/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz సరంపేట: ముత్యాలమ్మ దేవస్థాన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం Mane Praveen
సరంపేట: ముత్యాలమ్మ దేవస్థాన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం సరంపేట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవస్థాన గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి మండపం వద్ద బుధవారం సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వెన్నెమల్ల వెంకటమ్మ మధుకర్ సహకారంతో ఏర్పాట్లు చేసినారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సభ్యుల ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ జెల్లకుల సైదులు, మరియు బిఆర్ఎస్ నాయకులు వెన్నెమల్ల నరసింహ లను శాలువాతో సత్కరించి సన్మానించారు. తదుపరి లడ్డు వేలం పాటకు మరియు గణేష్ నిమజ్జనం కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP
మర్రిగూడెం మండలంలో కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె
NLG: అంగన్వాడి ఉద్యోగుల సమ్మె 17వ రోజు సందర్భంగా, మర్రిగూడ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నక్క గిరి మహారాజ్ మాట్లాడుతూ.. న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీ లు చేస్తున్న సమ్మె న్యాయమైనదని వారు అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, అట్లాగే బిఎల్ఓ డ్యూటీలను కూడా రద్దు చేయాలని వాళ్ళు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయంలు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు ఉప్పునూతల వెంకటయ్య, ఊరుపక్క సాయికుమార్, ధర్మసమాజ్ పార్టీ మండల నాయకులు నక్క గిరి, నక్క లక్ష్మణ్, అంగన్వాడి ఉద్యోగుల యూనియన్ మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శోభ,రజిత, శోభారాణి సువర్ణ, జయశ్రీ, శారద, ఉమాదేవి, సరళ, మంగమ్మ, లక్ష్మి, సుగుణ, విఘ్నేశ్వరి, అనంతలక్ష్మి, షబానీ, భాగ్య, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA DIST STREETBUZZ NEWS APP

SB NEWS TELANGANA

నీలి గర్జనను విజయవంతం చేయండి: మేడి ప్రియదర్శిని
నకిరేకల్: బిఎస్పి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో, నకిరేకల్ పట్టణ కేంద్రంలో జరిగే నకిరేకల్ నీలి గర్జన పోస్టర్ ను నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జి మేడి ప్రియదర్శిని ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నీలి కండువా రాక తోనే 30 లక్షల మందికి ఉపాధి దొరికిందని ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. నీలి కండువా రాక తోనే అన్ని కులాలు, మతాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం బహుజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. నీలి కండువా అమ్ముడుపోని మడమ తిప్పని త్యాగనిరతి గల పార్టీ అని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ పై నీలి కండువా ఎగరవేయడం ఖాయమన్నారు. ఏనుగు గుర్తును గ్రామగ్రామాన అన్ని వర్గాల వారికి చేరువ చేయాలని కార్యకర్తలను కోరారు. ఓట్లు మావి సీట్లు మీవా అని ప్రశ్నించారు. ఓట్లు మావే సీట్లు మావే అని కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు. నకిరేకల్ పట్టణ కేంద్రంలో అక్టోబర్ 5వ తేదీ ఉదయం 11 గంటలకు లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగే నీలి గర్జన ముఖ్య కార్యకర్తల సమావేశం ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, మల్లేష్, వినయ్ యోగి, సంతోష్, మల్లికార్జున్, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA DIST
కుదాబక్షిపల్లి గ్రామంలో ఆయుష్మాన్ భవ హెల్త్ మేళా నిర్వహించిన మండల నోడల్ సూపర్వైజర్
నల్లగొండ జిల్లా: ఈరోజు మర్రిగూడ మండలం కుదాబక్షిపల్లి గ్రామంలో ఆయుష్మాన్ భవ హెల్త్ మేళ మరియు టి.బి, లెప్రసీ క్యాంపు లను మండల నోడల్ సూపర్వైజర్ ప్రేమ్ కుమార్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్యాంపులో బీపీ షుగర్ పరీక్షలు మరియు ఇతర వైద్య సేవలు ప్రజలకు అందించడం జరిగింది. ఈ క్యాంపులో ఎస్టిఎస్ సైదులు, డిపిఎమ్ఓ చంద్రశేఖర్ సార్ ,ఏఎన్ఎం లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST
TS: భక్తులతో సందడిగా ఖైరతాబాద్ మహా గణేశుడిని ప్రాంతం
హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఖైరతాబాద్ మహా గణేష్ విగ్రహానికి రాష్ట్రవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు, ప్రత్యేకత ఉన్నది. వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. నగరంలో రేపు ఖైరతాబాద్ గణేష్ నిమర్జనం ఉన్న సందర్భంగా, ఈ రోజు 69 అడుగుల, ఖైరతాబాద్ మహా గణేష్ దివ్య స్వరూపం చూడడానికి భక్తులు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వచ్చి బుధవారం మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరుసటి సంవత్సరం మళ్లీ వస్తాం స్వామి అనుకుంటూ తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణ నెలకొని సందడిగా ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక మధ్యాహ్నం సమయానికి భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు దర్శనాలను నిలిపివేశారు.

SB NEWS TELANGANA
TS: భక్తులతో సందడి నెలకొన్న ఖైరతాబాద్ మహా గణేశుడిని ప్రాంతం
హైదరాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఖైరతాబాద్ మహా గణేష్ విగ్రహానికి రాష్ట్రవ్యాప్తంగా విశిష్ట గుర్తింపు, ప్రత్యేకత ఉన్నది. వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. నగరంలో రేపు ఖైరతాబాద్ గణేష్ నిమర్జనం ఉన్న సందర్భంగా.. ఈ రోజు 69 అడుగుల, ఖైరతాబాద్ మహా గణేష్ దివ్య స్వరూపం చూడడానికి భక్తులు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వచ్చి బుధవారం మహాగణపతిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరుసటి సంవత్సరం మళ్లీ వస్తాం స్వామి అనుకుంటూ తిరుగు ప్రయాణాలు ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణ నెలకొని సందడిగా ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇక మధ్యాహ్నం సమయానికి భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు దర్శనాలను నిలిపివేశారు. SB NEWS TELANGANA STREETBUZZ NEWS TELANGANA SB NEWS
NLG: ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి

నల్గొండ పట్టణంలోని 48 వార్డు NG కాలనీలో శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BRS రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి హాజరై, ఆ ఏకదంతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తదుపరి కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యామ కవిత దయాకర్, 48 వార్డు అధ్యక్షుడు నాంపల్లి మనోహర్, సీనియర్ నాయకులు పుట్ట సుధాకర్ రెడ్డి, గుండ రాము, సోమయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు నితీష్, భరత్, మహేష్, మనిదీప్, చరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
NLG: నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి, టీ ఏస్ పి ఏస్ సి బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో పాల్గొని మాట్లాడుతూ.. ఎంతో మంది నిరుద్యోగుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నిరుద్యోగులు బలైతూనే ఉన్నారని, గ్రూప్-1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు నిర్వహించారు. ఎలాంటి పారదర్శకత లేకుండా, అక్రమాల పుట్టగా ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా మళ్ళీ పరీక్షల నిర్వహించాలనుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఆయన అన్నారు. నిరుద్యోగుల పక్షాన తీవ్ర మొండి వైఖరి వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి యావత్ నిరుద్యోగ లోకమంతా రానున్న ఎలక్షన్లలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి దగ్గర పడ్డాయని, ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని, టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ ను మరియు అలాగే సభ్యులను తొలగించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఒక లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, నూతన బోర్డును నియమించి జరగబోయే పరీక్షలను పారదర్శకతతో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. సిహెచ్ మౌనిక, సిహెచ్ కిరణ్మయి మాట్లాడుతూ.. కుటుంబాలను వదిలేసి వచ్చి సంవత్సరాలుగా లైబ్రరీలలో చదువుకుంటూ హాస్టల్ ఫీజులు కట్టి, ఒక పూట తిండి తిని తినక, మా కుటుంబాలు రోడ్లమీద పడే పరిస్థితి వచ్చినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనట్లేదని, మా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నుండి వైఖరి తగదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రేణుక, మౌనిక, కోట క్రాంతి, వినోద్ చారీ, క్రాంతి కుమార్, కిరణ్, సైదులు, విక్రమ్, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. SB NEWS

SB NEWS NALGONDA

SB NEWS TELANGANA
'అంగన్వాడి ఉద్యోగులను పెర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం ఆగదు': నాంపల్లి చంద్రమౌళి
NLG: మర్రిగూడ మండలంలో అంగన్వాడీ ఉద్యోగులు 16వ రోజు సమ్మెలో భాగంగా మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజానాట్యమండలి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు పది లక్షలు, హెల్పర్ కు 5 లక్షల చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని బిఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని, 2017 నుండి టీఏ డీఏ ఇంక్రిమెంట్ ఇన్చార్జి అలవెన్సులు బకాయిలు మొత్తం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల మంది అంగన్వాడి ఉద్యోగులను పెర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేసే వరకు పోరాటం ఆగదని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శోభ, కే రజిత,జయశ్రీ, శారద, లక్ష్మి, సులోచన, అరుణ, అనంతలక్ష్మి, పద్మ, నిర్మల, సుగుణ యాదమ్మ,విమలాదేవి, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA