NLG: మార్చి 27, 28 తేదీల్లో ఎన్జీ కళాశాలలో జాతీయ సదస్సు
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో మార్చి 27, 28 తేదీల్లో తెలుగు నాటక సాహిత్యం- సమాజం అను అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించబడుతుందని కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ అన్నారు.
బుధవారం జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడారు. జాతీయ సదస్సులను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందింపచేయడమే కాకుండా వారిలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఉపయోగపడుతుందని, అదేవిధంగా సాహిత్య పరిశోధకులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ మునీర్, డాక్టర్ అంతటి శ్రీనివాసులు, ఐక్యు ఏసి కోఆర్డినేటర్ వైవిఆర్ ప్రసన్నకుమార్, అకడమిక్ కోఆర్డినేటర్ వి. శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి వి. నాగరాజు, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య , తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఎన్. దీపిక, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ వెల్దండి శ్రీధర్, జి. గోవర్ధనగిరి, ఎస్. ప్రభాకర్, ఎం.లింగస్వామి, గ్రంథపాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, వ్యాయామ అధ్యాపకులు కె.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Feb 15 2024, 07:45