మర్రిగూడెం: తహసిల్దార్ కు సమ్మె నోటీసు ఇచ్చిన ఆశ వర్కర్లు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మహేందర్ రెడ్డి కి బుధవారం ఆశ వర్కర్లు చేపట్టబోయే సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్ కి ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా తదితర డిమాండ్ల కోసం సమ్మెకు పోవడానికి సిద్ధమయ్యారని తెలిపారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు సబ్ సెంటర్ నాయకురాలు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత ,ఏర్పుల పద్మ, సుజాత, సైదా బేగం, లపంగి దుర్గమ్మ, కలమ్మ, రోజా, విజయ తదితరులు పాల్గొన్నారు
SB NEWS
SB NEWS NALGONDA DIST
Sep 20 2023, 18:29
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.7k