/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. నేటి పర్యటన వివరాలు Mane Praveen
NLG: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. నేటి పర్యటన వివరాలు
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం మర్రిగూడ మునుగోడు మండలాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారు గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేయనున్నారు. అదేవిధంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు
*ఉదయం 8 గంటలకు మర్రిగూడ మండలం అంతంపేట గ్రామంలో..
*ఉదయం 8:30 కి మర్రిగూడ పట్టణంలో..
*ఉదయం 9 గంటలకు మర్రిగూడ విజయ గార్డెన్ లో మండలానికి సంబందించిన లబ్దిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందచేయనున్నారు. *ఉదయం 11 గంటలకు లెంకలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
*మధ్యాహ్నం 12 గంటలకు మునుగోడు సత్య ఫంక్షన్ హాల్లో మండలానికి సంబందించిన లబ్దిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందచేయనున్నారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
TS: ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీ, ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసిబి డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఏ ఆర్ శ్రీనివాస్ ను తెలంగాణ పోలీస్ అకాడమీ అడిషనల్ డైరెక్టర్ గా, డిఐజి హోంగార్డ్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ లో పనిచేస్తున్న అంబర్ కిషోర్ జా ను రాచకొండ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రేపో, ఎల్లుండో షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో సీనియర్ ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
ఆశ వర్కర్ల సమ్మె 14వ రోజు: అలుపెరుగని ఆశాల పోరాటం.. వంటావార్పు తో నిట్టూర్పు..

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ సమ్మెలో భాగంగా ఆదివారం,  రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా 14వ రోజు వంటావార్పు కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేలు  ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ, రాష్ట్రంలో అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ వర్కర్లు నిరసనలు తెలియజేస్తున్నారని అన్నారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆశాల పట్ల కనికరం కలగడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు 28,000 మంది ఆశా వర్కర్ పనిచేస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు కావడం వలన ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఆలోచించి ఈ ఆరోగ్య కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, భీమనపల్లి అరుణ, కాలం సుజాత, పల్లె కౌసల్య, కోయ మంజుల, ఎస్.కె సైదాబీ, విజయమ్మ, అలివేలు మంగ, పందుల పద్మ, లప్పంగి దుర్గమ్మ, పొనుగోటి సునీత, మంజుల, ధనమ్మ, యాదమ్మ, సునీత, జాజాల అనిత, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమల్ల వెంకటేశ్వర్లుకు అనారోగ్యం, హాస్పిటల్లో సందర్శించిన బిఎస్సి నాయకులు
NLG: సాగర్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఇన్చార్జి ఆదిమల్ల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో, నేడు మిర్యాలగూడ అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ రాష్ట్ర మహిళ నాయకురాలు ఇంద్రకంటీ కవిత, నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకులు ముదిగొండ వెంకటేశ్వర్లు, బత్తుల ప్రసాద్, రమావతు రమేష్ రాథోడ్, బైరాగి విజయ, రమావత్ సర్దార్ తదితరులు హాస్పిటల్ కి వచ్చి ఆదిమల్ల వెంకటేశ్వర్లు కండిషన్ తెలుసుకొని, డాక్టర్ల తో మాట్లాడారు. 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత కండిషన్ ఎలా ఉన్నది చెప్తామని డాక్టర్లు తెలిపినట్లు నాయకులు తెలిపారు. అక్కడే ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. మరింత సమాచారం తెలియాల్సింది.
మరి కొద్ది సేపట్లో ముదిరాజుల ఆత్మగౌరవ సభ, అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: దాసరి గణేష్ ముదిరాజ్
NLG: తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 3 గంటలకు సికింద్రాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తెలంగాణ ముదిరాజుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ MEPA, మర్రిగూడ మండల అధ్యక్షులు దాసరి గణేష్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో 14.7% ఉన్న ముదిరాజు లకు అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పార్టీ 20 ఎమ్మెల్యే సీట్లు, 3 పార్లమెంటు సీట్లు కేటాయించాలని, మరికొన్ని డిమాండ్లతో ముదిరాజుల మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున ముదిరాజ్ బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభ ను విజయవంతం చేయాలని కోరారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
ఈనెల 14న ఎంగిలిపువ్వు బతుకమ్మ
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో  ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా అర్చకులు మొహనాచార్యులు మాట్లాడుతూ.. ఈనెల 14న  శనివారం నాడు ఎంగిలిపువ్వు బతుకమ్మ, 22న ఆదివారం నాడు సద్దుల బతుకమ్మ, 23న సోమవారం నాడు విజయదశమి దసరా పండుగ జరుపుకోగలరని, కారంపూడి మోహనాచార్యులు శ్రీ భక్తానంజనేయ సహిత సంతోషిమాత దేవాలయం అర్చకులు తెలిపారు. SB NEWS SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: మర్రిగూడ మండల చౌరస్తాలో ఆశాల రాస్తారోకో
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో ఆశా వర్కర్ల సమ్మె 13వ రోజు సందర్భంగా మర్రిగూడ చౌరస్తాలో..శనివారం రాస్తారోకో చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18,000 నిర్ణయించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యము, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్ లు పరిష్కరించాలని 13 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, వారి సమ్మె విరమింపజేయాలని  డిమాండ్ చేశారు. లేనియెడల జరగబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలను ఇంటికి సాగనంపడం ఖాయమని వారు అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు ఆశాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా ఐదు లక్షలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అన్నింటిని వర్తింపజేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, భీమనపల్లి అరుణ, రామావత్ జయమ్మ, కోయ మంజుల, పల్లె కంసల్య, లపంగి దుర్గమ్మ, కాలం సుజాత, జాజాల అనిత, ఆయిల్ల కలమ్మ, దామెర యాదమ్మ, అయితరాజు సునీత, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST
NLG: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా:
చిట్యాల: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కారం చేయకపోతే నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని నకిరేకల్ బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి ప్రియదర్శిని అన్నారు. శనివారం చిట్యాల మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె కు ఆమె సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్‌ అవుట్స్‌ ను నివారించడం తో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సర్కారు.. కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సకాలంలో బిల్లులు, వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గు చేటు అని విమర్శించారు.

జిల్లాలో కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో మధ్యాహ్న భోజన నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు వంట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అప్పులు చేసి మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు, జీవోలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం తోనే కార్మికులు సమ్మెబాట పట్టారని తెలిపారు. పెరిగిన నిత్యావసర సరకుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో అప్పుల పాలవుతున్నామని కార్మికులు పేర్కొంటున్నారని స్పష్టం చేశారు.

కనీస వేతనం  రూ. 26000/-  ఇవ్వాలని, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకులన్ని ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్‌లను తగ్గించే దిశగా మొదలైన మధ్యాహ్న భోజన పథకం సత్ఫలితాలిస్తున్నా.. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అల్పాహారం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు.

మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన 12 డిమాండ్లను తీర్చకపోతే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మండల అధ్యక్షులు గ్యార శేఖర్, మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, జోగు శేఖర్, జోగు యోగి, మధ్యాహ్న భోజన కార్మికులు, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
మునుగోడు: సోలిపురం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
నల్లగొండ జిల్లా:
మునుగోడు ఉప ఎన్నికలలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇచ్చిన హామీ అమలులోకి వచ్చింది. ఉపఎన్నికల్లో టి ఆర్ యస్ ఆభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన పక్షంలో మునుగోడు మండల కేంద్రం నుండి సోలిపురం గ్రామం మార్గం మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం దశాబ్దాల తరబడి నిరీక్షణకు తెర దించుతానంటూ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఆ ఎన్నికల్లో విజయం సాధించిన మీదట పలుమార్లు స్థానిక శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలసి రాష్ట్రస్థాయి నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందుకు అనుగుణంగా అధికారులు రూపొందించిన డి పి ఆర్ ను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి విషయాన్ని వివరించగా, అందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సోలీపురం బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో శనివారం రోజున అధికారులు 404.50 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దశాబ్దాల కాలం నుండి ఏ ఎన్నికలు వచ్చినా మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న సోలిపేట బ్రిడ్జి ఎన్నికల అంశంగా పతాక శీర్షికలకెక్కేది. అటువంటి సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలు ముగింపు పలికాయి. ఆ ఎన్నికల్లో అన్నీ తానై భుజాల మీద వేసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి రాజకీయాలకతితంగా గ్రామస్తులు అందరూ ముక్తకంఠంతో తేవడం తో స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి, సాంకేతికంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డి పి ఆర్ రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్  అనుమతులు తీసుకోవడంతో కధ సుఖాంతం అయి, శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఎన్నికలు పూర్తి అయిన మీదట ఎప్పటి మాదిరి గానే అటకెక్కుతుందేమో అనుకున్న తీరుకు భిన్నంగా సోలిపురం బ్రిడ్జి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ కావడంతో మునుగోడు మండలం సోలిపురం గ్రామస్తులు హర్షం  వ్యక్తం చేశారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
మునుగోడు నియోజకవర్గంలో పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేయనున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ఆదివారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉదయం 7 గంటలకు చండూర్ మండలం ఇడికుడ గ్రామంలో,

ఉదయం 8 గంటలకు చండూర్ మండలం గొల్లగూడం గ్రామంలో,

ఉదయం 9 గంటలకు చండూర్ BRC ఫంక్షన్ హాల్లో చండూర్ మరియు గట్టుప్పల్ మండలాలకు సంబందించిన గృహలక్ష్మి లబ్దిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు పుట్టపాక ఫంక్షన్ హాల్లో నారాయణపురం మండలానికి సంబందించిన లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేస్తారు.

సాయంత్రం 4 గంటలకు జయశ్రీ ఫంక్షన్ హాల్లో చౌటుప్పల్ మండల మరియు మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలను అందజేయనున్నారు.

ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.