/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల పట్ల ఆసక్తిగా ఉండాలి: ప్రిన్సిపల్ అరుణ Mane Praveen
విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల పట్ల ఆసక్తిగా ఉండాలి: ప్రిన్సిపల్ అరుణ
నల్లగొండ: నిడమనూరు ఎస్సీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల పట్ల ఆసక్తిగా ఉండాలని, పాఠశాలలో విద్యతో పాటు ఆటల పాటలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని  అన్నారు. రాష్ట్ర మరియు దేశస్థాయిలో విద్యార్థులు ఉన్నత ప్రతిభ కనపరుస్తున్నారని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
BT రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మరియు జిల్లా పరిషత్ చైర్మన్
చౌటుప్పల్ మండలంలో సుమారు 72 లక్షల విలువగల పెద్దకొండూర్ నుండి పర్రెబాగు వరకు గల BT రోడ్డు పనులకు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మరియు యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
NLG: మెడికల్ కాలేజీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్గొండ: మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్ కార్మికుల నాలుగు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు AITUC ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కర్ణన్ కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజిలో పనిచేసే కార్మికులకు నాలుగు నెలల అవుతున్నా, నేటికీ వేతనాలు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులకు నెల నెల వేతనాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారని అన్నారు. జీతాలు రాక ఇంటి కిరాయి, ఆటో కిరాయిలు భరించలేకపోతున్నారని అన్నారు.

వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలి మరియు జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని దేవేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు జామీర్, అండాలు, చెంద్రమ్మ, స్వర్ణ, జానయ్య, విజయ, రేణుక, కవిత, చంద్రమ్మ, లింగయ్య, కోటేశ్వరి, సీత, లక్ష్మి, శిల్ప, స్వర్ణలత, కనకమహాలక్ష్మి, కరుణ శ్రీ, కోటేశ్వరి, శిల్ప, కృష్ణవేణి, కరుణ, ఇద్దమ్మ, మంగమ్మ, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
రెండవ ఏఎన్ఎం నిరసనలో భాగంగా నల్లగొండలో రాస్తారోకో
రెండోవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని కోరుతూ గత 12 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న  సమ్మెలో భాగంగా, నల్లగొండ పట్టణంలో ఈరోజు మధ్యాహ్నం,  డీఎంహెచ్ఓ కార్యలయం నుండి ర్యాలీగా వెళ్లి డిఈఓ కార్యాలయం వద్ద ప్రధాన రహదారి పైన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం అందజేయాలని, రెండో ఏఎన్ఎం లను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు ఏఎన్ఎం లు పాల్గొన్నారు
పదవ తరగతిలో 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పదివేలు
చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని లింగోజిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పదవ తరగతిలో 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు.. ఒక్కొక్కరికి 10,000 రూపాయలను బహుమతిగా స్థానిక కౌన్సిలర్ బండమీది మల్లేష్ సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండమీది మల్లేష్, ఆలె నాగరాజు, స్కూల్ వైస్ చైర్మన్ సుదర్శన్, ప్రధానోపాధ్యాయులు బొమ్మిరెడ్డి మాధవ రెడ్డి, కటిక వెంకటేష్, జంపాల యాదగిరి మరియు ఉపాధ్యాయులు, స్కూలు సిబ్బంది పాల్గొన్నారు
యువత స్వయం కృషితో ఎదగాలి: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి
NLG: యువత స్వయం కృషితో ఎదగాలని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో స్వాగత్ హెయిర్ సెలూన్ షాప్ ప్రారంభించి మాట్లాడారు.
అనంతరం చైర్మన్ సైదిరెడ్డి కి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ సమీ, BRS పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు, 27 వ వార్డు కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్, కంజెర శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపూడ్ మండలంలో కొనసాగుతున్న బహుజన జై సైకిల్ యాత్ర
నల్లగొండ జిల్లా, గుర్రంపూడ్ మండలంలోని, చమలోనిగూడెం, ఆరేగూడెం, వెంకటాపురం, వట్టికోడ్, మరియు పిత్తలగుడెం గ్రామాలలో కొనసాగుతున్న 4వ రోజు బహుజన జై సైకిల్ యాత్రలో భాగంగా, అక్టోబర్ 1న జరగనున్న సభను విజయవంతం చేయాలని నియోజకవర్గం బీఎస్పీ ఇన్చార్జి ఆదిమల్ల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఇన్చార్జి పాంబల అనీల్, ఉపాధ్యక్షులు, భీం ప్రసాద్, మైనారిటీ కన్వీనర్ చాంద్ పాషా, జనరల్ సెక్రెటరీ కత్తుల కాన్సిరాం, నియోజకవర్గ ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ ముదిగొండ వెంకటేశ్వర్లు, మహిళా కన్వీనర్ బైరాగి విజయ్, మండల అధ్యక్షులు కొమ్ము రమేష్ , పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామస్థాయి నుండి ఢిల్లీ వరకు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి: రైతు సంఘం
నల్లగొండ, మర్రిగూడ: మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో,  మోడీ కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుండి ఢిల్లీ వరకు ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని, ఆదివారం సమావేశం నీలకంఠం రాములు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను రైతు నల్ల చట్టాలను కార్మిక చట్టాలను నాలుగు కోడ్లను విధించిన విధానాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ, వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ధరణిలో జరిగిన భూ సమస్యలను సరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుబంధు రైతు బీమా వాటిని పాస్ బుక్ కలిగిన ప్రతి రైతుకి ఈ పథకాలు వర్తింపజేయాలి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మండలానికి మంత్రి గ్రామానికి ఎమ్మెల్యే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను సిసి రోడ్లు, మురికి కాలువలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మొదలగు సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యే వరకు వాగ్దానం చేశారని,ఉప ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, కాగు వెంకటయ్య, చలం నరసింహ, సొప్పరి హనుమంతు, పెరుమాండ్ల మంజుల, పోలేపల్లి రాములు, నక్క నరసింహ, కంచుకట్ల రాములు, పోలే అంజమ్మ, మాడుగుల పద్మ, జిల్లా అమృత, కలకొండ సుజాత, చెల్లం పెద్ద లక్ష్మమ్మ, చిన్న లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల: ఆసనాలు వేసి నేర్పించిన పల్లపుబుద్దుడు
నల్గొండ జిల్లా, చిట్యాల మున్సిపాలిటీలో  ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంగ్ సుదర్శన క్రియ కార్యక్రమం, ఆదివారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  సాధనలు, ఆసనాలు వేసి నేర్పించడం జరిగింది. వామప్, సూర్య నమస్కారాలు, పద్మాసనాలు, ప్రాణయామ మరియు సుదర్శన క్రియ కార్యక్రమాలు పల్లపు బుద్దుడు వేసి నేర్పించడం జరిగింది. ఈ క్రియల ద్వారా మనలోని శ్వాస ప్రక్రియ ఎంతో ఉత్సాహంగా ప్రశాంతంగా తీసుకోవడానికి వీలు కల్పిస్తూ ఈ యొక్క లాంగ్ సుదర్శన క్రియ ఏర్పాటు చేయబడిందని తెలియజేశారు. ఈ సుదర్శన క్రియ ద్వారా ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందగలిగారని, ప్రతి మనిషి మొదట తన శరీరాన్ని ప్రేమించాలని, తద్వారా శరీరం మనసు సర్వీసింగ్ చేయడానికి ఏకైక సాధన సుదర్శన క్రియ ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఉండాలంటే సుదర్శన క్రియ తప్పనిసరిగా చేయాలన్నారు. నిత్యజీవితంలో సాధన, సేవ, సత్సంగ్ కార్యక్రమాలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లోజు శ్రీకాంత్, ఖమ్మం పాటి సతీష్, పాకాల సత్యనారాయణ, రూపాని రాజ్ కుమార్ పాల్గొన్నారు
నిడమనూరు బాలికల గురుకుల పాఠశాలలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు, విద్యార్థులు
నల్గొండ: కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా నిడమనూరు ఎస్సీ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ అరుణ ఆధ్వర్యంలో,  ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా ఎవరు నాటిన మొక్కను వాళ్లు, ఎదిగేలా చూడాలని ప్రిన్సిపాల్ కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు