/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: మర్రిగూడ మండలంలో వంటావార్పు తో నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు Mane Praveen
NLG: మర్రిగూడ మండలంలో వంటావార్పు తో నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో  శనివారం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పాల్గొని, మద్దతు తెలిపి మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం  రూ. 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు 10 లక్షలు హెల్పర్ కు 5 లక్షల చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని,  2017 నుండి టీఏ డీఏ ఇంక్రిమెంట్, అలవెన్సులు బకాయిలు మొత్తం చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
TS: నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం ఆనందంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌ లో గవర్నర్‌ తమిళిసై శనివారం కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. "తమకు (మహిళలకు) 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ప్రధాని మోదీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఒకప్పుడు నేను భాజపా నేతను, ఇప్పుడు గవర్నర్‌ను.. రాజకీయాలపై ఇష్టం వల్లే వైద్య వృత్తికి దూరంగా ఉన్నా, రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. గవర్నర్‌గా వచ్చిన తర్వాత ఇద్దరు మహిళలు మంత్రులు అయ్యారు.

నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు.. రాళ్లు వేసే వారున్నారు. నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా. నాపై పిన్స్‌ వేస్తే..ఆ పిన్స్‌ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర బుక్‌ రాసుకుంటా.. అందరూ అందరికీ నచ్చాలని లేదు. నాపై పువ్వులు వేసినా.. రాళ్లు వేసినా ఆహ్వానిస్తా. మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలి. ఎలాంటి అవమానాలు పట్టించుకోను.. ప్రజల కోసం పనిచేస్తా'' అని గవర్నర్‌ వెల్లడించారు.
NLG: కలెక్టర్ కర్ణన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అరుంధతి మేధావుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భాషపాక చంద్రశేఖర్
నల్గొండ: జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బంగ్లాలో అరుంధతీయ మేధావుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భాషపాక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో  జిల్లా కలెక్టర్ ఉండాలని, ప్రభుత్వం నుండి అందిస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు అందే విధంగా కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్య సలహాదారు బాకీ యాదగిరి, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, నల్లగొండ జిల్లా అధ్యక్షులు యల్ నగేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA
TS: పోలీస్ స్టేషన్ ముందే వ్యక్తి పై దాడి చేసిన రౌడీ షీటర్
HYD: మాదన్న పేట పోలీస్ స్టేషన్ ఆవరణలో వ్యక్తిపై,  రౌడీషీటర్ దాడి చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఫిరోజ్‌ అనే వ్యక్తిపై రౌడీషీటర్ ఇబ్రహీం ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీస్ స్టేషన్ ముందే కత్తితో దాడి చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. దాడి చేసిన రౌడీషీటర్ పారిపోయాడు. ఫిరోజ్‌ కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు ఉన్నట్టు సమాచారం. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,,

SB NEWS HYDERABAD

SB NEWS TELANGANA
TS: డ్రైనేజీలో ప‌డి మ‌హిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
భద్రాచలం జిల్లా: మరి కొద్దిసేపట్లో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లవలసిన శ్రీదేవి అనే మహిళ హెడ్ కానిస్టేబుల్ మృత్యు ఒడిలోకి వెళ్ళింది.  రామాలయం సమీపంలో ఉన్న డ్రైనేజీలో పడి శనివారం మధ్యాహ్నం ఆమె ప్రాణాలు కోల్పోయింది. కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి ప్రాణాలు కోల్పోయింది. కెటిఆర్ ప‌ర్య‌ట‌న‌ కు బందోబ‌స్తుకు వ‌చ్చిన ఆమె.. రామాలయం వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలం వద్ద నుంచి అన్నదాన సత్రం వైపు నడుచుకుంటూ వస్తుండగా డ్రైనేజ్ లో పడిపోయింది. స్థానికుల సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్లోయిస్ గేట్ల వద్ద కానిస్టేబుల్ శ్రీదేవి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

SB NEWS TELANGANA
బి.టీ రోడ్డు వేయాలని ఎమ్మెల్యేకు వినతి
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం: అజిలాపురం- నర్శింహ్మపురం గ్రామాల అనుబంధ రహదారిని బి.టీ రోడ్డుగా మార్చాలని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి వినతిపత్రాన్ని శనివారం మెగావత్ చందు నాయక్ అందజేశారు. అజిలాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆవాస గ్రామం నర్సింహ్మ పురం రోడ్డు సరైనది లేక ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని,  మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని కలిసి  సేవ సమాజ్ నిర్మాణ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. మెగావత్ చందు నాయక్ మాట్లాడుతూ.. అజిలాపురం గ్రామం  నుండి నర్శింహ్మపురం మీదుగా  నర్శింహ్మ పురం గేటు అనగా మెయిన్ రోడ్డు వరకు రోడ్డు పూర్తిగా కంకర తేలిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి  నర్శింహ్మపురం రోడ్డు ను బి టి రోడ్డుగా మార్చవలసిందిగా కోరారు. SB NEWS

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: ఎన్జీ కళాశాలలో ఘనంగా హిందీ భాషా దినోత్సవం
నల్లగొండ: హిందీ భాషా దినోత్సవం సందర్భంగా, పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో శనివారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యామ్ ఆధ్వర్యంలో భాషా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హోమ్ నిధి శర్మ, మేనేజింగ్ డైరెక్టర్  బిడిఎల్, హైదరాబాద్ వారు పాల్గొని  మాట్లాడుతూ.. హిందీ భాషా ప్రాధాన్యతను, భాషల ఆవశ్యకతను, హిందీ చదవడం వల్ల లభించే ఉద్యోగ అవకాశాలు గురించి వివరించారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే క్రమశిక్షణ సమయపాలన అవసరమని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. హిందీ భాషను ఎంచుకొని అభ్యసించడం వలన కలిగే లాభాలు తెలిపారు. మల్కాజిగిరి ప్రభుత్వ కళాశాల హిందీ ఉపన్యాసకులు జి ఎన్ జగన్ మాట్లాడుతూ.. హిందీ భాషా జాతీయ ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. మరో అతిధి ఖలీముద్దీన్ మాట్లాడుతూ.. హిందీ వలన భారతీయ సంస్కృతి తన భిన్నత్వాన్ని ఎలా నిలుపుకుంటుందో వివరించారు.

ఈ కార్యక్రమంలో హిందీ శాఖ అధ్యక్షులు డాక్టర్ సీతారాం రాథోడ్, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కృష్ణ కౌడిన్య, డాక్టర్ వి వి సుబ్బారావు, డాక్టర్ ఎన్ దీపిక, డాక్టర్ వెల్దండ సుబ్బారావు, లవీందర్ రెడ్డి, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, లింగస్వామి, రమ్య, గోవర్ధనగిరి, తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.




NLG: విష్ణుమూర్తి కుటుంబానికి నాగార్జున ప్రభుత్వ కళాశాల సిబ్బంది ఆర్థిక సహాయం
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది , మరియు వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల తరఫున ఇటీవల మరణించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు విష్ణుమూర్తి కుటుంబానికి రూ.7,57,500/- ఆర్థిక సహకారం అందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన శ్యామ్, మరియు కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో కుటుంబానికి ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి డిపాజిట్ చేసిన డాక్యుమెంట్లు మరియు ఎల్ఐసి పాలసీ కాపీని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ప్రమాదవశాత్తు విష్ణుమూర్తి మరియు స్వప్న ఇద్దరు చనిపోవడం కారణంగా వారి పిల్లలకు, వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాగార్జున కళాశాల సిబ్బంది ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మునీర్, శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ చంద్రశేఖర్, ప్రసన్న కుమార్, నాగరాజు, మల్లేశం, వెంకటేష్, కళాశాల సిబ్బంది సూదిని వెంకటరెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.
మర్రిగూడ: ఆశాల మానవహారం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా శనివారం మండల కేంద్రంలో  మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశా వర్కర్ లు తమకు, ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశలు సమ్మెలోకి దిగడం జరిగిందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ ల సమస్యలు పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో ఆశాల మానవహారం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెలో భాగంగా శనివారం మండల కేంద్రంలో  మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆశా వర్కర్ లు తమకు, ఫిక్స్డ్ వేతనం రూ.18000 నిర్ణయించాలని, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఆశలు సమ్మెలోకి దిగడం జరిగిందని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ ల సమస్యలు పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో పలువురు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA