చర్ల: భద్రాచలం:మార్చి 23. జరిగే భగత్ సింగ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా జరపాలని PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ పిలుపునిచ్చారు
మార్చి 23. జరిగే భగత్ సింగ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా జరపాలని PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ పిలుపునిచ్చారు
వలస పాలకులను తరిమికొట్టిన సింహ స్వప్నం భగత్ సింగ్ అని, PYL ప్రగతిశీల యువజన సంగం జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్
అన్నారు. * బ్రిటిష్ వలస పాలకుల
వెన్నులో వణుకుపుట్టించే వీర కిషోరం భగత్ సింగ్ అని పేర్కోన్నారు. నాడు భగత్ సింగ్ లాంటి సమరయోధులు పోరాటంతో వలస పాలకులను దేశం నుంచి తరిమితే నేడు స్వదేశీపాలకులు సామ్రాజ్యదేశాలతో ములాఖాత్ అయ్యి ప్రజలను వంచిస్తున్నారని పేర్కోన్నారు.
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రజలను మతం,కులం పేరుతో విభజన,విద్వేష రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారని అన్నారు. ఆకలి సూచీలో దేశం దిగజారిపోతుంటే అంబానీ , ఆదాని ఆస్తులు పెరుగుతున్నాయని వివరించారు. ఆకలి ఉన్నంత వరకు మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలైపూస్తాం ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం నిప్పు రవ్వల మీద నిదురిస్తాం తిరుగుబాటు, పోరాటం అనివార్యమని దోపిడీ పాలకుల పతనం తథ్యమని తెలిపారు. నేడు ఫాసిస్ట్ విషగాలుల్లో భగత్ సింగ్ ను స్మరించడం అంటే మోడీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడమని అన్నారు.మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతిని విజయవంతం చేయాలని విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు ఆయన పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో రవి రాజు రాంబాబు ,రమేష్ వంశీ చంటి చందు ఆజాం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మార్చి 23. జరిగే భగత్ సింగ్ వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా జరపాలని PYL జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ పిలుపునిచ్చారు


గోపాల్ గోస.. కండరాల క్షీణత వల్ల పనిచేయలేని వైనం.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు...



దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

నల్గొండ అడిషనల్ ఎస్పీ గా నియమితులైన రాములు నాయక్ గారికి సన్మానించిన లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్ 


Mar 17 2024, 16:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.1k