తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
![]()
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జిల్ల కన్వీనర్ కాశాపాక మహేశ్ అధ్యక్షతన జరిగిన # రౌండ్ టేబుల్ సమావేశం # ఫాసిస్టు నరేంద్ర మోదీని ఓడించండి,రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలను పరిరక్షించండన్ని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో CPM జిల్ల కార్యదర్శి MD జాంగిర్. బట్టు రామచంద్రయ్య. R. జనార్దన్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి. ఉప్పలయ్య CPIML జిల్ల కార్యదర్శి. సుదర్శనాయర్ క్రిస్టియన్ ఫాస్టర్. అమిద్ పాషా. కట్టెల లింగస్వామి టీచర్. Asgar అలీ CAF కన్వీనర్. S. మల్లారెడ్డి సీనియర్ పాత్రికేయులు. M. సతయ్య DTF జిల్ల అధ్యక్షులు.. బోయ నర్సింహ్మ. కావలి యాదయ్య. రసాల బాలస్వామి.G.బాలకృష్ణ. డిటిఎఫ్ సత్తయ్య . తదితరులు పాల్గొని మాట్లాడారు.
![]()
ప్రియమైన ప్రజలారా..! ప్రజాస్వామిక వాదులారా..!!
రెండు నెలల్లో దేశంలో సాధారణ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ కల్లబొల్లి మాటలతో సరికొత్త హామీలతో ముస్తాబై ప్రజల ముందుకు వస్తున్నాయి. మసిబూసి మారెడుగాయ చేసి ఓట్లను కొల్లగొట్టేందుకు వాగ్దానాల్లో పోటీ పడుతున్నాయి. అందమైన అబద్దాలతో, అంతుపొంతూ లేని హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు పోటీ పడుతున్నాయి. ఓటర్లను ఏ విధంగానైనా ప్రసన్నం చేసుకొని ఓట్లు దండుకొని గద్దెనెక్కేందుకు ఆరాటపడుతున్నాయి. ధన బలం, కండబలం, కుల బలం ఆసరా చేసుకొని ఓటర్లను తమవైపుకు తిప్పుకొనేందుకు కుట్రలు కుహకాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి టక్కు టమార గారడి విద్యల్లో బీజేపీ మొదలు కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు, రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ దాకా అన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు ఒకదానికి మించి మరొకటి పోటీ పడుతున్నాయి. అన్ని పార్టీల లక్ష్యం ఒక్కటే.., ఓట్లను దండుకొని అధికారాన్ని కైవసం చేసుకోవటం. దీనికోసం పార్టీలన్నీ ఎంతకైనా తెగిస్తున్నాయి. ఎంతటి నైచ్యానికైనా దిగజారుతున్నాయి.
అయితే.. అధికారం కోసం, ఓట్లు దండుకోవటం కోసం చేసే కుట్రలు, కుహకాల్లో నరేంద్రమోదీ నేతృత్వం లోని బీజేపీ మరో ఆకు ఎక్కువ చదివింది. మెజారిటీ వాదంతో సమాజంలో విభజన రేఖలు గీసి మత ఉద్రిక్తతలను పెంచి పోషిస్తున్నది. మతాన్ని రాజకీయంతో జోడించి మతరాజకీయం చేస్తున్నది. ఓట్ల కోసం మత విశ్వాసాలను, సున్నిత సంస్కృతిక అంశాలను వాడుకుంటున్నది. మత కలహాలను రేపుతూ శవాల గుట్టలపై ఓట్లను ఏరుకొంటున్నది. 80వ దశకంలో రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ నేడు అధికా రం చేజిక్కించు కునేంతగా సంఖ్యాబలం పెంచుకోవటంలో ఆర్ఎస్ఎస్ సంఘ్‌పరివార్ శక్తులు, మోదీ నాయకత్వంలోని బీజేపీ రేపిన మతకలహాలు, పారించిన నెత్తురు అంతా ఇంతా కాదు. అయోధ్య రథయాత్ర నుంచి గుజరాత్ మారణకాండ దాకా దేశాన్ని మరుభూమిగా మార్చి సమాజంలో రక్తపుటేరులు పారించి అధికారపీఠాన్ని చేజిక్కించుకున్నది.
![]()
గుజరాత్ మారణకాండ శవాలగుట్టలపై 2014లో అధికారం చేజిక్కించుకున్న మోదీ... ముచ్చటగా మూడో సారి అధికారాన్ని కైవసం చేసుకోవటం కోసం నానా తంటాలు పడుతున్నాడు. సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజల్లో సెంటిమెంటును రాజేసి, మత ఉద్రిక్తతలను పెంచి మెజారిటీ ఓట్లను కొల్లగొట్టే పనిని ఒక కళగా అభివృద్ధి చేసిన మోదీ ఇప్పుడు సరికొత్త అస్త్రాలను బయటకు తీస్తున్నాడు. మొదటి దఫా అయోధ్య రామాలయాన్ని, మత విభజనను వాడుకుంటే; రెండో దఫాలో సర్జికల్ స్ట్రైక్‌లు, పుల్వామా దాడులను వాడుకొని ఓట్లు దండుకున్నాడు. ఇప్పుడు తాజా ఎన్నికల కోసం అయోధ్యలో రామాలయం కట్టించాననీ, వారణాసిలో జ్ఞనవాపీ మసీదును కూల్చి ఆలయాన్ని నిర్మిస్తాననీ, మధురలో శ్రీకృష్ణ మందిరం నిర్మిస్తానని చెప్తూ మెజారిటీ ఓట్లను కొల్లగొట్టేందుకు కుట్రలు కుహకాలు పన్నుతున్నాడు.
అధికారం చేపట్టిన నాటి నుంచీ ఒకే దేశం ఒకే ప్రజ నినాదం ఎత్తుకున్న మోదీ సీఏఏ, ఎన్ఆర్‌సీ లాంటి చట్టాలతో ప్రజల పౌరసత్వ హక్కునే కాలరాస్తున్నాడు. ఒక్క కలం పోటుతో లక్షలాది మంది పౌరసత్వ హక్కును రద్దుచేసి రాత్రికిరాత్రి లక్షలాది మందిని కాందిశీకులను చేశాడు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక ఉనికికి రక్షణగా ఉన్న 370 ఆర్టికల్ ను రద్దు చేసి, కశ్మీర్‌ను మూడు ముక్కలుగా విడగొట్టి అందమైన కశ్మీర్‌ను అంబానీ, ఆదానీలకు అప్పగిస్తున్నాడు. రాజ్యాంగాన్నే మార్చేసి తమదైన మనువాద వర్ణాశ్రమ ధర్మాల ను (విలువలను) అమలు చేసేందుకు పావులు కదుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలను విమర్శించిన మేధావులు, రచయితలపై కక్షగట్టి దాడులు, హత్యలకు గురిచేస్తున్నది మోదీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్, హేతువాద రచయిత, కార్మిక నేత గోవింద్ పన్సారే, కలబుర్గి లాంటి ఎందరో మేధావులను సంఘ్‌పరివార్ శక్తులు హత్యచేశాయి. ప్రజా ఉద్యమాలకు మద్దతు గా నిలిచి ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కుట్రకేసులు పెట్టి జైలు నిర్బంధాలకు గురిచే సింది బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ నుంచి ప్రఫెసర్ సాయిబాబ, విప్లవ కవి వరవరరావులను ఏండ్ల తరబడి జైలు పాలు చేసింది. తమ మతరాజకీయాలను విమర్శిస్తున్న వారిని దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ తీవ్ర నిర్బంధాలకు గురిచేస్తున్నది. మొత్తంగా మెజారిటీ వాద రాజకీయంతో మెజారిటీ సమ్మతిని కూడగట్టి ఫాసిస్టు పాలన దిశగా మోదీ దేశాన్ని తీసుకుపోతున్నాడు.
- తెలంగాణ ప్రజాఫ్రంట్, యాదాద్రి భువనగిరి జిల్లా



యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శనివారం గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ విద్యావేత్త ప్రవేట్ స్కూల్ ల రాష్ట్ర నాయకులు శ్రీ చైతన్య విద్యాలయం చైర్మెన్ తాడూరు చంద్రయ్య గారి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి.పోతంశెట్టి వెంకటేశ్వర్లు, మెరుగు మధు,టాస్మా అసోసియేట్ ప్రెసిడెంట్ పాలకూర్ల వెంకటేశం, కాసుల వెంకటేశం, గుర్నాథ్ పెళ్లి మల్లేశం, మల్ల వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు

సమాజ సేవలో భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు రావాలి
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం 23 ఏళ్లకే అతి చిన్న వయసులో తన ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన గొప్ప స్వతంత్ర ఉద్యమకారులు భగత్ సింగ్ అన్నారు నేటి సమాజంలో విద్యార్థులు భగత్సింగ్ స్ఫూర్తితో ముందుకు రావాలన్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ లాంటి మహనీయుల చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్య పుస్తకాలలో నుండి తొలగించేకుట్రా జరుగుతా ఉంది ఈ సరైనది కాదు దేశవ్యాప్తంగా విద్యార్థులకు తెలుసుకొన విధంగా భగత్ సింగ్ చరిత్ర పాఠ్యపుస్తకాలల్లో చేర్చాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్ బుగ్గ ఉదయ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు రాము ఐలయ్య లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామం లో తుమ్మల నర్సయ్య సేవ సమితి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు దమేర లక్షమ్మ కు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కిసాన్ సేల్ జిల్లా నాయకులు బండారు నర్సింహా రెడ్డి మండల నాయకులు తుమ్మల శ్రీనువాస్ మాజీ ఎంపీటీసీ పోలేపక చంద్రయ్య మత్స్యగిరి గుట్ట మాజీ డైరెక్టర్ కాసిరాబోయిన లింగయ్య యాదవ్ మండల ఓబీసీ అధక్షుడు చిల్కమర్రి కనకచారి హైస్కూల్ మాజీ చైర్మన్ జినుకాల మల్లేశం హైస్కూల్ ప్రైమరి మాజీ చెర్మన్ ఆవుల అంజయ్య తుమ్మల సంతోష్ బండారు మైహిపాల్ రెడ్డి కోడితల లక్ష్మయ్య కాసిరాబోయిన నర్సింహా వేముల ఎట్టయ్య పిట్టల సుధాకర్ వెలిమినేటి సంతోష్ బత్తిని వెంకటేష్ కొయ్యగుర మధు మీసాల మత్సగిరి నల్ల రామచంద్రు పోలేపక మహేష్ ఎర్ర సాయి మరియు తదితరులు పాల్గొన్నారు

మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని శరీర ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు భగత్ సింగ్ రాజు గురు సుఖదేవులు అతి చిన్న వయసులో తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారని అన్నారు నేటి యువత వారి ఆశ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజానికి సామాజిక స్పృహ అలవర్చుకొని ఎన్నో సేవా కార్యక్రమాలలో యువతి, యువకులు అనేక రంగాలలో ముందుండాలని ఈ సందర్భంగా అన్నారు... అనంతరం టాస్ వేసి ఆటను ప్రారంభించి యువతను మరింత ఉత్తేజపరిచారు.
లను గుర్తించి వారికి అన్ని రకాల సహకారం గుర్తింపు ఇవ్వాలని అన్నారు పాలకులు క్రీడారంగాన్ని విస్మరిస్తున్నారు ఇప్పటికైనా క్రీడలకు సరైన నిధులు, బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఆర్గనైజర్ మేడి దేవేందర్, సిపిఐ మండల కార్యదర్శి పోలపాక యాదయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ,సిపిఐ మండల నాయకులు బుర్ర మల్లేశం, కొడిత్యాల కర్ణాకర్,కనకాచారి, క్రీడాకారులు రవ్వ శివ,జోల మల్లేష్, ఆలకుంట్ల శ్రవణ్, చిలకమర్రి బన్నీ, తదితరులు పాల్గొన్నారు.


Mar 24 2024, 17:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.5k