/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి.. న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా Mane Praveen
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి.. న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా

కనగల్: ప్రధాన రహదారిపై ఇవాళ సాయంత్రం గం. 4 నుండి సుమారు గం. 7 వరకు ధర్నా నిర్వహించారు. కనగల్ బ్రిడ్జి వద్ద నిన్న రోడ్డు ప్రమాదంలో బైకును, కారు ఢీకొనగా ఓ మహిళ మృతి చెందింది. ఒక రోజంతా వేచి చూసిన మహిళ బంధువులు, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ, ఈ సాయంత్రం మూడు గంటల పాటు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: *జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సినిమా ప్రదర్శన*

పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను మోటివేట్ చేయడానికి గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్..12th Fail సినిమాను థియేటర్లలో ఫ్రీగా ప్రదర్శించారు. మనోజ్‌ కుమార్‌ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ రియల్‌ స్టోరీతో రూపొందిన 12th Fail చిత్రాన్ని, నల్గొండ పట్టణంలోని నాలుగు థియేటర్లలో రెండు షోలను విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా చూపించారు. ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీలకు చెందిన దాదాపు 2500 మంది స్టూడెంట్స్ ఈ సినిమాను చూశారు. 

విద్యార్థులతో కలిసి సినిమా వీక్షించిన గుత్తా అమిత్ రెడ్డి... 12th Fail చిత్రం ఇన్‌స్పైరింగ్‌ జర్నీ అని అన్నారు. స్టూడెండ్స్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయ్యే వారికి బాగా కనెక్ట్ అవుతుందన్నారు. విద్యార్థుల్లో ఇన్సిపిరేషన్ నింపేందుకు ఈ చిత్రాన్ని ఉచితంగా చూపించినట్టు చెప్పారు.

12th Fail సినిమా చూసిన విద్యార్థులు ఏమోషనల్ అయ్యారు. ఇన్సిపిరేషన్ తీసుకొచ్చే ఈ సినిమాను తమకు చూపించిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుంకరి రాజారామ్ కృతజ్ఞతలు తెలిపారు.

NLG: ట్రైనీ కానిస్టేబుల్స్ కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ చందాన దీప్తి

నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో, నూతనంగా ఎంపికైన ట్రైనీ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ నిమిత్తం సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండి వచ్చిన ఏఆర్ విభాగానికి చెందిన, 203 మంది పురుష అభ్యర్థుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చందాన దీప్తి ముఖ్య అతిదిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వల చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్‌, డిఎస్పీ విఠల్ రెడ్డి, యస్బి డీఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మి నారాయణ, సిఐలు గోపి, సత్యనారాయణ, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

NLG: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా, ఈనెల 24వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ.. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 24 నుండి మార్చి 14 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 

అనంతరము ఏప్రిల్ 4న పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. పట్టబద్రుల ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారంతో కూడిన జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమావేశంలో అందజేశారు. పోలింగ్ స్టేషన్ల జాబితా పరిశీలించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుపగా అట్టి పోలింగ్ స్టేషన్ల జాబితాను ఈసీఐకి పంపనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 4 లక్షల 27 వేల 302 మంది ఓటర్లుగా నమోదు అయినట్లు ఆమె తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 600 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. 

 ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గుమ్మల మోహన్ రెడ్డి (కాంగ్రెస్), పోతేపాక లింగస్వామి (బిజెపి), బక్క పిచ్చయ్య (టిఆర్ఎస్), బి.మల్లికార్జున్ (టిడిపి), తదితరులు పాల్గొన్నారు.

TS: నేటి నుంచి పోలీస్ కానిస్టేబుల్ లకు శిక్షణ

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షలు జరిగిన తరువాత అభ్యర్థులు ఎంపిక చేశారు.

కొంత మంది ఎంపిక కానీ అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు. తమకు మార్కులు కలపాలని కోర్టులో కేసు వేయడంతో కానిస్టేబుల్ ఉద్యోగులను నియమించేందుకు కాస్త ఆలస్యం అయింది. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ కి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో 9,333 మంది కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ఇవ్వనుండగా.. రెండో విడుతలో 4,725 మంది TSSP కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. రెండో విడుత ట్రైనింగ్ సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

TS: పెద్దల సభకు పంపించినందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు: అనిల్ కుమార్ యాదవ్

HYD: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం తన అనుచరులతో కలిసి హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆదర్శనగర్ నుండి నేరుగా అమరవీరుల స్థూపం వద్ద కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. 

అనంతరం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ బిడ్డ అయిన తనను చిన్న వయస్సు లోని పెద్దల సభకు పంపించి ఆశీర్వదించిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సిఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
NLG: యూత్ ఫర్ సేవ కాంపిటీషన్ లో బహుమతులు పొందిన జేబీఎస్ హైస్కూల్ విద్యార్థులు

నల్గొండ పట్టణంలో యూత్ ఫర్ సేవ సంస్థ ఆధ్వర్యంలో, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థిని విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయడంలో భాగంగా ఇటీవల నిర్వహించిన, పలు పోటీలలో మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు ఆటపాటల్లో, డ్రాయింగ్, రన్నింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచి షీల్డ్స్ మరియు ప్రత్యేకమైన బహుమతులు సాధించి, పలువురి చేత ప్రశంసలు అందుకున్నందుకు గాను, సోమవారం పాఠశాల ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం స్టూడెంట్స్ ను వారికి సహకరించిన ఉపాధ్యాయురాలు ప్రతిమ ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

NLG: సిపిఎం ఆధ్వర్యంలో మర్రిగూడ తాహసిల్దార్ కు వినతిపత్రం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండల సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో, తహసిల్దార్ బక్క శ్రీనివాసులు కు నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. మండలంలో వివిధ గ్రామాల్లో అర్హత కలిగిన ఆసరా పెన్షన్ దారులకు, కాలయాపన చేయకుండా నూతన పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల సహాయ కార్యదర్శి నీలకంఠం, రాములు, కొట్టం యాదయ్య, నారోజు అంజాచారి, నామ సైదులు పాల్గొన్నారు.

NLG: మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: మంత్రి కోమటిరెడ్డి

ఈ నెల 26న నల్గొండ లోని ఎం. జీ యూనివర్సిటీ లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న, మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లగొండ యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టాస్క్, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ను, 

సోమవారం హైదరాబాదులో మంత్రుల నివాస సముదాయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడుదల చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. నల్లగొండ ప్రతీ యువతీ, యువకుడికి ఉద్యోగ ఉపాధి కలిగించేలా కృషి చేస్తానని తెలిపారు. వివిధ సంస్థలలో ఉద్యోగ ఖాళీలను గుర్తించి జాబ్ మేళాను నిర్వహిస్తామని తెలిపారు. 

రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోయే నల్గొండ స్కిల్ సెంటర్ ద్వారా ఒక్కో సెషన్ లో పదివేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ కల్పన చేస్తామని మంత్రి ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, TFMC సీఈఓ సత్యనారాయణ, ప్లేస్ మెంట్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

NLG: మేటి చందాపురం గ్రామంలో టీబీ అవగాహన సదస్సు

మర్రిగూడ: మండలం టీబి నోడల్ అధికారి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో మేటి చందాపురం గ్రామంలో టీబీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లక్షణాలు ఉన్న వారి నుంచి తెమడ సేకరించి పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించినారు. కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ మల్లేశం, డాక్టర్లు శ్రీనివాసులు, ప్రశాంతి, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.