500కే గ్యాస్ సిలిండర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్‌పై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. ఈ రెండు పథకాలను త్వర లోనే ప్రారంభించ నున్నట్లు చెప్పారు.
అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు.త్వరలోనే రెండు గ్యారంటీలు అమలు
అందుకు కసరత్త
తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచారు. తాజాగా.. మరో రెండు గ్యారంటీల అమలకు రెడీ అయ్యారు. ఈ మేరకు రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు.
తాజాగా.. ఈ పథకాల అమలుపై ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించేవారి నుంచి ఛార్జీలు వసూలు చేయబోమని చెప్పారు. గ్యాస్ సిలిండర్‌కు రూ.500 రాయితీ ఇస్తామని అన్నారు. అందుకు సంబంధిన కసరత్తు జరుగుతోందని త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు.
Feb 26 2024, 15:11
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.0k