/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తగిన ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్ హరిచందన Mane Praveen
NLG: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తగిన ప్రణాళిక రూపొందించాలి: కలెక్టర్ హరిచందన

నల్లగొండ: రాబోయే ఐదు నెలలు అప్రమత్తంగా ఉంటూ త్రాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. పానగల్ లోని మిషన్ భగీరథ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సందర్శించి నీటి సరఫరా ప్రణాళిక గురించి తెలుసుకున్నారు. అన్ని గ్రామాలకు ప్రతి రోజూ నీటి సరఫరా జరిగేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఇఇ వంశీ కృష్ణ, ఏఈ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.

NLG: ఏసీబీ వలలో ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి

కొండమల్లేపల్లి: మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి, రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేశ్య తండా గ్రామానికి బానవత్ లచ్చుకు సంభందించిన భూమి వివరాలు రికార్డుల్లో నమోదు చేసేందుకు ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి రూ. 30 వేలు అడిగాడు. బాణవత్ లచ్చు వద్ద నుండి రూ. 30 వేలు, ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి దేవరకొండ లోని మీనాక్షి సెంటర్ వద్ద తన కార్ లో తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 

గతంలో ఇతనిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కాగా ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. సదరు రైతు వద్ద నుంచి డబ్బులు తీసుకున్నది నిజమని ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నారు.

NLG: ఎం.జి యూనివర్సిటీలో అభివృద్ధి పనులపై సమీక్షించిన కలెక్టర్ హరిచందన

నల్లగొండ: ఎం.జి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ హరిచందన వివిధ అభివృద్ధి పనులను సమీక్షించారు. యూనివర్సిటీలో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, వివిధ స్థాయిల లో ఉన్న పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఇంజనీరింగ్ కళాశాలను క్రీడమైదానం, ఇండోర్ స్టేడియం ను ఆమె సందర్శించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

NLG: 'దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం'

యాదాద్రి జిల్లా: 

నారాయణపూర్ మండలంలోని సర్వేల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు కాంప్లెక్స్ పరిధిలోని మరో 4 పాఠశాలకు 'దానధర్మ చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ప్యాడ్, నోటు బుక్స్, పెన్స్ ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం అని, వారి సేవా కార్యక్రమాలను కొనియాడారు. ట్రస్ట్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

నల్లగొండ: జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేతపల్లి మండలం ఇప్పలగూడెం గ్రామంలో వంటల సైదులు ను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. పోలీసులు మాట్లాడుతూ.. ఇప్పలగూడెం గ్రామంలో మోదల శ్రవణ్ కుమార్ కు చెందిన వ్యవసాయ భూమిలో, వంటల సైదులు కూలి పని చేసేవాడు. ఈ క్రమంలో శ్రవణ్ కుమార్ భార్యతో సైదులు చనువుగా ఉండేవాడని, దీంతో తన భార్యకు సైదులు కు అక్రమ సంబంధం ఉందని భావించిన శ్రవణ్.. ఎలాగైనా సైదులను చంపాలని తన సొంత బామ్మర్ది అయిన బండారి వెంకటేశ్వర్లు, మరో వ్యక్తి సాయికుమార్ ని కలిసి మర్డర్ కి ప్లాన్ చేశాడు.

అందరూ కలిసి శ్రవణ్ కుమార్ వ్యవసాయ భూమి వద్ద మద్యం సేవించి పథకంలో భాగంగా సైదులు ను చంపుటకు వ్యవసాయ పొలం వద్ద వాడే ఇనుప సుత్తె ను బండిలో తీసి పెట్టుకొని, రాత్రి 7:30 గంటల సమయంలో సైదులు ఊర్లో బెల్ట్ షాపు వద్ద మద్యం సేవిస్తుండగా వెంకటేష్, సాయి ఇద్దరు అక్కడికి వెళ్లి సైదులు తో కలిసి మనం బయటకు వెళ్లి మాట్లాడుకుంటూ మద్యం సేవిద్దామని నమ్మబలికి, గ్రామంలోని ఐకెపి సెంటర్ వద్దకు తీసుకెళ్లారు.

అక్కడ అందరూ కలిసి మద్యం సేవిస్తూ తన భార్య వెంట ఎందుకు పడుతున్నావని సైదులు ను శ్రవణ్ ప్రశ్నిస్తూ ఉండగా మాట మాట పెరిగింది. దీంతో శ్రవణ్ కుమార్, వెంకటేష్ తమతో పాటు తెచ్చుకున్న సుత్తితో సైదులు మీద దాడి చేసి కొట్టి సైదులు ను చంపినట్లు పోలీసులు తెలిపారు. సైదులు ను చంపేటప్పుడు సాయికుమార్ రోడ్డుపై ఎవరూ రాకుండా కాపలా ఉన్నట్లు తెలిపారు. మృతుని కుమారుడు చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేతపల్లి ఎస్సై కేసు నమోదు చేసి విచారణ జరిపి, నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

NLG: ఈనెల 14 నుండి 21 వరకు చెరువుగట్టు జాతర

నార్కట్ పల్లి మండలం, చెరువుగట్టు గ్రామం:

నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రం శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 14 నుండి 21 వరకు జరగనుంది. 14 నగరోత్సవం, 16న స్వామివారి కల్యాణ మహోత్సవం, 18న అగ్నిగుండాల, 19న దోపోత్సవం- అశ్వవాహన సేవ, 20న మహా పూర్ణాహుతి, పుష్పోత్సవం, 21న గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి నవీన్ తెలిపారు.

NLG: నల్లగొండ డిపిఆర్ఓ శ్రీనివాస్ బదిలీ

నల్లగొండ డిపిఆర్ఓ శ్రీనివాస్ బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాకు బదిలీ చేస్తూ సమాచార కమిషనర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. మహబూబ్ నగర్ డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు నల్లగొండకు బదిలీ అయ్యారు.

NLG: ప్రేమ జంటలను బెదిరించి ఆభరణాలు, డబ్బులు దోపిడీ చేస్తున్న ముఠా అరెస్ట్

నల్లగొండ: గత కొద్ది రోజులుగా నల్లగొండ శివారులో ప్రేమ జంటలను బెదిరించి సెల్ ఫోన్లు నగదు బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తున్న ఆరుగురి ముఠాను అరెస్టు చేసినట్లు నల్గొండ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.

బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణంలోని నరసింహారెడ్డి కాలనీకి చెందిన కున్చెం సైదులు, కున్చెం ప్రశాంత్, కొత్తగూడెం గ్రామానికి చెందిన చింతా నాగరాజు, రాంనగర్ కు చెందిన లక్ష్మణ్, శివరాత్రి ముఖేష్ , నర్సింహారెడ్డి కాలనీకి చెందిన కున్చెం రాజు ఒక ముఠాగా ఏర్పడి ప్రేమ జంటలను దోపిడీ చేస్తున్నట్లు తెలిపారు.

బుధవారం ఉదయం నల్గొండ టు టౌన్ సిఐ మరియు వారి సిబ్బంది, విశ్వసనీయ సమాచార మేరకు నల్గొండ శివారులో ఉన్న నరసింహారెడ్డి కాలనీలో ఉన్న నేరస్తుడు కున్చెం చందు ఇంటికి వెళ్లి అతని ఇంటిలో ఉన్న మిగతా ఐదుగురు వ్యక్తులను పట్టుకొని విచారించగా.. వారు గత కొద్దిరోజులుగా నార్కట్పల్లి అద్దంకి హైవేపై పోయే ప్రయాణికులు , ప్రేమ జంటలు , ఖాళీ స్థలంలోకి వచ్చి ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని సెల్ఫోన్లలో వీడియో తీసి బెదిరించి కొట్టి వారి దగ్గర ఉన్న నగలు సెల్ ఫోన్లు డబ్బులు తీసుకునేవారమని ఒప్పుకున్నట్లు తెలిపారు.

ఈ విషయం బాధితులు భయపడి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేవారని దోచుకున్న డబ్బును మద్యానికి ఇతర విలాసాలకు ఖర్చు చేసుకునే వారని నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు .వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు, రెండు ఉంగరాలు, రెండు టీవీలు, ఆపిల్ వాచ్, మూడు ఫ్యాన్లు, డ్రిల్లింగ్ మిషన్ , ఒక ఇన్వర్టర్, హోమ్ థియేటర్, గ్యాస్ స్టవ్, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

TS: తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్:రా నున్న వేసవి అధికంగా ఉష్ణోగత్రలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

కమిషనర్ రొనాల్డ్ రోస్, కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్లు, అధికారులతో కలిసి హైదరాబాద్ నగర అభివృద్ధి, సమస్యలపై ఆయన తొలిసారిగా ఈరోజు సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు.

వేసవిలో తాగునీరు సక్రమంగా సరఫరా కాని ప్రాంతాలను ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

SB NEWS TELANGANA

YDD: అనుమానాస్పద స్థితిలో విద్యార్థుల ఆత్మహత్య పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి: మేడి ప్రియదర్శిని

ప్రభుత్వం విద్యార్థినులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఇవ్వాలి

బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

భువనగిరి ఎస్సీ హాస్టల్ విద్యార్థుల మృతి పై బీఎస్పీ నకిరేకల్ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులను కౌన్సెలింగ్ పేరుతో పిఈటి, వార్డెన్, ఆటో డ్రైవర్ కలిసి నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేసినారని, కనీసం తల్లిదండ్రులకు తెలియజేయలేదని, కౌన్సిలింగ్ పేరుతో విద్యార్థులు మనస్థాపానికి గురయ్యారని అన్నారు. 

జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించకపోవడం, కనీసం పరామర్శించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబాలను పూర్తిగా ఆదుకుని ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.