పోచంపల్లి మండలంలో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి
![]()
పోచంపల్లి మండలం అంతమ్మ గూడెం మరియు దోతిగుడెం గ్రామంలో పొలాలలో నీళ్లు లేక ఎండిపోయిన సందర్భంగా రైతులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ సభ్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నాయక్, బుడద బిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి గారు, కొలుపుల అమరేందర్, జడ్పీటీసీ శ్రీమతి కోట పుష్పలత మల్లారెడ్డి గారు, పోచంపల్లి ఎంపీపీ శ్రీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి గారు,వైస్ ఎంపీపీ శ్రీ పాక వెంకటేష్ గారు, PACs చైర్మెన్ శ్రీ భూపాల్ రెడ్డి గారు, BRS మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పాటి సుధాకర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీ మహిపాల్ రెడ్డి గారు, శ్రీ సుధాకర్ రెడ్డి గారు, దోతిగూడెం మాజీ సర్పంచ్ శ్రీ రామ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు పాల్గొన్నారు.






యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయాల్లో విలువలు బ్రష్టు పడుతున్న కాలంలో వాటిని కాపాడడానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి లో సుందరయ్య భవన్లో సిపిఎం అభ్యర్థి ఎండి జాంగిర్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర కమిటీ ఇలా నిర్ణయం మేరకు భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు ,మునుగోడు ,తుంగతుర్తి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని అన్నారు .గతంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు ,భువనగిరి ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంటులో గత అభ్యర్థులు ప్రస్తావించక పోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావిస్తారని తెలిపారు.
మిగతా రాజకీయ ప్రక్షాలు చేసే రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు గందరగోళం పడకుండా ఎంతో చైతన్యవంతంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను సిపిఎం ను గెలిపించాలని కోరారు . ఎండి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారిని, గత 35 సంవత్సరాలుగా సిపిఎం సభ్యత్వం తీసుకొని 32 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులకు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దోనూరు నర్సిరెడ్డి కల్లూరు మల్లేశం దాసరి పాండు మంగ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.




Mar 22 2024, 22:50
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.1k