శ్రీకాకుళంలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే టార్గెట్‌గా ప్రతిపక్ష టీడీపీ కదలి రా సభలు నిర్వహి స్తోంది.
ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. కాగా ఈ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళంలోని ఎనభై అడుగుల రోడ్డులో ఈ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
పార్టీ శ్రేణులతో పాటు సుమారు లక్ష మంది ప్రజలు సభకు హాజరయ్యేలా టీడీపీ ప్లాన్ చేసింది. అయితే 2013లో ఇదే స్థలంలో చంద్రబాబు ఆఖరి సభను ఏర్పాటు చేసి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు.
ప్రస్తుతం అదే స్థలంలో మళ్లీ సభను ఏర్పాటు చేయడం తో.. రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తారనే సెంటిమెంట్‌తో టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు సభ ప్రారంభమై.. సాయంత్రం ఐదున్నర గంటలకు పూర్తవుతుందని టీడీపీ శ్రేణులు తెలిపారు.









Feb 26 2024, 15:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.5k