/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నీలగిరిని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి Miryala Kiran Kumar
నీలగిరిని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నీలగిరిని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం    

     *మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి ...

నీలగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నందనవనంగా మార్చడమే లక్ష్యమని మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి అన్నారు.

ఆదివారం పట్టణంలోని ఐదవ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సహకారంతో పట్టణములో సిసి రోడ్లు, మురుగు కాలువలు వరద కాలువలు అంతర్గత రహదారులు, పార్కుల అభివృద్ధి కళాభారతి వంటి వి సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నల్లగొండ పట్టణం ఎంతో వెనుకబడి ఉందన్నారు.. కానీ నేడు రాష్ట్ర ఎవరు ఊహించని విధంగా కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో మూడు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పున్న గణేష్, వట్టిపల్లి శ్రీనివాస్ గార్లు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..

ప్రజా యుద్ధనౌక గద్దర్‌..ఇకలేరు

ప్రజా యుద్ధనౌక గద్దర్‌..ఇకలేరు 

ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్‌ ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్‌(74) అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ 1949లో మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు.

తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసి ఆలపించిన అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1997 ఏప్రిల్‌ 6న నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై అనే సినీమా పాటకు నంది అవార్డు వచ్చింది. అయినప్పటికి తుది వరకు ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడారు. గద్దర్‌కు భార్య విమల, కొడుకు, కూతురు ఉన్నారు.

నల్గొండలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ఘనంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఎమ్మెల్యే కంచర్ల ... 

 

ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ పార్క్ సమీపంలో గల జయశంకర్ సార్ విగ్రహానికి BRS ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి జయశంకర్ సార్ పేరు మీద జిల్లా మరియు వ్యవసాయ యూనివర్సిటీకి పేరు పెట్టి గొప్పగా కీర్తించుకోవడం జరిగింది. జయశంకర్ సార్ తన జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ కోసం అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, BRS పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, BRSV నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

మూడవ వార్డులోని పనులు తక్షణమే పూర్తి చేయాలి: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

మూడవ వార్డులోని పనులు తక్షణమే పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కార్మికులను ఆదేశించారు...

పట్టణంలోని మూడవ వార్డులో గల ఎస్బిఐ హమాలి వర్కర్స్ కాలనీ లోని ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, వీధిలైట్లను వెంటనే ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి సంబంధిత సిబ్బందికి సూచించారు.

శనివారం పట్టణంలోని మూడో వార్డులో గల ఎస్బిఐ అమాలి వర్కర్స్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ స్థలంలో క్రీడా ప్రాంగణం, పట్టణ పకృతి వనం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సానిటేషన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కాలనీ మొత్తాన్ని శుభ్రం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, మున్సిపల్ అధికారులు, దండం పెల్లి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండను హరిత నీలగిరిగా మార్చుకుందాం: మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

హరిత నీలగిరిగా మార్చుకుందాం : చైర్మన్ మందడి

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు హరితహారం కార్యక్రమం లో భాగంగా శనివారం 17వ వార్డు ఆర్జాల బావి కాలనీ వాసులకు ఆయన మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రెండు ముక్కలు నాటి వాటిని సంరక్షించుకోనీ హరిత నీలగిరిగా మార్చుకుందామని అన్నారు. హరిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని దానికోసం ఎన్నో నిధులు కేటాయిస్తుందని అన్నారు . రాబోవు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మొక్కలు నాటడమే శరణ్యం అన్నారు . ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ మహేందర్, ఆర్పీ విజయలక్ష్మి, అన్వర్, హనుమంతు, నందు, నాగరాజు, నరేష్, గోపి, కాశయ్య, మహేష్ గార్లు మరియు _బిఆర్ఎస్, ఉమర్, మస్తాన్ గార్లు కార్యకర్తలు పాల్గొన్నారు..

-------------------------------------

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరం.

తల్లిపాలు తల్లిపాలే బిడ్డకు అత్యంత శ్రేయస్కరమని ఆరోగ్యకరమని మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఆయన 17 వ వార్డు ఆర్జాలబావి అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల విశిష్టతపై పలువురు వివరించారు. చిన్నారులు పౌష్టికారంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పౌష్టికరమైన ఆహారం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వాటిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.

Q ఈ కార్యక్రమంలో BLO ఖుర్షిద్ బేగం, సుగుణ, RP విజయలక్ష్మి, సిస్టర్ పూలమ్మ, ఆశ వర్కర్ సరిత గార్లు మరియు గర్భిణులు, మహిళలు పాల్గొన్నారు..

ఆగస్టు 6న జరిగే బిసి సింహ గర్జన సభను విజయవంతం చేయండి: బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ

ఆగస్టు ఆరవ తేదీ ఆదివారం రోజున నల్లగొండ పట్టణం చిన్న వెంక రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10:30 గంటలకు నిర్వహించబడే బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్ గారు హాజరై మాట్లాడుతూ

 

ఈ సభకు ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు హాజరుకానున్నారని

 

కావున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల నుంచి బీసీ బంధుమిత్రులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయాలని 

75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కలేదని

 ఓట్లు మనవి సీట్లు వారివి ఇకనుంచి ఓట్లు మనవి సీట్లు మనవి అనే నినాదంతో మనందరం పనిచేయాలని 

నీలా వెంకటేష్ గారు విజ్ఞప్తి చేశారు .

జనగణలో కులగలను చేపట్టాలని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని

 బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని

 ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్ కల్పించాలని

 నీల వెంకటేష్ గారు డిమాండ్ చేశారు 

.

ఈ కార్యక్రమంలో లోకనబోయిన వెంకట ముదిరాజు గారు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నాస్ ప్రసన్నకుమార్ జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి, ప్రధాన కార్యదర్శిM A ఖదీర్ ,భరత్, పట్టణ అధ్యక్షులు సదాశివ ,యువజన సంఘం కార్యదర్శి మల్లబోయిన సతీష్ యాదవ్, కల్లూరి సత్యనారాయణ ,వల కీర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

దేశంలోనే తొలిసారిగా వీల్ చైర్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఎస్బిఐ జనరల్

ఇలా దేశంలో ఖరీదైన వీల్ చైర్లకు బీమా చేయడం ఇదే తొలిసారి. దీని వల్ల రానున్న రోజుల్లో వికలాంగులకు ఎంతో మేలు జరగనుంది. అనేక సంవత్సరాల కృషి, సాధారణ బీమా కంపెనీలతో నిరంతరం అనుసరించిన ఫలితంగా అర్మాన్ అలీ తన ఖరీదైన వీల్ చైర్‌కు బీమా చేయడంలో విజయం సాధించాడు. భారతదేశంలో వీల్‌చైర్‌లకు బీమా చేయడం ఇదే తొలిసారి.

మొదటిసారిగా వీల్ చైర్ బీమా

ప్రపంచవ్యాప్తంగా తిరిగే అర్మాన్ అలీ తన జర్మన్ వీల్ చైర్ భద్రత గురించి భయపడేవాడు. ఎందుకంటే అతను వికలాంగుల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా సమావేశాలు, సెమినార్లలో పాల్గొనడానికి ప్రయాణిస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు తన ఖరీదైన వీల్‌చైర్‌కు బీమా చేయించుకోవడంలో ఎట్టకేలకు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. దీని కోసం అతను 21 జూలై 2023న తన వీల్ చైర్ కోసం ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ పాలసీని జారీ చేసిన SBI జనరల్ ఇన్సూరెన్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. జూలై 20, 2024న ఈ బీమా గడువు ముగుస్తుంది. అర్మాన్ అలీ వీల్ చైర్ రూ. 426,245కి SBI జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా బీమా చేయబడింది. ABP లైఫ్ బీమా పాలసీ కాపీ కూడా ఉంది.

SBI జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా బీమా చేయబడింది

అర్మాన్ అలీ గత రెండు సంవత్సరాలుగా వీల్ చైర్లు, ఇతర పరికరాలకు బీమా కవరేజీని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం 22 బీమా కంపెనీలకు లేఖ కూడా రాశారు. దీనిపై 9 కంపెనీలు స్పందించినా చివరకు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ బీమా చేసేందుకు అంగీకరించింది. అర్మాన్ అలీ నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP)లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇది వికలాంగుల కోసం పని చేస్తోంది.

వీల్ చైర్లు చాలా ఖరీదైనవి

వికలాంగులకు అవసరమైన ఈ ఉత్పత్తులు చాలా ఖరీదైనవి. అలాగే ఈ విషయాలపై బీమా కవరేజీకి ఎటువంటి నిబంధన లేదు. దీంతో ఈ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వీల్‌చైర్లు చాలా ఖరీదైనవి. బీమా కవరేజీని పొందడం వలన మరమ్మతుల ఖర్చును కొనుగోలు చేయడం, భరించడం సులభతరం అవుతుందని అర్మాన్ అలీ అభిప్రాయపడ్డారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ జిల్లా లో ఎస్సీ రిజర్వేషన్ సాధనకై ముఖ్య కార్యకర్తల సమావేశం.

కొల్లాపూర్ నియోజకవర్గంలో

నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం.

ఎస్సీ రిజర్వేషన్ల సాధనకై ఆగస్టు చివరి వారంలో జరుగు మాదిగల విశ్వరూపం మహాసభను విజయవంతం చేయుటకై నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథులుగా: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సమన్వయకర్త టైగర్ జంగయ్య మాదిగ, జిల్లా ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ హాజరై ఈనెల 16న నాగర్ కర్నూల్ జిల్లా సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సౌటా కాసిం, MSP జిల్లా కో కన్వీనర్ దశరథం, జిల్లా కో కన్వీనర్స్ కురుమయ్య, లక్ష్మణ్, MSF ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మహేష్, కో ఇంచార్జి రమేష్, కొల్లాపూర్ నియోజకవర్గ సమన్వయకర్త సులిగిరి శ్రీను, రాముడు, అగ్రస్వామి, మిద్దె కృష్ణయ్య, రాజమౌళి, లక్ష్మణ్, పరమేష్, ఆంజనేయులు, పవన్, రాజు, కొయ్యల వెంకటేష్, రాముడు, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశాన్ని కాపాడుకుందాం

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశాన్ని కాపాడుకుందాం..

 

ఆగస్ట్ 9,10 మహా పడావ్ విజయవంతం చేయండి. 

     కేంద్ర కార్మిక విధానాలను ప్రతికటించి క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తిత భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకుందామని ఆగస్టు 9,10 తేదీలలో కలెక్టరేట్ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు 

         

శనివారం సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ సమావేశం సుందరయ్య భవన్ లో జరిగింది ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వం లోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బిజెపి ప్రభుత్వం బరితెగించి ప్రజా కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తున్నది. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచావుకగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. డిజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచింది. పార్లమెంటులో తనకున్న మంద బలంతో మూడు రైతన్న వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఉద్యమంతో ఆ చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ 2015లో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఇచ్చిన కనీస మద్దతు ద్వారా హామీ నేటికీ అమలు కాలేదు. రైతన్న అనుకూల ప్రభుత్వమని గొప్పలు చెప్పే బిజెపి ప్రభుత్వానికి రైతన్నల గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయింది.2023- 24 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఆహార ఉత్పత్తులకు సబ్సిడీలకు భారీగా కోతలు విధించింది. ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలతో ఉక్కుపాదం మోపిందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా పౌరులకున్న ప్రాథమిక హక్కులను సైతం పాతరేస్తున్నది.ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి,అసమానతలు, ఆరోగ్య సంరక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకో పోగా ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చే ఆర్థిక విధానాలను క్రూరంగా అమలు చేస్తున్నదని ఆరోపించారు. సామాన్యులపై భారాలు సంపన్నులకు వరాలు అందించే విధంగా తన పెట్టుబడిదారి వర్గ స్వభావాన్ని చాటుకుంటున్నదని, అనేక మంది త్యాగాలు రక్త తర్ప నం తో సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగ మారుస్తూ పార్లమెంట్ లో చట్టం చేసిందని అన్నారు. వేతనాల కోడ్ చట్టంతో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి మంగళం పాడింది. పారిశ్రామిక సంబంధాల కోడ్ చట్టంతో సమ్మె హక్కును కాలరాస్తున్నది. సామాజిక భద్రత కోడ్ ,వృత్తి సంబంధిత రక్షణ ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ లతో, పీఎఫ్, ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులపై గొడ్డలి వేటు వేస్తున్నది. తిరిగి 12 గంటల పని విధానం అమలుకి తెస్తున్నది. కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెరిగి దోపిడికి అద్దు లేకుండా పోతున్నది.సుమారు 40 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులు ఈ లేబర్ కోడ్ లతో అనాధలుగా మారనున్నారు. ప్రభుత్వ స్కీం లోని కోటి మంది స్కీం వర్కర్లు ఉద్యోగ భద్రత, కనీస వేతనానికి నోచుకునే స్థితి లేదు. ఇండియన్ లేబర్ కాంగ్రెస్ కార్మిక సంక్షేమం కోసం గతంలో చేసిన తీర్మానాలన్నీ చిత్తు కాగితాలుగా మారిపోతున్నాయి. ఐఎల్ఓ తీర్మానాలు గంగలో కలిసిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నాలుగు కొత్త లేబర్ కోడులతో కార్మిక వర్గం తిరిగి బానిసత్వంలోకి మెట్టబడుతున్నది. కార్పొరేట్ యజమాన్యాల లాభాలు కోరల్లో కార్మికుల జీవితాలను బలి చేస్తున్నదని అన్నారు.స్వాతంత్ర అనంతరం దేశ ప్రజానీకం ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వ రంగ మౌలిక వసతులు సహజ వనరులను కార్పోరేట్లు లూటీ చేసే విధాన నిర్ణయాలను కేంద్రం అమలు చేస్తున్నది. వ్యూహత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలు తెగ నమ్ముతున్నది.

నేషనల్ మానిటైజేషన్ పైపులను పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజులు పేరుతో దార దత్తం చేస్తున్నది. జాతీయ రహదారులు, రైలు, విద్యుత్ స్టేషన్లో, ట్రాన్స్మిషన్, సహజవాయువులు పైప్ లైన్లు, బొగ్గు గనులు, టెలికం, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎఫ్సిఐ గోదాన్లు, క్రీడా మైదానాలతో సహా ప్రజా ఆస్తులు అన్నిటిని కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో ప్రజలు ఈ సౌకర్యాల కోసం వేలాది రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేటు ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు అప్పజెప్తున్నది. మన రాష్ట్రంలో సింగరేణి 4 బొగ్గు గనులను వేలం వేసినది. హైదరాబాదులో కేంద్రకృతమైన బీడీఎల్, బిహెచ్ఈఎల్, మితాన్ లాంటి సంస్థలతో 25 నుండి 50% దాకా వాటాలను అమ్మేసింది. కార్మికులు మధ్యతరగతి లో అత్యధికులు పాలసీదారులుగా ఉన్న ఎల్ఐసిలో లక్ష కోట్ల రూపాయలు వాటలు అమ్మేందుకు తెగ బడింది. కార్పొరేట్లే కొట్టిన రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు స్కూల్ స్వీపర్లు సమ్మెలు చేస్తున్నారని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు వారి పోరాటాలకు సిఐటియు సంపూర్ణ మద్దతును తెలియజేసింది జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ కార్మిక సంఘాల ఫెడరేషన్ ల ఆధ్వర్యంలో ఆగస్టు 9 జిల్లా కలెక్టరేట్ ముందు ఆర్డీవో కార్యాలయం ముందు జరుగు మహాధర్నాలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

         

సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు సలివొజు సైదాచారి, సాగర్ల యాదయ్య, గంజి నాగరాజు , నకరికంటి సుందరయ్య ఆవురేష్ మారయ్య, కత్తుల జగన్ సాగర్ల మల్లయ్య పల్లె నగేష్ కార్డింగ్ రవి బైరు నరసింహ భీమనపల్లి శంకర్ కొండేటి అంజయ్య ఐతరాజు రామచంద్రు తదితరులు పాల్గొన్నారు

వరద బాధితులు ఆందోళన పడొద్దు.. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

వరద బాధితులు ఆందోళన పడొద్దు.. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి 

..........

.. వరుసగా రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

.. ప్రతీ ఇంటికెళ్లి బాధితులతో మాట్లాడిన సతీష్ రెడ్డి

.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

.. మరింత మంది దాతలు ముందుకు రావాలని వినతి

.... 

వరద బాధితుల ఇళ్లను చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. ఇటీవల కురిసన అతిభారీ వర్షాలకు అతలాకుతలమైన ములుగుజిల్లాలోని గ్రామాల్లో ఆయన రెండో రోజు పర్యటించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షాపాతం నమోదైన వెంకటాపూర్ మండలం బూర్గుపేట గ్రామానికి వెళ్లిన ఆయన.. గ్రామం మొత్తం కలియతిరిగారు. ప్రతీ ఇంటిని పరిశీలించారు. చాలా ఇళ్ల గోడలు కూలిపోయి, పైకప్పు మాత్రమే మిలిగి ఉండటం చూసి ఆవేధన చెందారు. ఒక్కో ఇంటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయామని.. కట్టుబట్టలే మిగిలాయని చాలా మంది స్థానిక మహిళలు తమ కూలిన ఇళ్లను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వంట చేసుకోవడానికి వంట పాత్రలు కూడా లేకుండాపోయాయన్నారు. దీనిపై స్పందించిన సతీష్ రెడ్డి గారు.. ఇళ్లు కూలిపోయిన వారందరికి కొత్త ఇల్లు కట్టి ఇస్తామని భరోసా ఇచ్చారు. బూర్గుపేట వాసుల బాధలను జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, అలాగే గౌరవ సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మరో మార్గంలేక వరదధాటికి శిథిలమైన ఇళ్లలోనే ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదకు మట్టిగోడలు నానిపోయి కూలే ప్రమాదం ఉందని.. వీలైతే కొద్ది రోజుల పాటు బంధువుల ఇళ్లలో గానీ, ప్రభుత్వ పునరావాస కేంద్రంలోగానీ ఉండాలని సలహా ఇచ్చారు. సంవత్సరమంతా పడాల్సిన వర్షం ఒకట్రెండు రోజుల్లో పడటంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. ప్రకృతి విపత్తులను ఎవరూ అడ్డుకునే పరిస్థితి ఉండదన్నారు.

బాధితులందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వారికి భరోసానిచ్చారు. తర్వాత వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులు, చిన్నారులకు పోషకాహర విలువలున్న పదార్థాలను పంపిణీ చేశారు. 

తర్వాత వెంగలాపూర్, కాల్వపల్లి, ఎలుబాక, మేడారం గ్రామాల్లో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు పంపించిన సరుకులను ఆయన తరపున నిజాంపేట్ 9వ డివిజన్ కార్పోరేటర్ రజిత రవికాంత్ గారు అందించారు. నాలుగు గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 100 మందికి సరుకులు, దుస్తులు అందజేశారు. వారితో కలిసి సతీష్ రెడ్డి గారు బాధితులకు సరుకులు అందించారు. 

వరద బాధిత గ్రామాలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసే సాయానికి.. సంస్థల సహకారం కూడా తోడైతే.. వీలైనంత త్వరగా గ్రామాల పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవిందనాయక్, నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎస్ఐ తాజోద్దీన్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.