మర్రిగూడ: భూ నిర్వాసితుల నిరసన
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం : ఏడేళ్లు కావస్తున్నా నేటికీ పరిహారం అందలేదని చర్లగూడెం భూ నిర్వాసితులు సోమవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఇకనైనా స్పందించి తమకు నష్టపరిహారం ఇప్పించి తమను ఆదుకోవాలన్నారు.
మంగళవారం కూడా ధర్నా కొనసాగిస్తామని, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు తమ ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో వల్లభ కేశవ గౌడ్, నాగిల్ల మారయ్య, సంక బుడ్డి మల్లేష్, సంక బుడ్డి శ్రీను, సంక బుడ్డి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం : ఏడేళ్లు కావస్తున్నా నేటికీ పరిహారం అందలేదని చర్లగూడెం భూ నిర్వాసితులు సోమవారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఇకనైనా స్పందించి తమకు నష్టపరిహారం ఇప్పించి తమను ఆదుకోవాలన్నారు.
మంగళవారం కూడా ధర్నా కొనసాగిస్తామని, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు తమ ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో వల్లభ కేశవ గౌడ్, నాగిల్ల మారయ్య, సంక బుడ్డి మల్లేష్, సంక బుడ్డి శ్రీను, సంక బుడ్డి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల యందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను, ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55% మార్కులు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీ లో 50% మార్కులు ఉన్నవారు అర్హులు.
నెట్ / సెట్ / పిహెచ్డి మరియు బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 8న ఉదయం గం. 10: 30 లకు ఎన్జీ కళాశాలలో, ఇంటర్వ్యూకు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కాగలరని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సోమవారం శ్రీశ్రీశ్రీ మదివాళమంచిదేవుడు - సీతాళమ్మ - ఈదమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, తదితరులు ఉన్నారు.
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ను ఈ నెల 5న టిఎస్ఆర్టిసి నిర్వహించనుంది. రాష్ట్రంలోని 11 రీజియన్ కేంద్రాల్లో లక్కీ డ్రా ను నిర్వహించి.. ప్రతి రీజియన్ కు ముగ్గురి చొప్పున 33 మంది విజేతలను ఎంపిక చేయనుంది. ఈ లక్కీ డ్రా కు జిల్లా స్థాయి మహిళా అధికారులను ముఖ్య అతిథులు గా ఆహ్వానించడం జరుగుతుందని టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ తెలిపారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించి, గెలుపొందిన వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం రీజియన్ కు రూ.50 వేల చొప్పున 11 రీజియన్ లకు రూ.5.50 లక్షలను కేటాయించింది. ఒక్కో రీజియన్ లో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఇవ్వాలని సంస్థ తాజాగా నిర్ణయించింది.
రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆగస్టు ౩౦, 31 తేదిల్లో సంస్థ ప్రకటించిన లక్కీ డ్రా కు మహిళా ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్ ను రాసి వేశారు.
రేపు అనగా ఈనెల 4 వ తేదీ సోమవారం నాడు ఉదయం 6 గంటలకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నల్లగొండ జిల్లా,
హైదరాబాద్: రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసి, రాబోయే ఎన్నికల్లో సిర్పూర్ గడ్డపై నీలి జెండా ఎగరవేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ఆదివారం హైదరాబాద్ లో బీఎస్పీ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నూతనంగా పార్టీలో జాయిన్ అయిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు శక్తి వంచన లేకుండా అహర్నిశలు పార్టీ కోసం పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలను బీఎస్పీ పార్టీలో చేరే విధంగా కృషి చేయాలన్నారు.
బహుజన రాజ్య స్థాపన కోసం పేద ప్రజలు బీఎస్పీలో చేరి పాలకులుగా మారాలన్నారు. రాబోయే ఎన్నికలలో బీఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిఎస్పీ లో చేరిన వారిలో తన్నీరు పోషం, హబీబ్, యూసుఫ్ ఖాన్, ఇందిర, ఎండి మహబూబ్, శేఖర్, విజయ్, సాబేర్, రమేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, ముస్తఫీజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా, పెద్దవూర మండల కేంద్రంలో బిఎస్పి ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాల వద్ద, శనివారం బహుజన చైతన్య సైకిల్ యాత్ర వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.
బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు, పెద్దవూర మండల అధ్యక్షుడు కుక్కముడి ముత్యాలు, పెద్దవూర మండల ప్రధానకార్యదర్శి ఆదిమల్ల సత్యనారాయణ, మంద ఏలియా, సంగారం గ్రామ శాఖ అధ్యక్షుడు తరి రవికుమార్, తరి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Sep 04 2023, 23:23
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
19.2k