/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz నేడు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటనున్న ఎమ్మేల్యే Mane Praveen
నేడు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మొక్కలు నాటనున్న ఎమ్మేల్యే
నేడు ఉదయం 10 గంటలకు  వజ్రోత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా,  1 కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,  నేడు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని జైభూమి వెంచర్లో మొక్కలు నాటనున్నారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు,  నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మేల్యే కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు.
రెండవ ఏఎన్ఎం ల ధర్నా లో భాగంగా.. టెంట్ కింద వరలక్ష్మి వ్రతం

నల్లగొండ: మహిళలకు ప్రీతి పాత్రమైన వరలక్ష్మి వ్రతం కూడా రోడ్ మీద ఆందోళనతో 2వ ఏఎన్ఎం లు పూజలు చేసుకోవాల్సిన పరిస్తితి రావటం విచారకరమని ఏఐటియూసి ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న రెండోవ ఏఎన్ఎం ల నిరవధిక సమ్మె పదవ రోజు శుక్రవారం శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ కింద నే వరలక్ష్మి వ్రతం చేశారు. 

ఈ సందర్బంగా దేవేందర్ రెడ్డి మాట్లాడతూ.. గత16 నుండి 20 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్న ఏఎన్ఎం లు తమని పర్మినెంట్ చేయాలని పండుగ రోజు కూడా ఇంటి వద్ద ఉండకుండా ఆందోళన చేస్తున్నారని అన్నారు.  

రాష్ట్రము లోని 5 వేలకు పైగా ఉన్న మహిళ లు పది రోజులుగా ఆందోళన చేస్తున్నా, పట్టించుకోక పోవటం విచారకరమని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా.. రెగ్యులర్ ఏఎన్ఎం, మొదటి ఏఎన్ఎం మరియు 2వ ఏఎన్ఎం లు ఒకే రకమైన పని చేసినప్పుడు వేతనాలలో తేడాలు ఎందుకు ఇస్తున్నారని దేవేందర్ రెడ్డి విమర్శించారు. 

తెలంగాణా వస్తె కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పిన ప్రభుత్వం 16 సంవత్సరాలుగా పని చేస్తున్న వారినీ పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లందరిని బే షరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి ప్రజలకు సేవలందించారన్నారు. నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలన్నారు. ఏఎన్ఎం ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. ఆరోగ్య వంతమైన సమాజాన్ని తయారు చేస్తున్న ఏఎన్ఎంలను పట్టించుకోక పోవటం అన్యాయం అన్నారు. ప్రభుత్వం టాబ్ లు ఇచ్చిన నెట్ బాలెన్స ఇవ్వటం లేదు అన్నారు. ఆరు నుండి పది వేల మంది జనాభాకు ఒక్కఏఎన్ఎం పనిచేస్తుందని, ఎక్కడికి వెళ్ళినా టిఎ, డిఎ లు ఇవ్వటం లేదని ఆరోపించారు. 

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, రెండవ ఏఎన్ఎంల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, విజయలక్ష్మి, ప్రమీల, అలివేలు, హైమవతి, ధనలక్ష్మి, గీతా రాణి, అనిత, మంజుల, సునిత, వెంకటమ్మ, కళావతి, కాంతమ్మ, సుశీల, సత్యమ్మ, జయంతి, వినోద, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి వి, లెనిన్, తదితరులు పాల్గొన్నారు.

NLG: చర్లపల్లి లో విస్తృతంగా పర్యటన చేసిన బిజెపి నాయకులు నాగం వర్షిత్ రెడ్డి

నల్గొండ: మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు చర్లపల్లి లో బిజేపి నాయకులు డా.నాగం వర్షిత్ రెడ్డి గురువారం విస్తృతంగా పర్యటన చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా బిజేపి సీనియర్ నాయకులను, ముఖ్య కార్యకర్తలు, వార్డులలో పనిచేసే మున్సిపల్ సిబ్బందిని మరియు పలువురు ముఖ్యులను కలిసి రాబోయే ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కోరారు. వారికి ఎలాంటి సహాయం కావాలన్న ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

కటకం శ్రీధర్, బద్దం నగేష్, రాపోలు భాస్కర్, శ్రీరాముల రాజు, లింగంపల్లి వీరేష్, రాపోలు రమేష్, లింగంపల్లి గణేష్, జేల్ల నాగేష్, దాసరి శాంతి సాగర్, రామకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మేల్యే కూసుకుంట్ల

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం, చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రచార రధాన్ని ప్రారంభించారు. అనంతరం మునుగోడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి భారీగా బిఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చి ర్యాలీని విజయవంతం చేశారు.

అనంతరం మునుగోడు లోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని, పెంచిన పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలను వికలాంగులకు అందచేశారు.

కార్యక్రమం లో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

NLG: టెక్ మహీంద్రా, జెన్ ప్యాక్ సంస్థలకు ఎంపికైన ఎన్జీ కళాశాల విద్యార్థులు


నల్లగొండ: జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో "మ్యాజిక్ బస్" ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా యందు నలుగురు విద్యార్థులు 'జన్ ప్యాక్' సంస్థకు ఎంపికయ్యారు.
అదేవిధంగా 17 మంది విద్యార్థులు 'టెక్ మహీంద్రా' సంస్థకు ఎంపిక అయినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. శ్రీనివాసులు, మరియు టి.ఎస్.కే.సి సమన్వయకర్త  కె.నాగిరెడ్డి తెలిపారు.


ఈ  జాబ్ మేళాలో మొత్తం 123 మంది విద్యార్థులు పాల్గొనగా, ఇందులో 21 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన  విద్యార్థులను కళాశాల అధ్యాపకులు ఏ .దుర్గాప్రసాద్, ఎం.వెంకటరెడ్డి తదితరులు అభినందించారు.
NLG: తొమ్మిదవ రోజుకు చేరిన 2వ ఏఎన్ఎం ల సమ్మె
నల్గొండ: గత తొమ్మిది రోజులుగా 2వ ఏఎన్ఎం లు చేస్తున్న సమ్మె ను ప్రభుత్వం వెంటనే  విరమింపచేసేందుకు వారి సమస్యను పరిష్కరించాలని ఏఐటియూసి జిల్లా  ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న రెండోవ ఏఎన్ఎం ల నిరవధిక సమ్మె గురువారం తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా నిరసనలో భాగంగా నోటిఫికేషన్ కాపీలను దగ్దం చేయటం జరిగింది. దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 16 నుండి 20 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎం లు నిర్విరామంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్నారని అన్నారు.  కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, నాగమణి, వసంత, సులోచన, హరిత, సుశీల తదితరులు పాల్గొన్నారు.
NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎన్ సి సి కాడేట్ ల ఎంపిక
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఎన్ సి సి  కాడేట్ ల ఎంపిక నల్గొండ: పట్టణంలోని ఎన్జీ కళాశాలలో బుధవారం 2023-24 విద్యా సంవత్సరానికి గాను నూతనంగా ఎన్ సి సి  కాడెట్ల ఎంపిక జరిగింది. ఈ ఎంపిక పోటీలలో 250 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో పురుషులు 43, స్త్రీలు 21 మందిని ఎంపిక జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఘన్ శ్యామ్ తెలిపారు. ఎన్ సి సి ఆఫీసర్లు కల్నల్  టిఎం లక్ష్మారెడ్డి, సుభేదార్ మేజర్ మాధవ్ రావు, నాయిబ్ సుభేదార్ జగన్నాధం, బిహెచ్ఎమ్ నాగఫణి, హవల్దర్ డి.చంద్రయ్య నాయుడు, హవల్దర్ వికాస్ కుమార్, కళాశాల ఎన్ సి సి ఇంచార్జి వి.వెంకటేశం, ఫీజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలని ఆశాల ధర్నా
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో,  ఆశాలు తమ యొక్క ఫిక్స్డ్ శాలరీ ని ప్రభుత్వం పెంచాలని ధర్నా చేపట్టారు. జిల్లా ఆశా వర్కర్ సిఐటియు అనుబంధ యూనియన్ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి మాట్లాడుతూ..  ఆశా వర్కర్లుగా గత 18 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు కేవలం రూ .9750/- మాత్రమే ఇస్తున్నారని, తమపై పని భారం పెరిగిందని తెలిపారు. ఇట్టి జీతం టార్గెట్ కు అనుగుణంగా బిల్లు చేస్తున్నారని టార్గెట్ కానటువంటి వారికి తక్కువ వేతనం వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా తమ యొక్క వేతనం పెంచాలని, కనీస వేతనం 24 వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనంగా నిర్ణయించాలని, టార్గెట్లకు సంబంధం లేకుండా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు పాల్గొన్నారు.  ఆశాలు ధనమ్మ, షహీన్, గోవిందమ్మ, అనుష, తదితరులు ఉన్నారు.
NLG: బతుకమ్మ ఆడి నిరసన తెలిపిన రెండవ ఏఎన్ఎంలు
నల్లగొండ: గత ఎనిమిది రోజులుగా  2వ ఏఎన్ఎం లు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఏఎన్ఎం ల గురుంచి పట్టించుకోకపోవడం  అన్యాయమని ఏఐటీయూసీ జిల్లా  ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఆరోపించారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న రెండోవ ఏఎన్ఎంల నిరవధిక సమ్మెలో భాగంగా ఎనిమిదివ రోజు బతుకమ్మలాడి తమ బాధలను పాటల రూపంలో ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 16 నుండి 20 ఏళ్లుగా  రెండవ ఏఎన్ఎంలు నిర్విరామమంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు చేయడం కోసం పనిచేస్తున్నారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా.. రెగ్యులర్ ఏఎన్ఎం, మొదటి ఏఎన్ఎం మరియు 2వ ఏఎన్ఎం ఒకే రకమైన  పని చేసినప్పుడు వేతనాలలో తేడాలు ఎందుకు ఇస్తున్నారని దేవేందర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణా వస్తె కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పిన ప్రభుత్వం 16 సంవత్సరాలుగా పని చేస్తున్న  వారినీ పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న ఏఎన్ఎం లను అందరిని బేషరతుగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వంటి కష్టకాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని, తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారని తెలిపారు. నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలన్నారు. ఏఎన్ఎం ల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి సరికాదన్నారు. ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం దిగిరాక తప్పదని అన్నారు.

ఏఐటియుసి జిల్లా కోశాధికారి దొనకొండ వెంకటేశ్వర్లు, రెండవ ఏఎన్ఎం ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రత్నకుమారి, జిల్లా కార్యదర్శి నర్సమ్మ, నాగమణి, వసంత, సుశీల, గీతరాణి, అరుణ, మాధురి, భూదేవి, అండాలు, సరళ, శకుంతల, ఇందిరా, సుచిత్ర, రేణుక, సరిత, గాయత్రి, సత్యమ్మ, పార్వతి, సాలమ్మ, గీత, నీలవేణి, జ్యోతి, శారద, పుష్ప, విజయలక్ష్మి, రజిత, రెహాన, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
NLG: 24న ఎన్జీ కళాశాలలో జాబ్ మేళా
నల్గొండ: Magic Bus ఆధ్వర్యంలో ఈనెల 24న  జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యామ్ మరియు టిఎస్కేసి సమన్వయకర్త కె నాగిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగ మేళా నందు Tech Mahindra, SYKES, Genpact  లాంటి  ప్రముఖ సంస్థలు పాల్గొంటారని తెలిపారు. ఈ ఉద్యోగ మేళా కొరకు 2019 నుండి 2023 వరకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ మెమూల తో పాటు ఆధార్ కార్డు, 2 ఫోటోలు 5 రెజ్యూమ్ లు తీసుకుని కళాశాలలో అల్లుమిని హాల్ కి రాగలరని తెలిపారు. వివరాలకు ఫోన్ నెంబర్లు 9949055604, 9553141962, 9912803677 లను సంప్రదించాలని కోరారు. Share it