ఎన్జీ కళాశాలలో కాళోజీ జీవితం- సాహిత్యం అను అంశంపై రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు
నల్లగొండ: కాళోజీ జయంతి సందర్భంగా స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జీవితం- సాహిత్యం అను అంశంపై రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు సోమవారం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తెలంగాణ యాసలో నవరసాలు అను అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని, బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాష కావాలని కాళోజీ కోరినట్లే ఇవ్వాళ ప్రజల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తెలంగాణ యాసలో నవరసాలతో కూడిన తాను రాసిన పాటలను పాడి సభను అలరింపజేశారు.
ఈ కార్యక్రమానికి మరో వక్తగా విచ్చేసిన ప్రముఖ కవి ఎన్ వి. రఘువీర్ ప్రతాప్ నా గొడవ- సామాజికత అను అంశంపై మాట్లాడుతూ.. కాళోజీ ఎక్కడ అన్యాయం జరిగినా, స్పందించి కవిత్వం రాశాడని, ప్రజల గొడవను తన గొడవగా భావించి కవిత్వం ద్వారా ప్రజల్ని ఆలోచింపజేశాడని అన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఘనశ్యాం మాట్లాడుతూ.. కాళోజీ నిఖార్సైన మానవత్వానికి నిదర్శనమని, విశ్వమానవతా దృక్పథాన్ని తన కవిత్వం ద్వారా ప్రబోధించారని అన్నారు.
తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ వి. వి. సుబ్బారావు, డాక్టర్ ఎన్. దీపిక, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ సీతారాం రాథోడ్,డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్, డాక్టర్ టి. సైదులు, జి.గోవర్ధనగిరి, ఎస్.ప్రభాకర్ ఎమ్. లింగస్వామి, బి. రమ్య, తదితర అధ్యాపకులతో పాటు, కవి బండారు శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
![]()

TS: అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ ల సర్వీస్ క్రమబద్దీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ ల తో పాటు 19 రకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, రాష్టం లో ఏఐటీయూసీ - సీఐటీయూ JAC గా ఏర్పడి, తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పడుతున్నారు. ఈ నెల 11 నుంచి జరిగే అంగన్వాడీ ల సమ్మె ను జయప్రదం చేయాలని అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
నల్లగొండ జిల్లా, దేవరకొండ: ఆలిండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షుడు చిట్యాల గోపాల్ ఆధ్వర్యంలో, ఆలిండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర 10వ మహాసభలను జయప్రదం చేయుట కొరకు రాష్ట్రస్థాయి సన్నాహక సమావేశం పట్టణంలోని ఐబి బంగ్లాలో ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు ఏర్పుల శ్రీనివాసు, నర్సింగ్ రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు మధు, రాష్ట్ర కార్యదర్శి కృష్ణ , జిల్లా సలహాదారుడు డాక్టర్ ఏకుల రాజారావు, జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి బరపటి వెంకటయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గ సభ్యులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్య మాట్లాడుతూ.. అక్టోబర్ 15న హైదరాబాదులో జరిగే ఏఐఎస్ఎస్డి 10వ రాష్ట్ర మహాసభ ను విజయవంతం చేయాలని కోరారు.
దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి అందుగుల లక్ష్మీనారి, దిండి మండలం అధ్యక్షుడు పాతుకుల మల్లేష్ ,మల్లేపల్లి సభ్యులు ఆదిరాల రాము, ధర్మపురి శీను, రంజిత్ సింగ్, ఎర్ర సైదులు, సాయి, తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన 'హన్స్ హైదరాబాద్ మారథాన్' పరుగు పోటీలలో 10 కిలోమీటర్ల విభాగంలో, నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థి వి. ధనుష్, ప్రధమ స్థానం సాధించి రూ. 30,000/- క్యాష్ అవార్డ్ ను గెలుచుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి ధనుష్ ను ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఘన్ శ్యామ్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, తదితరులు అభినందించారు.
నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం జాను తండాలో విషాదం నెలకొంది. జాను తండ కు చెందిన ఓ బాలుడు జలుబు, దగ్గు ఉంది అని ఈ రోజు నాంపల్లి మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించగా, ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని కుటుంబీకులు బంధువులు ఆరోపిస్తూ నాంపల్లి లో ధర్నా చేపట్టారు.
మృతి చెందిన బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమ కారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో పగిళ్ల యాదయ్య, పాక పాండు, పగిళ్ల రామకృష్ణ, పురుషోత్తం, రాజశేఖర్, హరి, అశోక్, కార్తీక్, జనార్ధన్, రాహుల్ కుమార్, దుర్గేష్, మేతరి శంకర్, దాసరి గణేష్ ముదిరాజ్, కాటగోని కృష్ణయ్య, మేతరి రమేష్, ఏర్పుల సురేష్, చాపల వినయ్, గుండెపురి శంకర్, శ్రీను, ప్రశాంత్, ఏ.రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో ఈరోజు ముత్యాలమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, గ్రామ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఆ తల్లి దీవెనలతో సకాలంలో వర్షాలు పడి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.
నల్గొండ: సేవా దృక్పథం ఉన్న బిజేపి నాయకులు డా. నాగం వర్శిత్ రెడ్డి, నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించి ఉన్నారు.
పట్టణంలోని 39 వ వార్డు గాంధీనగర్ లో నివాసం ఉంటున్న కటకం సతీష్-రేణుక వివాహానికి, బిజెపి నాయకులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హాజరై పుస్తే మెట్టెలు నూతన వధూవరులకు కానుకగా అందచేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చండూరు: మండల కేంద్రంలో ఆర్డీవో కార్యాలయానికి, ఖాళీగా ఉన్న స్త్రీ శక్తి భవనాన్ని కేటాయించారు. ఆ భవనం అసంపూర్తిగా ఉండడంతో పున నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఈ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శనివారం సందర్శించి మాట్లాడుతూ.. ఆర్డిఓ కార్యాలయాన్ని అన్ని విధాల సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు , తాహసిల్దార్, ఇతర అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
Sep 13 2023, 13:05
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
20.1k