NLG: కలెక్టర్ కు రాఖీ కట్టిన సెకండ్ ఏఎన్ఎం లు
నల్లగొండ: గత 15 రోజులుగా 2వ ఏఎన్ఎం లు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు కోరారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో రెండవ ఏఎన్ఎంల నిరవధిక సమ్మె కలక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్న సందర్భంగా బుధవారం ఉజ్జీని యాదగిరి రావు దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. తెలంగాణా వస్తె కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పిన ప్రభుత్వం 16 సంవత్సరాలుగా పని చేస్తున్న వారినీ పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లను అందరిని బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఏఎన్ఎం లు ముందుగా జిల్లా కలెక్టర్ కర్ణన్ కు రాఖీ కట్టి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని వినతి పత్రం అందజేశారు.
కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి వి.లెనిన్, 2వ ఏ ఎన్ ఎం ల యూనియన్ జిల్లా అద్యక్షులు పోలే రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, పద్మ, హారతి, గీత, సరిత, అన్నపూర్ణ, శోభ, అండాలు, సౌజన్య, పద్మ, సలోని, సుచిత్ర , మాధురి, భవానీ, విద్య, నాగశ్రీ, సంతోష, భాగ్య, శైలజ, కవిత, అండాలు, సరళ, సువర్ణ, సత్యమ్మ, పార్వతి, సుమతి, పద్మావతి, శోభ, రుక్సానా, సుప్రియ సాలమ్మ, నీలవేణి, శారద, విజయలక్ష్మి, జ్యోతి, లలిత, శ్రీలత, నూర్జహాన్, ధనలక్ష్మి, అరుణ, ప్రేమలత, సుమలత, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

దేవరకొండ: బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జి ఎర్ర కృష్ణ, అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్ రమేష్ నాయక్ లను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నలగొండ జిల్లా కేంద్రంలోని, గడియారం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "నలగొండ అసెంబ్లీ స్థానం బీసీలకు కేటాయిస్తాను, నేను త్యాగం చేస్తాను" అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నందుకు.. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు వర్షం వ్యక్తం చేస్తూ, బుధవారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నామని తెలిపారు.
నల్లగొండ నియోజకవర్గం, కనగల్ మండలం కురంపల్లి గ్రామంలో పల్లెనిద్ర లో బాగంగా బిజెపి నాయకులు డా. నాగం వర్శిత్ రెడ్డి మంగళ వారం రాత్రి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార దాహంతో ఉచిత పథకాలు దళిత బందు,బిసి బందు, అమలు కానీ హామీలు చేస్తూ నమ్మబలికి నామమాత్రంగా వారి కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపిస్తూ, ఆ వైఖరిని ఖండించారు.ఏంచేసిందయ్యా 9 ఎండ్ల లో బిఆర్ఎస్ పార్టీ అంటే.. ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రజలపై అనేక పన్నుల భారాన్ని మోపింది అని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలను అణచివేయాలని కోరారు.
మునుగోడు: తెలంగాణ రాష్ట్రంలో గత 18 సంవత్సరాలు నుండి గ్రామ ఆరోగ్య కార్యకర్తలుగా అనేక వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు 18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.

నల్లగొండ: గత 14 రోజులుగా 2వ ఏఎన్ఎం లు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం కటిన వైఖరి మంచిది కాదని, సమస్యను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు.
నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్న జిల్లా వ్యాప్తంగా ఉన్న 2వ ఏఎన్ఎంల నిరవధిక సమ్మెలో మంగళవారం మాట్లాడారు. గత 16 నుండి 20.ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా విధులు నిర్వహిస్తున్నారు. వారిని పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నల్గొండ జిల్లా: దళిత బంధు లబ్దిదారులు గొప్ప పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని షెడ్యూల్డ్ కులాల అధికారి శ్రీనివాసు అన్నారు. పరిశ్రమల శాఖ జనరల్ మనేజర్ కోటేశ్వర్ మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించే విధంగా వ్యాపారాలు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయాలని, సంస్థ నుంచి తప్పకుండా సహాయం అందిస్తామని తెలిపారు.
నల్లగొండ పట్టణంలోని టీఎన్జీవో భవన్ లో మంగళవారం దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ DICCI జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ గోళ్ళబోయిన అంబేద్కర్ ఆధ్వర్యంలో టీ ఇగ్నైట్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సి,ఎస్టీ యువతకు నిర్వహించిన అవగాహన సదస్సులో డిఆర్ డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ కాలిందిని, ఐడిఎం శ్రామిక, నాబార్డ్ మేనేజర్ వినయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో 521 మందికి పైగా దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందిన వారున్నారన్నారు. డైరీ, సెంట్రిన్గ్, పోటో స్టూడియో, కిరాణం, లైటింగ్ తదితర యూనిట్ల లబ్దిదారులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా డిక్కీ మార్గదర్శనం చేయాలని అన్నారు.
డిక్కీ రాష్ట్ర అధ్యక్షురాలు దాసరి అరుణ మాట్లాడుతూ.. ఎంపిక చేయబదిన ఎస్సి,ఎస్టీ యువతకు సెప్టెంబర్ రెండవ వారంలో హైదరాబాద్ లో 21 రోజుల పాటు మరో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమములో ఎన్జీఓ నాయకులు శ్రవణ్, డిక్కీ ప్రతినిధులు దాసరి నారాయణ, రాజేష్, అరుణ్, మరియు కేవిపిఎస్ జిల్లా నాయకులు పాలడుగు నాగార్జున, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే ఔత్సాహిక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ: జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా నేడు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (అటానమస్) యందు కళాశాల కు చెందిన క్రీడాకారులకు సన్మానం నిర్వహించారు. గత సంవత్సరం వివిధ క్రీడా అంశాలలో ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక కాబడ్డారు. అలాంటి విద్యార్థులను ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రాజా రామ్ మాట్లాడుతూ.. కళాశాలలో విద్యార్థినులకు అన్ని రకాలైన క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, విద్యార్థినిల్లో తమకు సంబంధించిన క్రీడా రంగాలలో నైపుణ్యం వెలికి తీసి తద్వారా మహాత్మా గాంధీ యూనివర్సిటీ తరఫున ఇంటర్ యూనివర్సిటీ పోటీలలో ఎంపిక కాబడేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకున్నామని, అలాగే విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలు కళాశాలలో ఉన్నాయని ప్రత్యేకంగా జిమ్ మరియు కబడ్డీ, క్యారమ్స్, చెస్, కోకో, వాలీబాల్, బాస్కెట్బాల్ లాంటి అంశాలలో మరియు స్పోర్ట్స్ కు సంబంధించిన అన్ని అంశాలలో తగిన సదుపాయాలు ఉన్నాయని వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.
Aug 30 2023, 21:28
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
15.9k