నవదీప్ ను ఈ నెల 19 వరకు అరెస్టు చెయ్యొద్దు: హై కోర్టు*
![]()
తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.నవదీప్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈనెల 19 వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసుల ప్రకటనపై సినీ నటుడు నవదీప్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
నేను డ్రగ్స్ కన్జ్యూమర్ కాదు. డ్రగ్స్ తీసుకున్న అనటానికి ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే నేను పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు.
నా గురించి మీడియాలో తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు. నేను మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాను. పోలీసుల స్టేట్‌మెంట్ నా కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఈ కేసులో ఎలాంటి కస్టోడియల్ దర్యాప్తు అవసరం లేదు. నేను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు.అని నవదీప్ తెలిపారు.





Sep 17 2023, 08:17
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.5k