/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz నేడు సీఎం జగన్ ను కలవనున్న వైయస్ షర్మిల Yadagiri Goud
నేడు సీఎం జగన్ ను కలవనున్న వైయస్ షర్మిల

వైఎస్ షర్మిల ఇవాళ సీఎం జగన్‌ను కలవనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమా నంలో షర్మిలా రెడ్డి కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకొ ని, సాయంత్రం తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసా నికి వెళ్లనున్నారు.

కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ మోహన్ రెడ్డికి షర్మిలా రెడ్డి అందించ నున్నారు.

వైఎస్ షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి, కుమార్తె, కోడలి తరపు కుటుంబ సభ్యులుకూడా జగన్ వద్దకు వెళ్లనున్నారు.

SB NEWS

చర్లపల్లి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ పేలుడు..

హైదరాబాద్ : చర్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో భారీ శబ్ధంతో చోటుచేసుకున్న పేలుడు ధాటికి మ్యాన్ హోల్ మూత ఎగిరిపడింది..

దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

పరిశ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

చర్లపల్లిలోని వెంకట్రెడ్డి నగర్లో గల మధుసూదన్రెడ్డి నగర్లో ఈ అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు..

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక: సీఎం జగన్‌ కాకినాడ పర్యటన

తాడేపల్లి: విశ్వసనీయతకు అర్ధం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుక, పెన్షన్..

పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. ప్రతీ నెలా రూ.3,000 రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు..

నేడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందజేయనున్నారు..

పర్యటన ఇలా..

ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు..

Congress: నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

నేడు గాంధీభవన్‌లో మద్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ భేటీ జరగనుంది.

ఈ మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు

టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లు, పాల్గొంటారు..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతంపై సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై ఆయన స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది..

Raa Kadali Ra: నేటి నుంచి 'రా కదలి రా!'

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం-జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి..

సీఎంగా వైఎస్‌ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఇవాళ్టి నుంచి “రా కదలి రా!” పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఇక, తెలుగుదేశం- జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు..

సైకిల్ – గాజు గ్లాసు తో కూడిన లోగోను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించిన విషయం విదితమే.. ఈ రోజు పంచాయితీల సమస్యలపైసర్పంచ్‌లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తారు.. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది..

5వ తేదీ నుంచి 29 వరకూ అన్ని 22 పార్లమెంట్ స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటాయి.. 5న ఒంగోలు, 6న విజయవాడ, నరసాపురం పార్లమెంట్ పరిధిలో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 18న ఎన్టీర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో భారీ సభ నిర్వహించనున్నారు..

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. అంగన్‌వాడీలకు అల్టిమేటం జారీ

అంగన్‌వాడీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధుల కానీ వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది..

ఈ నెల 5వ తేదీ లోపు విధులకు హాజరుకాకుంటే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. విధులకు హాజరుకానీ అంగన్‌వాడీల వివరాలు సేకరించాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంపై అంగన్‌వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జీతాలు పెంచాలంటూ గత 20 రోజులుగా అంగన్‌వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే..

ఇప్పటికే అంగన్‌వాడీలు ప్రభుత్వంతో ఓసారి చర్చలు జరపగా.. అవి విఫలం అయ్యాయి. అంగన్వాడీలు మళ్లీ సమ్మె బాటపట్టారు. దీంతో రాష్ట్రంలోని బాలింతలు, గర్బిణీలు, శిశువులు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో విధులకు హాజరుకావాలని ప్రభుత్వం ఇవాళ అల్టిమేటం జారీ చేసింది..

Kishan Reddy: జనసేనతో బీజేపీ దోస్త్‌ కటీఫ్‌..! కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

జనసేనతో బీజేపీ దోస్తీ కటీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..

గెలుపే ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికల రాష్ట్ర పార్టీకి పెద్దగా సంబంధం ఉండదని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ల అమలు పై కేంద్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసిందని అన్నారు.

ఈ నెల 17న సుప్రీం కోర్టులో కేసు ఉందన్నారు. ఆ లోపే ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేస్తుందని.. బీజేఎల్ పీ నేత ఎంపిక ఎప్పుడైనా ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అని ఎక్కడా చర్చ జరగలేదని అన్నారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారంటీ అనే వార్తలు బేస్ లెస్ అన్నారు. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కమిటీ లు వేస్తున్నామని అన్నారు. వాళ్లతో మీటింగ్ ఉంటుందన్నారు..

అంశం చర్చకు రాలేదన్నారు. ఆయన మాదిగ రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు తెలిపారని అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినా ఎవరికి ప్రయోజనం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో లీడర్ ఎవరో తెలియదు? అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయడానికి జనాలు సిద్దంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. భవిష్యత్ లో అక్కడి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని అనుకుంటుందన్నారు. అయ్యప్ప భక్తులకు కనీస సదుపాయాలు కల్పించలేకపోతుందని అన్నారు. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నమని, జనసేన ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉందని అన్నారు..

PM Modi: భారతీయ యువతకు ఇది మంచి సమయం: ప్రధాని మోదీ

తిరుచ్చిరాపల్లి: భారతీయ యువత తమ నైపుణ్యాలతో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. చంద్రయాన్‌ వంటి ప్రయోగాలతో మన శాస్త్రవేత్తలు భారత్‌ సత్తాను ప్రపంచానికి చాటారని ప్రశంసించారు..

తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో ఉన్న భారతీదాసన్‌ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..

''యువత ధైర్యవంతమైన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే నినాదంతో భారతీదాసన్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ప్రస్తుతం దేశ యువత అదే పనిలో నిమగ్నమై ఉంది.

యువత అంటేనే శక్తికి నిదర్శనం. నైపుణ్యంతో వేగంగా పనిచేయడం వారికున్న సామర్థ్యం. దేశాభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు యువతకు ఇది మంచి సమయం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా.. నైపుణ్యాలను పెంచుకుంటూ.. కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి'' అని యువతకు మోదీ సూచించారు..

Ponguleti: మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఖమ్మం : గత ప్రభుత్వం పేదల సమస్యలను విస్మరించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రోజుకు 16 గంటలపాటు చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని చెప్పారు..

ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెంలో నిర్వహించిన 'ప్రజాపాలన' సభలో పొంగులేటి మాట్లాడారు..

'గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. రూ.6.71 లక్షల కోట్లు అప్పు చేసింది. గత సీఎం ఎన్నో అప్పులు చేసి ప్రజాధనంతో గొప్ప భవనం కట్టుకున్నారు.

మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తొలి మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాం. దీంతోనే మా ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచాం. మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నాం'' అని పొంగులేటి అన్నారు..

Bhavani Deeksha Viramana: రేపటి నుంచి భవానీ దీక్షా విరమణ.. ఇంద్రకీలాద్రిపై విస్తృత ఏర్పాట్లు..

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి..

ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు.

ఈ నేపథ్యంలో దీక్ష విరమణ మహోత్సవాలకు దుర్గగుడి దగ్గర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక, రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

మరోవైపు భవానీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో.. దుర్గగుడి అధికారులు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీక్షా విరమణలకు హోమగుండాలను అధికారులు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6:30 గంటల నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లపై దృష్టిసారించారు..