/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం Raghu ram reddy
మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం

రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు..

చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం కరెక్టు కాదన్న సర్వన్ సింగ్ పంధర్

పంజాబ్ లో రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లను దిగ్బంధించనున్న బికేయూ నేతలు రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్, రైతులు.. 

మధ్యాహ్నం 12 గంటల నుంచి నాలుగు గంటల వరకు రైల్వే ట్రాక్లపై నిరసన తెలుపనున్న భారత్ కిసాన్ యూనియన్ (బికేయు) నాయకులు.

Supreme Court: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది..

జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈనెల 26కు వాయిదా వేసింది. సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేయాలని చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. మూడు వారాల తర్వాత విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు..

సీఐడీ తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ స్పందిస్తూ కౌంటర్‌ దాఖలుకు గతంలో సమయం తీసుకుని ఇప్పుడు మళ్లీ వాయిదా కోరుతున్నారని కోర్టుకు తెలిపారు. చంద్రబాబు తరఫున కౌంటర్‌ దాఖలు చేశారని చెప్పారు. విచారణకు తేదీని నిర్ణయించాలని కోరారు.

తొలుత రెండు వారాల తర్వాత లిస్ట్‌ చేయాలని ఆదేశించిన ధర్మాసనం.. రంజిత్‌కుమార్‌ విజ్ఞప్తితో ఈనెల 26కి వాయిదా వేసింది..

చావులోనూ వీడని స్నేహం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో బావిలో ఇద్దరు స్నేహితులు పడి మృత్యు వాత పడ్డారు.

తుమిడే హరీశ్(22), కంబాల మహేష్(22) ఇద్దరు స్నేహితులు. ఆదివారం సాయంత్రం ఒక పెండ్లికి వెళ్లిన వారిద్దరూ చేను వద్దకు వెళ్లారు.

  

బైక్ కొద్ది దూరంలో పార్క్ చేసి బావి వద్దకు వెళ్లారు. అక్కడ చీకటిగా ఉండటం తో ప్రమాదవ శాత్తూ జారి పడ్డారా…? లేక ఈతకు వెళ్లి చనిపోయారా..? అనేది తెలియాల్సి ఉంది.

బావి సమీపంలో మద్యం బాటిళ్లు ఉన్నాయి. సోమవారం ఉద‌యం బావిలో రెండు శ‌వాలు తేల‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేవాల్లో ఇవాళ ప్రాజెక్టులపై నోట్ ప్రవేశపెడుతోంది.

రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరే కిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.

ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

ఎస్బీ న్యూస్

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి.

ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్‌ -1 ప్రాథమిక కీని విడుదల చేసి విద్యార్థు ల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. సోమవారం ఫలితాలతోపాటు తుది కీ"ని సైతం ఎన్టీఏ విడుదల చేయనున్నది.

దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్‌ -1 పరీక్షలు జరిగాయి.పేపర్‌ -1కు 12, 21,615 మంది దరఖాస్తు చేసుకోగా, 11,70,036 (95.8 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.

ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆరిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీ ప్లానింగ్‌, వంటి సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 55,493,75శాతం, మంది పరీక్షకు హాజరయ్యారు.

ఈ ఫలితాల కోసం https://jeemain.nta.ac.inను సంప్రదించండి

వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచేకు కానిస్టేబుల్ మృతి

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఆదివారం సాయంత్రం ఓ కానిస్టే బుల్ మృతి చెందాడు.

వన్యప్రాణాల కోసం ఏర్పాటుచేసిన కరెంటు వైర్లు తగిలి విధి నిర్వహ ణలో ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. కాటారం మండల పరిధిలోని నస్తూర్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్ పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్ కు అందింది. 

దీంతో కానిస్టేబుల్ ప్రవీణ్ అడవిలో మరికొందరు సిబ్బందితో కలిసి కూబింగ్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో వణ్యప్రాణులు వేట కోసం ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు తగిలి ప్రవీణ్ స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు.

ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కరెంట్ షాక్ ట్రాప్ ను పెట్టిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

చెత్త కుప్పలో నన్ను ఎందుకు పారేసావ్ ఈ సమాజంలో జీవించే హక్కు నాకు లేదాఅమ్మ

సమాజంలో రోజు రోజుకి మానవతా విలువలు నశించిపోతున్నాయి. రక్త సంబంధానికి, పేగు బంధా నికి అర్థం లేకుండా పోతుం ది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పలలో, నడిరోడ్డు పైన పడేసి వెళుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

అప్పుడే పుట్టిన నవజాత శిశువుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సైతం సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి అమానుష ఘటన కృష్ణా జిల్లాలో ఈరోజు చోటు చేసుకుంది.

అవ‌నిగ‌డ్డ‌లో అప్పుడే భూమ్మీద పుట్టిన పసి కందును అవనిగడ్డ ఒకటో వార్డులోని చర్చి వెనక పడేసి వెళ్లారు. అదే సమ యంలో బయటికి వెళ్లి వచ్చిన పాస్టర్ కు పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు.

ప్రస్తుతం పాపను ఉన్నత వైద్యం కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.లోకం పోకడ తెలియని ఆ పసికందుపై అమానవీయంగా ప్రవర్తిం చారు.

పిల్లలు లేక ఎంతోమంది తల్లిదండ్రులు కంటికి కడివెడు రోదిస్తున్న పరిస్థితి ఉంది. తమకు ఒక బిడ్డ పుడితే చాలు అని తపస్సు చేస్తున్న దంపతులు ఎంతో మంది జంటలు ఉన్న నేటి రోజుల్లో, పుట్టిన బిడ్డలు వద్దని పారేసి వెళుతున్న ఘటనలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగిస్తు న్నాయి.

కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన తల్లిదండ్రులే ఈ విధమైన ఘటనలకు పాల్పడుతుండటంతో ఈ ఘటనలు రక్త సంబం ధాలను సైతం ప్రశ్నిస్తు న్నాయి

తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుపై నేడు చర్చ

తెలంగాణ రాష్ట్రంలోఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి.

ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు.ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగు తుంది.

అలాగే, తెలంగాణ రాష్ట్రం లోని ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది

Sb news

ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్న మునిసిపల్ టౌన్ ఏ ఈ

మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న టౌన్ ఏఈ పృథ్వి శనివారం ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు

ఏసీబి డిఎస్పి కృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టర్ పి. యాదయ్య నుంచి 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

కాంట్రాక్టర్ గత సంవత్సరం మున్సిపాలిటీకి సంబం ధించి రెండు పనులకు ఆన్లైన్లో టెండర్ వేసి 11 లక్షలకు దక్కించుకున్నాడని తెలిపారు

ఈ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ యాదయ్య ఆ పనులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ఎంవి రికార్డు చేయాలని ఏఈ పృద్విని కోరగా లంచం డిమాండ్ చేశాడని తెలిపారు

ఈ విషయాన్ని కాంట్రాక్టర్ యాదయ్య ఈనెల 7వ తేదీన ఎసిబికి ఫిర్యాదు చేశాడని చెప్పారు.. పథకం ప్రకారం ఏఈ పృద్వికి ఒప్పుకున్న 50 వేల రూపాయలు పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో యాదయ్య ఇస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకొని అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

అనంతరం విచారణ నిమి త్తం నిందితుడిని మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి అందుకు సంబంధించిన ఫైల్స్ పరిశీలించామని, రేపు ఏసిబి స్పెషల్ కోర్టు నాం పల్లిలో అప్పగిస్తా మని పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా నేరుగా మహబూబ్నగర్ కార్యాలయంలో స‌మాచా రం ఇవ్వ‌వ‌చ్చ‌ని వెల్లడిం చారు

Vijayawada: ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా

Vijayawada: విజయవాడ ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నాకు దిగారు. మెగా డీఎస్సీలో ఒక్క PET పోస్ట్ లేకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే

కేవలం 6వేల100 పోస్టులు విడుదల చేయడం అన్యాయమన్నారు. మూడేళ్లుగా లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని.. డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశామన్నారు అభ్యర్థులు. జగనన్న మా ఆశలు ఆడియాసలు చేశాడని.. 6వేల100 పోస్టుల్లో PET పోస్టులు ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు అభ్యర్థులు