తమ త్రిఫ్ట్ నిధినుండి లోను సౌకర్యాన్ని పొందే విధంగా వెసులుబాటు కల్పించాలన్నారు.. కార్మికులకు శీఘ్రగతిన ముద్ర లోన్ సదుపాయాన్ని కూడా అందజేసే విధంగా స్థానిక ఎంపీ బండి సంజయ్ కృషి చేయాలన్నారు

త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నేతన్నల సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే విధంగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసురేష్ మీడియాకు తెలిపారు.

చర్ల: భువనగిరి:చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడండి పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ డిమాండ్

చర్ల ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడండి పి వై ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ డిమాండ్

చర్ల మండల కేంద్రంలో ఉన్న CHC ప్రభుత్వ ఆసుపత్రిని PYL కమిటీ సందర్శించడం జరిగింది నలుగురు MBBS డాక్టర్లు, 16 మంది స్టాఫ్ నర్స్ లు పనిచేయవలసిన ఆసుపత్రిలో, MBBS డాక్టర్ ఇద్దరు స్టాప్ నర్సులుఇద్దరు ట్రైనింగ్ తీసుకుంటున్న 8, మంది విద్యార్థులు అప్రెంటిస్ చేస్తున్న నర్స్ లను ప్రభుత్వాధికారులు పెట్టి చాకిరి చేపించుకుంటున్నారు. కనీసం వారికి బస్సుకు ఆటోకు వెళ్లడానికి చార్జీలు కూడా ఇవ్వడం లేదు కావున నిత్యవసర ధరలకు చార్జీలకు అనుకూలంగా అప్రెంటిస్ చేస్తున్న నర్సులకు ఎంతోకంతా వేతనాలు చెల్లించాలని.. ఇక్రూట్మెంట్లు సరిపడా బెడ్లు హాస్పిటల్ కి సరిపడా పరికరాలు లేకపోవడం కారణంగా చర్ల మండలంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రగతి శీల యువజన సంఘం(పి వై ఎల్) జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ అన్నారు.మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ కారణంగా అందులో నుంచి వచ్చే విష వాయువు పొగ పీల్చుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని వారు అన్నారు కాళ్ల నొప్పులతో ఒళ్ళు నొప్పులతో విష జ్వరాలతో చర్ల మండలం లో ఉన్న ప్రతి కడపలో ఒకరికొక ఇద్దరికో జ్వరాలు ఉన్నాయి బాధపడుతున్నారు ఎన్నో రక్త పరీక్షలు చేసినా కూడా అది ఏంటి అనేది బయటికి రావడం లేదు చర్ల మండలానికి.. మణుగూరుకి మధ్యలో గోదావరి అడ్డు మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ కారణంగానే బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి మొత్తం తగ్గిపోతుంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చర్ల మండలం లో ఉన్న ప్రజలు మొత్తం చర్ల ప్రభుత్వాసుపత్రిలో అట్లాగే ప్రవేట్ ఆసుపత్రిలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మణుగూరు లో ఉన్న పవర్ ప్లాంట్ ని కొంతకాలం ఆపివేయాలని చర్ల మండలంలో ఉన్న ప్రజానీకాన్ని కాపాడాలని కాపాడాల్సివలిసిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు.చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బెడ్లు సరిపోక కిందనే కూర్చొని సెలెన్స్ పెట్టించుకుంటున్న పరిస్థితి ఉంది. సరైన సౌకార్యాలు కల్పించాలని కోరుతున్నాం.ఈ కార్యక్రమంలో.. PYL మండల నాయకుడు.. చిరిగిడి నరేష్.. సీనియర్ జాన్సీ.. వనిత రాణి రవళి శ్రావణి కావ్య వల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

చర్ల:భద్రాచలం:రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెట్ ఎగ్జామ్స్ ఫీజులను వెంటనే తగ్గించాలి:ప్రగతిశీల యువజన సంఘం( PYL )జిల్లా ఉపాధ్యక్షులు సతీష్

రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన టెట్ ఎగ్జామ్స్ ఫీజులను వెంటనే తగ్గించాలి

ప్రగతిశీల యువజన సంఘం( PYL )జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్

   

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

 ఈ సందర్భంగా ముసలి సతీష్ మాట్లాడుతూ.......తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగు లు గా ఉన్నారు .గతంలో టెట్, DSC కోసం ఎదురు చూసి చూసిన నిరుద్యోగుల కి నిరాశా మిగిలింది అని,గతంలో టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్-1 కి ఫీజు రూ. 200 , పేపర్-2 కి రూ. 200 మొత్తం కలిపి 400 రూపాయలు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫీజులను రెండు పేపర్ లకి కలిపి 1600 రూపాయలు భారీగా పెంచారు. ఇది టెట్ అభ్యర్థులకు, నిరుద్యోగులకు ఇది ఆర్ధికంగా భారం అవుతుంది అని, అసలే BRS ప్రభుత్వం లో నిరుద్యోగులు అనేక రకాలుగా బాధపడి ఉన్నారని, రాష్ట్రము లో రోజు రోజుకి నిరుద్యోగ సమస్య ఎక్కువైంది అని, అందుకే BRS ప్రభుత్వం ని నిరుద్యోగులే ఓడించి కాంగ్రెస్ ని గెలిపిస్తే, అధికంగా ఫీజుల వసులు చేస్తుంది అని.హైదరాబాద్ లో వెలకి వేలు కోచింగ్ సెంటర్ లో ఫిజు లు కట్టి ఉద్యోగం రాక కూలి చేసుకొని, స్వయం ఉపాధి పొందుతూన్నారని, అలాంటి పేద నిరుద్యోగుల పై ప్రభుత్వం దయ చూపాలని ప్రభుత్వం ని కోరినారు.దీని వలన రాష్ట్రంలోని అభ్యర్థులకు ఆర్థికంగా భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పేద , మధ్య తరగతి అభ్యర్థులు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది . కాబట్టి తెలంగాణ లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద , బడుగు బలహీన వర్గాల అభ్యర్థులు ఆర్థికంగా నష్టం జరగకుండా భారీగా పెంచిన టెట్ పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించి ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రగతిశీల యువజన సంఘం ( PYL ) గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల అభ్యర్థులను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని , దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

బిసి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి జన్మదిన వేడుకలు వేడుకలు...

ఘనంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్, లైన్స్ క్లబ్ సభ్యులు ఎం జి ఎఫ్ లయన్ మిరియాల యాదిగిరి జన్మదిన వేడుకలు...

మిర్యాల యాదగిరి జన్మదిన వేడుకలు

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి జన్మదిన పురస్కరించుకొని

 బీసీ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంఘం ,యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలను

 ఘనంగా నిర్వహించడం అయినది .ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ మాట్లాడుతూ

 వారు మొదటినుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే నల్లగొండ పద్మా నగర్ లో విద్యార్థుల కోసం పాఠశాలను నిర్మించడం కానీయండి, ప్రజల కోసం అనువైన స్మశాన వాటిక నిర్మించడం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారు ముందు ముందు రాజకీయంగా కూడా ఉన్నతమైన స్థానంలోకి రావాలని ఆకాంక్షించారు.

 ఈ కార్యక్రమంలో గుండు వెంకటేశ్వర్లు, మల్లెబోయిన సతీష్ యాదవ్ , సదానంద్, బక్కదట్ల వెంకన్న యాదవ్, శ్రీనివాస్, సింగం రమేష్ యాదవ్, కృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

రేపు సూర్యాపేటకు సుద్దాల అశోక్ తేజ

రేపు సూర్యాపేటకు సుద్దాల అశోక్ తేజ

సూర్యాపేట

మనమ్ వికాస వేదిక ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బాలాజీ గ్రాండ్ బాంకెట్ హాలులో జరిగే డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తో 'ఓ సాయంత్రం' అనే కార్యక్రమానికి భాషారత్న, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ హాజరవుతున్నారని మనం వికాస వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 సంవత్సరాల ప్రజా గీతాల పరివాజ్ర కుడు, 30 సంవత్సరాల సినీ గీతాల ప్రయాణికుడు, ఉత్తమ జాతీయ సినీ గేయ రచయిత అయిన సుద్దాల అశోక్ తేజ పాల్గొనే ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని, సుధా బ్యాంక్ చైర్మన్ మీలా మహాదేవ్ సభా అధ్యక్షతన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య ముఖ్యఅతిథిగా, ప్రముఖ కవి, విమర్శకులు జర్నలిస్ట్ ప్రసేన్ ప్రధాన వక్తగా, బుర్రి వెంకటేశ్వర్లు బృందంతో సంగీత విభావరి ఉంటుందని ఆయన తెలిపారు. రసజ్ఞులైన సూర్యాపేట వీక్షకులు, ప్రేక్షకులు, కవులు, కళాకారులు, సాహితీ అభిమానులు, పట్టణ ప్రముఖులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దిరెడ్డి గణేష్ విజ్ఞప్తి చేశారు.

ప్రజాపాలనలో బీసీల భాగస్వామ్యం లేకపోతే సామాజికన్యాయం ఎలా సాధ్యం?: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్

ప్రజాపాలనలో బీసీల భాగస్వామ్యం లేకపోతే సామాజికన్యాయం ఎలా సాధ్యం?

దాసు సురేశ్ 

పోరాటాలకు పనికొచ్చిన బీసీలు పాలనలో ( పదవులకు) పనికిరారా? 

బీసీ మేధావుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్, రాహుల్ గాంధీకి బీసీల సూటి ప్రశ్న...

సబ్బండ వర్గాల మద్దతుతో సామజిక న్యాయమే ధేయంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో బీసీ లకు సమన అవకాశాలు లేక సామాజికన్యాయం కుంటు పడుతుందని బీసీ నాయకులు, ఉద్యమకారులు వాపోయారు, బీసీ రాజ్యాధికార సమితి బుధవారం భాగ్ లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో, బీసీ నాయకులూ, ఉద్యమకారులు, ప్రజా సంగాల నాయకులూ, మేధావులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, తమకు ప్రభుత్వ పదవులు దక్కాల్సిన వాటాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వ పాలనలో తాము భాగస్వాములమేనని నినాదించారు, తదనంతరం బీసీ రాజ్యాధికార అధ్యక్షులు దాసు సురేష్ మాట్లాడుతూ బీసీ, ఎస్సి , ఎస్టీ , మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం 17 కార్పొరేషన్ లు ఏర్పాటు చేయటాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు తాము ప్రభుత్వానికి నివేదించిన వెంటనే , బీసీ  అభివృద్ధి కోసం బడ్జెట్లో 8 వెల కోట్లు కేటాయించటం , బీసీ, ఎస్సి , ఎస్టీ , మైనారిటీ , రెసిడెన్సియల్ గురుకులాలకు సమీకృత భవనాలను ఏర్పాటు చేయటం 30 వేల ఉద్యోగాల భర్తీ, తదితర అంశాలను, శీఘ్ర గతిన 100 రోజులు పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తాము అభినందిస్తున్నామన్నారు, ఇదేసమయంలో కెసిఆర్ ప్రభుత్వం పై నిరంతరం పోరాటం చేసిన ప్రజా ఉద్యమ సంగాల నాయకులకు ప్రభుత్వ పాలనలో అవకాశాలు కల్పించటం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు , కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే కాకుండా ప్రజా పోరాటాలతో మద్దతుగా నిలచిన, సివిల్ సొసైటీ నాయకులకు కూడా ప్రాధాన్యతకలిగిన నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఇవ్వాలని కోరారు, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సామజిక న్యాయం కోసం పోరాటం చేస్తుండగా తెలంగాణ లో పదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికె పరిమితం అవుతున్నాయని ఆవేదన వెక్తం చేశారు , కాంగ్రెస్ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని బీసీ ల ఆర్థిక స్థితి గతుల ఎదుగుదలకు సహకరించాలని కోరారు..

ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు దొంత ఆనందం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ , మహిళా కన్వీనర్ బోనం ఊర్మిళ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ స్వామి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు నీలం వెంకటేష్, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక సభ్యురాలు దోనేటి కృష్ణలత, బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పద్మావతి, ప్రధాన కార్యదర్శి గోషిక స్వప్న,మీడియా సెక్రటరీ మారేపల్లి లక్ష్మణ్ , పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తులసీ శ్రీమన్, బీసీ నాయకులు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, గజవెల్లి మధుసూదన్,సుధాకర్ , ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కాలసముద్రం సుధాకర్ , వీరాస్వామి యాదవ్ , దామెరకొండ కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి పెండెం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రాత్మక అవసరం: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు

దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రాత్మక అవసరం: డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు

నల్లగొండ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

రాష్ట్ర అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు హర్షణీయం

ఈ ఎన్నికల్లో RTI కార్యకర్తలు, మేధావులు విద్యావంతులు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలు ఏకమై ఇండియా కూటమిని గెలిపించాలి..

దేశానికి గాంధీ కుటుంబ త్యాగం మరువలేము

కాంగ్రెస్ బలహీనమైతే దేశం బలహీనం అవుతుంది

కాంగ్రెస్ తోనే సమాచార హక్కు చట్టం సాధ్యమైంది

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు... దేశ అభివృద్ధికి మలుపు

సూర్యాపేట, 17 మార్చి, 2024: దేశ భవిష్యత్తు నిర్ణయించే 18 వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం చారిత్రాత్మక అవసరమని, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓడిపోతే దేశం బలహీనమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సూర్యాపేట పట్టణంలోని త్రివేణి డిగ్రీ కళాశాలలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రమాధ కృష్ణారెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ సమగ్రతను, దేశభక్తి, బహుళ జాతుల సంస్కృతులను, లౌకికవాదం, సమానత్వం రక్షించబడాలంటే దేశంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలోని 16 కులాల కార్పొరేషన్ల ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రభుత్వం దీర్ఘకాలిక నిర్ణయాలు అమలు చేయడంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విజన్ ను ముందుకు తీసుకుపోయే విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు. కావున ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని ఎక్కువ లోక్ సభ స్థానాలు గెలిచే బాధ్యత తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, గృహహింస చట్టం, పేదలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉండేందుకు, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించేందుకు సమాచార హక్కు చట్టం వచ్చిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాజంలో జరుగుతున్న అవినీతిని బయటకు తీసేందుకు ఆర్టిఏ కార్యకర్తలు నిత్యం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టిఏ చట్టం వచ్చిన తర్వాత సామాన్యుడు గౌరవం పెంచిందని, గతంలో అధికారులు సామాన్యులను పరిగణలోకి తీసుకునేవారు కాదని, ఆర్టిఏ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 150 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం అధికారులకు ఏర్పడిందన్నారు. సమాచార హక్కు చట్టం కమిషనర్లను కొద్ది రోజుల్లోనే నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పేర్కొనడం హర్షనీయమన్నారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ కన్న కలలు నిజం కావాలంటే ఆర్టిఏ చట్టం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలో గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను ప్రస్తుత పార్టీలు గుర్తించకపోవడం దారుణం అన్నారు.  మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ ఏకతాటిపై వచ్చి ప్రజాస్వామ్యంలో  ఓటు పై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఓటు ద్వారానే మన దేశ అభివృద్ధి ఆధారపడి ఉందని, దీనిని దేశంలోని యువత ప్రతి ఇంట్లో తమ కుటుంబ సభ్యులకు వివరించాలని ఆయన కోరారు. జిల్లా మంత్రులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆధ్వర్యంలో నల్లగొండ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుందూర్ రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, ఆయన అన్నారు.సమాచార హక్కు చట్టంలో రాజకీయ నాయకులు కూడా భాగస్వామ్యం కావాలని, ఆ దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. కొందరు కేంద్రంలో ఇండియా కూటమిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. దీనిని మేధావి వర్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు గుంటకండ్ల ముకుంద రెడ్డి, ప్రధాన కార్యదర్శి చేకూరి శివ,సూర్యాపేట నియోజక వర్గ అద్యక్షులు దండా వేంకటరెడ్డి ,తుంగ తూర్తి నియోజక వర్గ అద్యక్షులు వేముల ,పట్టణ అధ్యక్షులు బంగారు శ్రీధర్, ఉన్నం సత్యనారాయణ,వెంకట్ రెడ్డి, బిక్షం రెడ్డి, ఆనంద్,సూర్య, గుడుగుంట్ల విద్యాసాగర్ , బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకే ఛాన్స్..

ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకే ఛాన్స్

హైదరాబాద్:మార్చి 17

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్న సంగతి తెలి సిందే.

ఈ నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకు నేందుకు ఏప్రిల్ 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

18 ఏళ్లు నిండిన వారు, ఓటర్ల జాబితాలో పేరు లేనివారు.. ఈ అవకాశాన్ని వినియోగించేకోవాలని EC అధికారులు సూచించారు.

కొత్తగా నమోదు చేసుకో వాలనుకునే వారు ఫారం-8 దరఖాస్తును ఆన్‌లైన్‌లో గాని, ఎన్నికల అధికారికి గాని అందజేయవచ్చని తెలిపారు.

చర్ల: భద్రాచలం:మార్చి 23. జరిగే భగత్ సింగ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా జరపాలని PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ పిలుపునిచ్చారు

మార్చి 23. జరిగే భగత్ సింగ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా జరపాలని PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ పిలుపునిచ్చారు 

వలస పాలకులను తరిమికొట్టిన సింహ స్వప్నం భగత్ సింగ్ అని, PYL ప్రగతిశీల యువజన సంగం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్  

 అన్నారు. * బ్రిటిష్ వలస పాలకుల 

వెన్నులో వణుకుపుట్టించే వీర కిషోరం భగత్ సింగ్ అని పేర్కోన్నారు. నాడు భగత్ సింగ్ లాంటి సమరయోధులు పోరాటంతో వలస పాలకులను దేశం నుంచి తరిమితే నేడు స్వదేశీపాలకులు సామ్రాజ్యదేశాలతో ములాఖాత్ అయ్యి ప్రజలను వంచిస్తున్నారని పేర్కోన్నారు.

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రజలను మతం,కులం పేరుతో విభజన,విద్వేష రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఆకలి సూచీలో దేశం దిగజారిపోతుంటే అంబానీ , ఆదాని ఆస్తులు పెరుగుతున్నాయని వివరించారు. ఆకలి ఉన్నంత వరకు మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలైపూస్తాం ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం నిప్పు రవ్వల మీద నిదురిస్తాం తిరుగుబాటు, పోరాటం అనివార్యమని దోపిడీ పాలకుల పతనం తథ్యమని తెలిపారు. నేడు ఫాసిస్ట్ విషగాలుల్లో భగత్ సింగ్ ను స్మరించడం అంటే మోడీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడమని అన్నారు.మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతిని విజయవంతం చేయాలని విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు 

ఈ కార్యక్రమంలో రవి రాజు రాంబాబు ,రమేష్ వంశీ చంటి చందు ఆజాం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.