NLG: ఫిబ్రవరి 14 బ్లాక్ డే గా జరుపుకుందాం: మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు
నల్లగొండ: సహజంగా ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని వాలెంటైన్స్ డే అని తెలుసు. కానీ ఇదే రోజు 2019లో పుల్వామా దాడిలో భారత్ 40 మంది వీర జవాన్లను కోల్పోయింది. ఈ రోజును బ్లాక్ డే గా జరుపుకుందామని పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ విద్యార్థులు అన్నారు.
మంగళవారం ఎస్బి న్యూస్ తో పట్టణంలోని పలువురు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు మాట్లాడుతూ.. ప్రపంచం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది, అయితే క్రూరమైన పుల్వామా దాడుల కారణంగా ఈ రోజును భారతదేశానికి 'బ్లాక్ డే' అని పిలుస్తారని అన్నారు.
Ads
బిఏ మూడో సంవత్సరం చదువుతున్న గడగోజు శ్రీజ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14 ను ప్రపంచం ప్రేమికుల రోజు అంటుంది. కానీ భారత్ లో ఈ రోజుకి సరైన ఆదరణ లేదని, తాను ఫిబ్రవరి 14 ను బ్లాక్ డే గా చూస్తానని అన్నారు. ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాల పైన ఆమె మాట్లాడుతూ.. పెద్దలు కుదిర్చిన వివాహాలు మేలని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
Ads
అదేవిధంగా బిఏ మూడో సంవత్సరం చదువుతున్న మరో విద్యార్థిని వల్కి మనీషా మాట్లాడుతూ.. పెద్దలు కుదిర్చిన వివాహాలు మేలని, సమస్యలొస్తే పెద్దలు మాట్లాడి పరిష్కరిస్తారని అన్నారు. అంతే కాదు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం అనే భావన మన భారతీయులు మరిచిపోయి ఫిబ్రవరి 14 బ్లాక్ డే అని గుర్తుంచుకోవాలి అని అన్నారు.
మరో విద్యార్థిని మైత్రి మాట్లాడుతూ.. ప్రేమ వివాహాలకు కన్నా, పెద్దలు కుదిర్చిన వివాహాలు బెటర్ అని అన్నారు.
మరో విద్యార్థిని నసెరా మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14 బ్లాక్ డే గా నిర్వహించాలని, ప్రేమ వివాహాలలో ఒక జంట మధ్య అనుబంధం ఉంటుందని, పెద్దలు కుదిర్చిన వివాహంలో ఒక కుటుంబం మధ్య అనుబంధం ఉంటుందని తన అభిప్రాయాన్ని తెలిపారు. అదేవిధంగా తెలియని వ్యక్తులతో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో స్నేహం చేయరాదని సూచించారు.
కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ.. సెల్ఫ్ డిఫెన్స్ లో కళాశాల విద్యార్థిని లకు శిక్షణ ఇవ్వడానికి సర్టిఫికెట్ కోర్సు ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు.
Feb 13 2024, 20:16