NLG:డిగ్రీ కళాశాల అధ్యాపకులకు బదిలీలు నిర్వహించాలని నిరసన
నల్గొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది బుధవారం భోజన విరామ సమయంలో బదిలీలు చేపట్టాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల అధ్యాపకులకు బదిలీలు నిర్వహించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు బదిలీ నిర్వహిస్తున్నారు, అదేవిధంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులకు కూడా వెంటనే బదిలీలు చేపట్టాలని, అదేవిధంగా పిఆర్సి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం నాయకులు నాగుల వేణు యాదవ్, డాక్టర్ సీతారాం రాథోడ్, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్స్ శీలం యాదగిరి, వివి సుబ్బారావు, వెల్దండ శ్రీధర్, శివరాణి, యాదగిరి రావు, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, మల్లేష్, వెంకట్ రెడ్డి భాస్కర్, మధు, భరణి, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది బుధవారం భోజన విరామ సమయంలో బదిలీలు చేపట్టాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల అధ్యాపకులకు బదిలీలు నిర్వహించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి బదిలీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు బదిలీ నిర్వహిస్తున్నారు, అదేవిధంగా డిగ్రీ కళాశాల అధ్యాపకులకు కూడా వెంటనే బదిలీలు చేపట్టాలని, అదేవిధంగా పిఆర్సి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకుల సంఘం నాయకులు నాగుల వేణు యాదవ్, డాక్టర్ సీతారాం రాథోడ్, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్స్ శీలం యాదగిరి, వివి సుబ్బారావు, వెల్దండ శ్రీధర్, శివరాణి, యాదగిరి రావు, ఫిజికల్ డైరెక్టర్ మల్లేష్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, మల్లేష్, వెంకట్ రెడ్డి భాస్కర్, మధు, భరణి, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి జిల్లా:
జూనియర్ కళాశాలను చౌటుప్పల్ పట్టణంలోని బెస్ట్ కళాశాల గా తీర్చిదిద్దడానికి కావలసిన వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసి, అధేవిధంగా CSR ఫండ్ కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చించి సెకండ్ ఫ్లోర్ నిర్మాణం ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు.
పేదవారికి ఉన్నత చదువును అందించాలని ఉద్దేశంతో ప్రైవేట్ కళాశాలకు ధీటుగా జూనియర్ కళాశాలను తీర్చిదిద్ది, విద్యార్థులకు ఉన్నత చదువు అందించడంలో ఫ్యాకల్టీ కొరత ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి సబ్జెక్టు కు లెక్చరర్స్ కొరత లేకుండా చర్యలు చేపట్టి, విద్యను అందించడం జరుగుతుందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో మరియు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో మాట్లాడి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేపించి, విద్యార్థులకు ఉన్నత చదువు అందించడంలో ముఖ్యపాత్ర వహిస్తానని తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించి వాళ్లకి షీల్డ్ బహుమతి అందజేశారు.
దేవరకొండ: అక్టోబర్ 15న హైదరాబాదులో జరిగే ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ 10 వ రాష్ట్ర మహాసభలు సన్నాహాక సమావేశం విజయవంతం చేయాలని AISSD జిల్లా కన్వీనర్ మద్దిమడుగు బిక్షపతి, దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ చిట్యాల గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందుకోసం రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఐబి ఆఫీస్ దగ్గర గల అంబేద్కర్ గ్రంథాలయంలో ఉదయం 10 గంటలకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల, గ్రామ కార్యవర్గం మరియు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.
నల్గొండ: ఇద్దరు యువతుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అన్నారు. పట్టణ కేంద్రంలో నజీర్ మాట్లాడుతూ.. నల్గొండ లోని మహిళ డిగ్రీ కళాశాలలో బి జెడ్ సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎనుగుదుల మనీషా, దంతబోయిన శివాని పట్టణంలోని రాంనగర్ రాజీవ్ పార్కులో నిన్న గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతూ.. ఈరోజు ఇద్దరు యువతులు మృతి చెందారని, సామాజిక మాధ్యమాల్లో వారి అశ్లీల ఫోటోలు పెట్టినట్లు తెలుస్తోంది అని, దీంతో మనస్థాపం చెంది ఈ దుర్ఘటన కి పాల్పడ్డారని, వీరి మృతికి కారణమైన వారిపై పూర్తి విచారణ చేసి కఠినంగా శిక్షించాలని తమ సంస్థ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ జావిద్ అలి, రియాజ్, అబ్దుల్ మాజిద్ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గం లోని 'చండూరు' పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 'రెవెన్యూ డివిజన్' గా ప్రకటించినందుకు.. భారాసా యువజన నాయకుడు భూతరాజు మురళీ ఆధ్వర్యంలో, బుధవారం చండూరు పట్టణంలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భూతరాజు మురళి మాట్లాడుతూ.. చండూరు ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ కోడి వెంకన్న, చండూరు పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ, యూత్ అధ్యక్షుడు వెంకన్న, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ: ఆశా వర్కర్స్ కు కనీస వేతనం రూ.18000/- ఇవ్వాలని, మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివిధ డిమాండ్ల పరిష్కరించాలని ఆశాలు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆశా వర్కర్స్ కు కనీస వేతనం రూ.18000/- నిర్ణయించి అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎం గా ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో, సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైనారు.
హైదరాబాదులో ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మరియు రాష్ట్ర హోం శాఖ మంత్రి అహ్మద్ అలీ ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు ప్రధానం చేశారు.
నల్లగొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు డాక్టర్ అంతటి శ్రీనివాసులు (రశాయన శాస్త్రం), డాక్టర్ ఎన్. దీపిక (తెలుగు) ఉత్తమ అధ్యాపకులు అవార్డ్ -2023 మంత్రుల చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మునీర్, ఇతర అధ్యాపకులు అవార్డులు పొందిన అధ్యాపకులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
నల్లగొండ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల నిడమనూరు నందు మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రిన్సిపల్ అరుణ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
అనంతరం ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితం పాఠశాల నుండే ప్రారంభమవుతుందని, పాఠశాలలో కష్టపడి చదువుకోవాలని ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కోరుకుంటారని, తమ విద్యార్థులు అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలలో ఉన్నప్పుడు మా విద్యార్ది అని గొప్పగా చెప్పుకుంటారు. ఉపాధ్యాయులకు అంతకుమించిన ఆస్తి మరేమి ఉండదని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అవరోదించాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థలో నల్లగొండ రీజియన్ నుండి ఇంగ్లీష్ సబ్జెక్టు నందు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికై శివరాణి ని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు.
నల్లగొండ: ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని, చండూరు గురుకుల పాఠశాల/ కళాశాలలో తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను శాలువల తో సత్కరించి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల సంఘం కమిటీ సభ్యులు గ్యార యాదగిరి జనరల్ సెక్రెటరీ, సుష్మ, నాగన్న, అద్దంకి కిరణ్, రాజు, శ్రీను, సత్తయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
Sep 06 2023, 16:27
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.9k