Tulasi Reddy: తాలిబన్‌ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారు..
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారని, సీఎంకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వార్తలు రాసినా దాడులు చేయిస్తున్నారని, ఇంత అనాగరికమైన చర్యలకు ముఖ్యమంత్రే బాధ్యడని ఏపీసీసీ నేత తులసి రెడ్డి (Tulasi Reddy) అన్నారు..
ఈ సందర్బంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జగన్ ప్రతి పక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను చంపాలన్నారని, తరువాత తనపై విమర్శలు చేస్తే కొట్టండంటూ పిలుపు ఇచ్చారని, మొన్న చొక్కా మడత పెట్టి కార్యకర్తలను రెచ్చ గొట్టారని, తాలిబన్‌ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారని మండిపడ్డారు..
ఆంధ్రజ్యోతి (Andhrajyothy), ఈనాడు (Eenadu) విలేకరులపై దాడి హేయమైన చర్య అని, సీఎంగా ఉంటూ దాడులను ప్రోత్సహిస్తూ రెచ్చ గొడుతున్నారని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అరాచక వ్యక్తిని ప్రజలు ఓడించాలని పిలుపిచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన తెలుగు భాష వైభవంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. మాతృ భాషను మృత భాషగా మారుస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన తెలుగు భాషకు పూర్వ వైభవాన్ని తేవాలన్నారు. భవిష్యత్తు తరాలకు తెలుగులో ఉన్న కమ్మదనం గురించి చెప్పాలని, తెలుగు నేర్పమంటే... ఇంగ్లీషు వద్దా అని వాదించే మూర్ఖులు ఉన్నారని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు..









Feb 25 2024, 12:36
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
11.9k