NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు సైబర్ క్రైమ్ పై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.

నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున, నల్గొండ టూ టౌన్ ఎస్సై నాగరాజు సహకారంతో కళాశాల విద్యార్థిని లకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు.
వారు మాట్లాడుతూ.. ఈ మధ్య సోషల్ మీడియా, ఫేస్బుక్ మరియు వాట్సాప్ లలో జరుగుతున్న వివిధ రకాలైన నేరాల పై అవగాహన పెంచుకోవాలని, వాటిని అధిగమించాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్లు ఐతే స్పందించ కూడదని, వాట్సప్ మిగతా సోషల్ మీడియా సైట్లకు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించిన సలహాలు వివరంగా తెలియజేయడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఘన్ శ్యామ్, వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు మంజుల, సుంకరి రాజారామ్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ జ్యోతి, శైలజ, సరిత, వనజ తదితరులు పాల్గొన్నారు.
Feb 02 2024, 17:22