భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే కేటాయించాలి: మండల బీసీ సంఘం అధ్యక్షుడు సాయిని యాదగిరి డిమాండ్
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం రోజున మండల బీసీ సంఘం నాయకులు సాయిని యాదగిరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా అన్ని రాజకీయ పార్టీలు బిసి నాయకులకే కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన డిమాండ్ చేశారు బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలలో బీసీలకు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థికి పార్లమెంటు స్థానాన్ని కేటాయించి నట్లయితే బిసిలు బీసీ నాయకులను గెలిపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని రాజకీయ పార్టీ నాయకులకు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నా ఓసీలకు సీట్లు కేటాయించడం వలన ఓట్లు వేసేది బీసీలు నాయకులుగా ఎన్నుకోబడేది ఓసీలా అని ఆయన ప్రశ్నించారు. బీసీ నాయకులకు అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ టికెట్ ఇవ్వకుంటే బీసీల సత్తా ఏమిటో రాజకీయ పార్టీలకు చూపిస్తామని ఆయన అన్నారు.
![]()



యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయాల్లో విలువలు బ్రష్టు పడుతున్న కాలంలో వాటిని కాపాడడానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి లో సుందరయ్య భవన్లో సిపిఎం అభ్యర్థి ఎండి జాంగిర్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర కమిటీ ఇలా నిర్ణయం మేరకు భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు ,మునుగోడు ,తుంగతుర్తి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని అన్నారు .గతంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు ,భువనగిరి ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంటులో గత అభ్యర్థులు ప్రస్తావించక పోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావిస్తారని తెలిపారు.
మిగతా రాజకీయ ప్రక్షాలు చేసే రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు గందరగోళం పడకుండా ఎంతో చైతన్యవంతంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను సిపిఎం ను గెలిపించాలని కోరారు . ఎండి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారిని, గత 35 సంవత్సరాలుగా సిపిఎం సభ్యత్వం తీసుకొని 32 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులకు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దోనూరు నర్సిరెడ్డి కల్లూరు మల్లేశం దాసరి పాండు మంగ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.





Mar 21 2024, 22:39
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.4k