భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శిగా మందుల నాగరాజు నియామకం
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం రోజున భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల శాఖ కార్యదర్శిగా నాగారం గ్రామానికి చెందిన మందుల నాగరాజును మండల పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి ఎన్ రెడ్డి జిల్లా కార్యదర్శి కొప్పుల యాది రెడ్డి భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి రాచకొండ కృష్ణ సమక్షంలో నియామక పత్రం అందజేసారు. ఈ నియామక పత్రం అందుకున్న మండల కార్యదర్శి మందుల నాగరాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శిగా నియమించిన జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయకులు సీఎన్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ బందారపు లింగస్వామి రాచకొండ కృష్ణ మారోజు అనిల్ కు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వలిగొండ మండలంలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆయన అన్నారు.
![]()




యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయాల్లో విలువలు బ్రష్టు పడుతున్న కాలంలో వాటిని కాపాడడానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి లో సుందరయ్య భవన్లో సిపిఎం అభ్యర్థి ఎండి జాంగిర్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర కమిటీ ఇలా నిర్ణయం మేరకు భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు ,మునుగోడు ,తుంగతుర్తి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని అన్నారు .గతంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు ,భువనగిరి ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంటులో గత అభ్యర్థులు ప్రస్తావించక పోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావిస్తారని తెలిపారు.
మిగతా రాజకీయ ప్రక్షాలు చేసే రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు గందరగోళం పడకుండా ఎంతో చైతన్యవంతంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను సిపిఎం ను గెలిపించాలని కోరారు . ఎండి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారిని, గత 35 సంవత్సరాలుగా సిపిఎం సభ్యత్వం తీసుకొని 32 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులకు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దోనూరు నర్సిరెడ్డి కల్లూరు మల్లేశం దాసరి పాండు మంగ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.





Mar 22 2024, 22:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
5.3k