NLG: లెంకలపల్లి లో ఘనంగా చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి
చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమ కారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో పగిళ్ల యాదయ్య, పాక పాండు, పగిళ్ల రామకృష్ణ, పురుషోత్తం, రాజశేఖర్, హరి, అశోక్, కార్తీక్, జనార్ధన్, రాహుల్ కుమార్, దుర్గేష్, మేతరి శంకర్, దాసరి గణేష్ ముదిరాజ్, కాటగోని కృష్ణయ్య, మేతరి రమేష్, ఏర్పుల సురేష్, చాపల వినయ్, గుండెపురి శంకర్, శ్రీను, ప్రశాంత్, ఏ.రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.
![]()

చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమ కారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో పగిళ్ల యాదయ్య, పాక పాండు, పగిళ్ల రామకృష్ణ, పురుషోత్తం, రాజశేఖర్, హరి, అశోక్, కార్తీక్, జనార్ధన్, రాహుల్ కుమార్, దుర్గేష్, మేతరి శంకర్, దాసరి గణేష్ ముదిరాజ్, కాటగోని కృష్ణయ్య, మేతరి రమేష్, ఏర్పుల సురేష్, చాపల వినయ్, గుండెపురి శంకర్, శ్రీను, ప్రశాంత్, ఏ.రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామంలో ఈరోజు ముత్యాలమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, గ్రామ ప్రజలకు ముత్యాలమ్మ తల్లి బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. ఆ తల్లి దీవెనలతో సకాలంలో వర్షాలు పడి, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.
నల్గొండ: సేవా దృక్పథం ఉన్న బిజేపి నాయకులు డా. నాగం వర్శిత్ రెడ్డి, నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించి ఉన్నారు.
పట్టణంలోని 39 వ వార్డు గాంధీనగర్ లో నివాసం ఉంటున్న కటకం సతీష్-రేణుక వివాహానికి, బిజెపి నాయకులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి హాజరై పుస్తే మెట్టెలు నూతన వధూవరులకు కానుకగా అందచేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చండూరు: మండల కేంద్రంలో ఆర్డీవో కార్యాలయానికి, ఖాళీగా ఉన్న స్త్రీ శక్తి భవనాన్ని కేటాయించారు. ఆ భవనం అసంపూర్తిగా ఉండడంతో పున నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఈ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శనివారం సందర్శించి మాట్లాడుతూ.. ఆర్డిఓ కార్యాలయాన్ని అన్ని విధాల సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట చైర్పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, స్థానిక కౌన్సిలర్లు , తాహసిల్దార్, ఇతర అధికారులు, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
నల్లగొండ జిల్లా: చింతపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందు అంగన్వాడీల సమావేశం లో శనివారం, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఐసిడిఎస్ ప్రారంభించి 48 సంవత్సరాలు అవుతుంది. రానున్న రెండు సంవత్సరాలలో అర్థ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయటం లేదని అన్నారు.
నల్లగొండ: గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల జిల్లా క్రీడా శాఖ అధ్యక్షులు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కొడుమూరు వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో శనివారం, ఉగాది నుండి ఉగాది వరకు 2023-2024 నూతనంగా ముద్రించిన డైరీ ని వ్యాయామ ఉపాధ్యాయులకు అందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల రాష్ట్ర క్రీడల కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, సూర్యాపేట జిల్లా క్రీడల శాఖ అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, రాష్ట్ర, జిల్లా, ప్రతినిధులు, పాముల అశోక్, దగ్గుపాటి విమల, నారాయణ కవిత, కందుకూరి శైలజ, అంబటి రేణుక, దుగ్యాల శంకర్, కేతావత్ శ్రీనివాస్, మద్ది కర్ణాకర్, చెరుకు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
రెండు బీసీ గురుకుల 'లా' కాలేజీ లు:
ఒకటి హన్మకొండలో ఏర్పాటు చేయనుండగా, మరొకటి రంగారెడ్డి జిల్లా కందుకూరు లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం శుక్రవారం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నారు. ఈ కాలేజీల్లో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌ఎల్‌బీ 5 ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు
NEW: వాట్సాప్ మరొక సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. మీరు పంపిన వాట్సాప్ మెసేజ్ లు సవరించుకోవడానికి అవకాశం కల్పించింది. సందేశాన్ని టైప్ చేయడంలో చిన్న పొరపాటు జరిగిందా? పెద్ద గా చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మెసేజ్ లను పంపిన తర్వాత 15 నిమిషాల వరకు సులభంగా ఎడిట్ చేయవచ్చు, మీరు తప్పు ను రద్దు చేయాలన్నా లేదా ఎమోజీని మార్చాలనుకున్నా సులభంగా మార్చవచ్చు.
వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మెసేజ్ టైప్ చేసినప్పుడు పొరపాటు జరిగి సెండ్ చేశారా, ఐతే 15 నిమిషాల లోపు కుడివైపు పైన ఉన్న మూడు చుక్కల వద్ద క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్లి మీరు మార్చాలనుకున్న సందేశాన్ని మార్చి తిరిగి పంపవచ్చు.
Sep 10 2023, 15:13
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.0k