/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశాన్ని కాపాడుకుందాం Miryala Kiran Kumar
క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశాన్ని కాపాడుకుందాం

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో దేశాన్ని కాపాడుకుందాం..

 

ఆగస్ట్ 9,10 మహా పడావ్ విజయవంతం చేయండి. 

     కేంద్ర కార్మిక విధానాలను ప్రతికటించి క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తిత భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకుందామని ఆగస్టు 9,10 తేదీలలో కలెక్టరేట్ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు 

         

శనివారం సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ సమావేశం సుందరయ్య భవన్ లో జరిగింది ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వం లోని కార్పొరేట్ అనుకూల కేంద్ర బిజెపి ప్రభుత్వం బరితెగించి ప్రజా కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తున్నది. జాతీయ సహజ వనరులు, ప్రభుత్వ రంగ సంస్థలను కారుచావుకగా స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. డిజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచింది. పార్లమెంటులో తనకున్న మంద బలంతో మూడు రైతన్న వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించుకున్నప్పటికీ దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఉద్యమంతో ఆ చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ 2015లో నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఇచ్చిన కనీస మద్దతు ద్వారా హామీ నేటికీ అమలు కాలేదు. రైతన్న అనుకూల ప్రభుత్వమని గొప్పలు చెప్పే బిజెపి ప్రభుత్వానికి రైతన్నల గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయింది.2023- 24 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఆహార ఉత్పత్తులకు సబ్సిడీలకు భారీగా కోతలు విధించింది. ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలతో ఉక్కుపాదం మోపిందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా పౌరులకున్న ప్రాథమిక హక్కులను సైతం పాతరేస్తున్నది.ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి,అసమానతలు, ఆరోగ్య సంరక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకో పోగా ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చే ఆర్థిక విధానాలను క్రూరంగా అమలు చేస్తున్నదని ఆరోపించారు. సామాన్యులపై భారాలు సంపన్నులకు వరాలు అందించే విధంగా తన పెట్టుబడిదారి వర్గ స్వభావాన్ని చాటుకుంటున్నదని, అనేక మంది త్యాగాలు రక్త తర్ప నం తో సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగ మారుస్తూ పార్లమెంట్ లో చట్టం చేసిందని అన్నారు. వేతనాల కోడ్ చట్టంతో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి మంగళం పాడింది. పారిశ్రామిక సంబంధాల కోడ్ చట్టంతో సమ్మె హక్కును కాలరాస్తున్నది. సామాజిక భద్రత కోడ్ ,వృత్తి సంబంధిత రక్షణ ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ లతో, పీఎఫ్, ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులపై గొడ్డలి వేటు వేస్తున్నది. తిరిగి 12 గంటల పని విధానం అమలుకి తెస్తున్నది. కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెరిగి దోపిడికి అద్దు లేకుండా పోతున్నది.సుమారు 40 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులు ఈ లేబర్ కోడ్ లతో అనాధలుగా మారనున్నారు. ప్రభుత్వ స్కీం లోని కోటి మంది స్కీం వర్కర్లు ఉద్యోగ భద్రత, కనీస వేతనానికి నోచుకునే స్థితి లేదు. ఇండియన్ లేబర్ కాంగ్రెస్ కార్మిక సంక్షేమం కోసం గతంలో చేసిన తీర్మానాలన్నీ చిత్తు కాగితాలుగా మారిపోతున్నాయి. ఐఎల్ఓ తీర్మానాలు గంగలో కలిసిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ నాలుగు కొత్త లేబర్ కోడులతో కార్మిక వర్గం తిరిగి బానిసత్వంలోకి మెట్టబడుతున్నది. కార్పొరేట్ యజమాన్యాల లాభాలు కోరల్లో కార్మికుల జీవితాలను బలి చేస్తున్నదని అన్నారు.స్వాతంత్ర అనంతరం దేశ ప్రజానీకం ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వ రంగ మౌలిక వసతులు సహజ వనరులను కార్పోరేట్లు లూటీ చేసే విధాన నిర్ణయాలను కేంద్రం అమలు చేస్తున్నది. వ్యూహత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలు తెగ నమ్ముతున్నది.

నేషనల్ మానిటైజేషన్ పైపులను పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజులు పేరుతో దార దత్తం చేస్తున్నది. జాతీయ రహదారులు, రైలు, విద్యుత్ స్టేషన్లో, ట్రాన్స్మిషన్, సహజవాయువులు పైప్ లైన్లు, బొగ్గు గనులు, టెలికం, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఎఫ్సిఐ గోదాన్లు, క్రీడా మైదానాలతో సహా ప్రజా ఆస్తులు అన్నిటిని కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో ప్రజలు ఈ సౌకర్యాల కోసం వేలాది రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేటు ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు అప్పజెప్తున్నది. మన రాష్ట్రంలో సింగరేణి 4 బొగ్గు గనులను వేలం వేసినది. హైదరాబాదులో కేంద్రకృతమైన బీడీఎల్, బిహెచ్ఈఎల్, మితాన్ లాంటి సంస్థలతో 25 నుండి 50% దాకా వాటాలను అమ్మేసింది. కార్మికులు మధ్యతరగతి లో అత్యధికులు పాలసీదారులుగా ఉన్న ఎల్ఐసిలో లక్ష కోట్ల రూపాయలు వాటలు అమ్మేందుకు తెగ బడింది. కార్పొరేట్లే కొట్టిన రుణాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు స్కూల్ స్వీపర్లు సమ్మెలు చేస్తున్నారని వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు వారి పోరాటాలకు సిఐటియు సంపూర్ణ మద్దతును తెలియజేసింది జాతీయ కార్మిక సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ కార్మిక సంఘాల ఫెడరేషన్ ల ఆధ్వర్యంలో ఆగస్టు 9 జిల్లా కలెక్టరేట్ ముందు ఆర్డీవో కార్యాలయం ముందు జరుగు మహాధర్నాలలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

         

సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు సలివొజు సైదాచారి, సాగర్ల యాదయ్య, గంజి నాగరాజు , నకరికంటి సుందరయ్య ఆవురేష్ మారయ్య, కత్తుల జగన్ సాగర్ల మల్లయ్య పల్లె నగేష్ కార్డింగ్ రవి బైరు నరసింహ భీమనపల్లి శంకర్ కొండేటి అంజయ్య ఐతరాజు రామచంద్రు తదితరులు పాల్గొన్నారు

వరద బాధితులు ఆందోళన పడొద్దు.. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి

వరద బాధితులు ఆందోళన పడొద్దు.. ప్రతీ ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుంది : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి 

..........

.. వరుసగా రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

.. ప్రతీ ఇంటికెళ్లి బాధితులతో మాట్లాడిన సతీష్ రెడ్డి

.. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

.. మరింత మంది దాతలు ముందుకు రావాలని వినతి

.... 

వరద బాధితుల ఇళ్లను చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. ఇటీవల కురిసన అతిభారీ వర్షాలకు అతలాకుతలమైన ములుగుజిల్లాలోని గ్రామాల్లో ఆయన రెండో రోజు పర్యటించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా వర్షాపాతం నమోదైన వెంకటాపూర్ మండలం బూర్గుపేట గ్రామానికి వెళ్లిన ఆయన.. గ్రామం మొత్తం కలియతిరిగారు. ప్రతీ ఇంటిని పరిశీలించారు. చాలా ఇళ్ల గోడలు కూలిపోయి, పైకప్పు మాత్రమే మిలిగి ఉండటం చూసి ఆవేధన చెందారు. ఒక్కో ఇంటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి ఏమేం కావాలో అడిగి తెలుసుకున్నారు. వరదల్లో సర్వం కోల్పోయామని.. కట్టుబట్టలే మిగిలాయని చాలా మంది స్థానిక మహిళలు తమ కూలిన ఇళ్లను చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వంట చేసుకోవడానికి వంట పాత్రలు కూడా లేకుండాపోయాయన్నారు. దీనిపై స్పందించిన సతీష్ రెడ్డి గారు.. ఇళ్లు కూలిపోయిన వారందరికి కొత్త ఇల్లు కట్టి ఇస్తామని భరోసా ఇచ్చారు. బూర్గుపేట వాసుల బాధలను జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, అలాగే గౌరవ సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మరో మార్గంలేక వరదధాటికి శిథిలమైన ఇళ్లలోనే ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదకు మట్టిగోడలు నానిపోయి కూలే ప్రమాదం ఉందని.. వీలైతే కొద్ది రోజుల పాటు బంధువుల ఇళ్లలో గానీ, ప్రభుత్వ పునరావాస కేంద్రంలోగానీ ఉండాలని సలహా ఇచ్చారు. సంవత్సరమంతా పడాల్సిన వర్షం ఒకట్రెండు రోజుల్లో పడటంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. ప్రకృతి విపత్తులను ఎవరూ అడ్డుకునే పరిస్థితి ఉండదన్నారు.

బాధితులందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వారికి భరోసానిచ్చారు. తర్వాత వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులు, చిన్నారులకు పోషకాహర విలువలున్న పదార్థాలను పంపిణీ చేశారు. 

తర్వాత వెంగలాపూర్, కాల్వపల్లి, ఎలుబాక, మేడారం గ్రామాల్లో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు పంపించిన సరుకులను ఆయన తరపున నిజాంపేట్ 9వ డివిజన్ కార్పోరేటర్ రజిత రవికాంత్ గారు అందించారు. నాలుగు గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 100 మందికి సరుకులు, దుస్తులు అందజేశారు. వారితో కలిసి సతీష్ రెడ్డి గారు బాధితులకు సరుకులు అందించారు. 

వరద బాధిత గ్రామాలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసే సాయానికి.. సంస్థల సహకారం కూడా తోడైతే.. వీలైనంత త్వరగా గ్రామాల పునర్నిర్మాణం జరిగే అవకాశం ఉందని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవిందనాయక్, నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎస్ఐ తాజోద్దీన్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎక్సైజ్ నోటిఫికేషన్ లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలు చేయాలి

వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌లు అమలు చేయకుండా విడుదల చేసిన జిఓ 98 ని సవరించి తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం 2023 2025 సంవత్సరాలకు మద్యం షాపులు నిర్వాహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. మద్యం షాపులో రిజర్వేషన్‌లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మే 5, 2021న జిఓ 98 విడుదల చేసిందని ఈ జిఓ ప్రకారం గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్‌సి 10 శాతం ,ఎస్‌టి 5 శాతం షాపులు కేటాయించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ జీఓలో ఎక్కడ కూడా వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయాలని పేర్కొనలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని విడుదల చేసిన జీఓ 1 కి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైజ్ పాలసీ ఉందన్నారు. ఈ పాలసీ వికలాంగుల తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. .

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పథకాల్లో వికలాంగులకు ఐదు శాతం కేటాయించాలని చట్టం పేర్కొందని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చట్టానికి భిన్నంగా జీఓ 98 విడుదల చేసిందన్నారు. 2023-2025 సంవత్సరాలకు 2,620 వైన్ షాపుల కేటాయింపు కోసం టెండర్లను ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ నోటిఫికేషన్ విడుదల చేసిందని తక్షణమే జీఓ 98ను సవరించి వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తూ ఎక్సైజ్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన ఎక్సైజ్ నోటిఫికేషన్ రద్దు చేయకుంటే వికలాంగుల సంఘాలతో కలిసి టెండర్స్ అడ్డుకుంటామని హెచ్చరించారు.

అనారోగ్యంతో మృతి చెందిన కార్యకర్త భౌతిక కాయానికి నివాళులర్పించి ఆర్థిక సాయం చేసిన మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి 

నల్లగొండ పట్టణ పరిధిలోని 19 వ వార్డు శ్రీ నగర్ కాలనీ కి చెందిన ఇటకాల యాదగిరి అనారోగ్యంతో మృతి చెందారు. వారి పార్థివ దేహానికి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం చేశారు... వారి వెంట బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, అంబటి వెంకన్న యాట వీరా రెడ్డి, కందుల విజయ్, నిమ్మనగోటి కృష్ణయ్య, గిరి, అంజిబాబు గార్లు తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ పట్టణంలో కేసీఆర్ గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం.

నల్గొండ పట్టణంలో కేసీఆర్ గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం..

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం ప్రకారం..

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రైతులకు 45 రోజుల్లోగా లక్ష రూపాయల రుణమాఫీ.. చేయాలని నిర్ణయించినందున..

హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ... 

స్థానిక నల్లగొండ గడియారం సెంటర్లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్ గారు, 

మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి గారు, హాజరై మాట్లాడుతూ... రైతు బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు. రైతుల గురించి ఆలోచించి లక్ష రూపాయల రుణమాఫీ చేయడంపై ధన్యవాదములు తెలిపారు. బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బోనగిరి దేవేందర్ గారు, కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు

 బిఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల నాయకులు, డైరెక్టర్లు, రైతు బంధు కమిటీ సభ్యులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్ గారి పాలన...రాష్ట్రంలో దివ్యాంగులకు ముందెన్నడూ లేని భరోసా

గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ అమలు చేయడం పట్ల రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

వికలాంగుల సమాజం తరుపున సీఎం కేసీఆర్ గారికి

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి గారికి రుణపడి ఉంటాము 

- మొహమ్మద్ మున్నా 

టిఆర్విఎస్ - అధ్యక్షులు 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇల్లు లేనటువంటి నిరుపేదలకు సొంత జాగ ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలని చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు జూలై 21st న చేసిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించి, జి.ఓ ఇప్పించినందుకు వికలాంగుల సమాజం తరుపున సీఎం కేసీఆర్ గారికి రుణపడి ఉంటాము. 

రాష్ట్రములోని వికలాంగులు సంతోషంతో ఉన్నారని సొంతింటి కల నెరవేరినట్లుగా భావిస్తున్నారు. ఈ జీవోతో వికలాంగులలో అత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ జి.ఓ 25 కు అమెండ్మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జివో నెంబర్ 33ను జారీ చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులకు 5% కేటాయిస్తారు. ఇది తెలగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో వికలాంగులకు లభించిన మరొక గొప్ప భరోసా.

మానవీయ పాలనకు నిలువెత్తు నిదర్శనం సీఎం కేసీఆర్ గారి పాలన.రాష్ట్రంలో దివ్యాంగులకు ముందెన్నడూ లేని భరోసా, దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఒకవైపు జీవనోపాధికి భరోసా కల్పిస్తూ మరోక వైపు ఆసరా పెన్షన్ రూపంలో వారి జీవితానికి ఆర్దిక భరోసా అందిస్తున్న, గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించిన సీఎం కేసీఆర్ గారికి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే. వాసుదేవరెడ్డి గారికి రాష్ట్ర దివ్యాంగుల సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన పైన నేడు భారత రాష్ట్ర సమితి సంబరాలు

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన పైన భారత రాష్ట్ర సమితి సంబరాలు 

గ్రామం, మండలం, జిల్లా కేంద్రాల్లో రైతులతో భారీగా సంబరాలు నిర్వహణకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు*

రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు ఈరోజు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు పిలుపునిచ్చారు.

ఇప్పటికే గత తొమ్మిది సంవత్సరాలకుపైగా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టినదని, రైతన్నలకు హామీ ఇచ్చిన మేరకు ఈరోజు రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించడం అత్యంత సంతోషకరమైన విషయం అన్నారు. అనేక సందర్భాల్లో రైతుల వెంట నిలిచిన పార్టీ శ్రేణులు తాజాగా రైతన్నలకు రుణమాఫీ అంశంలోనూ వారితో కలిసి సంబరాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రతి గ్రామము, మండలము, నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతులందరితో కలిసి సంబరాలను ఎవరికి తోచిన విధంగా వారు నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇంచార్జి లు, జిల్లా అధ్యక్షులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఈ సంబరాల తాలూకు కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతుబంధు సమితులతో పాటు సహకార సంఘాల ప్రతినిధులు కూడా ఈ సంబరాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు.

ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌

ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం.. పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌ 

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో సోమవారం జరిగిన క్యాబినెట్‌ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులను కోరారు. మంగళవారం ఉదయం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రెటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో మంత్రి కేటీఆర్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వ హయాంలో కూడా తీసుకోని విధంగా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలను ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉన్నదని నేతలకు కేటీఆర్ చెప్పారు.

ఇటీవల 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న మానవీయతను చాటి చెబుతున్నదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ నాయకులను కేటీఆర్ కోరారు. అంతేగాక ఒకటి రెండు రోజుల్లో వీఆర్ఏల కుటుంబాలతోను, ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతోను ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్‌చార్జిలకు కేటీఆర్ సూచించారు.

అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అనాథలు అందరినీ ఒక పాలసీ కిందకు తీసుకువచ్చి, వారి బాధ్యతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా చేసిన నిర్ణయం కూడా అత్యంత మానవీయమైన పరిపాలనా నిర్ణయమని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలో 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి సూచించారు. మెట్రో సేవలు అందుబాటులోకి రానున్న నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలన్నారు.

మెట్రో విస్తరణతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, దాంతో నగర విస్తరణ వేగంగా జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల వలన ఇబ్బందుల పాలైన ప్రజలకు ఉపశమనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా రూ.500 కోట్లు ప్రకటించిందని, ఇవి ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.

భూమి, కూలి పోరాటాలే కామ్రేడ్ కృష్ణమూర్తికి నిజమైన నివాళి

భూమి, కూలి పోరాటాలే కామ్రేడ్ కృష్ణమూర్తికి నిజమైన నివాళి

 వర్ధంతి సభలో నారీ ఐలయ్య

      తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి 17 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం దొడ్డి కొమురయ్య భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

       

 ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నారీ ఐలయ్య మాట్లాడుతూ కా"అమరజీవి కాచం కృష్ణమూర్తి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతంగా పోరాట ఉద్యమం అంచాలంచాలుగా ఎదిగి నిజం నిరంకుశ రాజరికన్ని అంతం చేసి, భూస్వాముల నుండి10 లక్షల ఎకరాలభూమి స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంచడం జరిగిందని అన్నారు. 3000 గ్రామాల విముక్తి చేసే ఈ గ్రామాలను ప్రజారాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఉద్యమానికి సారాధ్యం వహించి ప్రజలను చైతన్యపరిచింది ఆంధ్ర మహాసభ పేరిట ఉద్యమాలు నిర్వహించిన కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి కి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికిస్ఫూర్తిదాయకమని అన్నారు. కూలి భూమి పోరాటాలే వారికి నిజమైన నివాళి అని అన్నారు

       

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండా శ్రీశైలం, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య , నలపరాజు సైదులు, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, జిల్లా ఆఫీస్ బేరర్స్ కత్తుల లింగస్వామి, మన్నెం బిక్షం, గoడమల రాములు, నల్లగొండ మండల అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అంజయ్య,గోలి నర్సింహ,పట్టణ అధ్యక్షులు రుద్రాక్ష యాదయ్య, తెలకలపల్లి శ్రీను,బోడ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం..

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం..

రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

TSRTC | తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది.

TSRTC | తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయనున్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన మంత్రివర్గ మండలి సమావేశమైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశమై చర్చించింది. త్వరలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.