/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz విఆర్ఏల సర్దుబాటుపై సీఎం సమీక్ష Miryala Kiran Kumar
విఆర్ఏల సర్దుబాటుపై సీఎం సమీక్ష

గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్​ఏ)లను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వీఆర్​ఏల సర్దుబాటుపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు.

ఉన్నతాధికారులు, వీఆర్ఏ ఐకాసతో ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నీటిపారుదల సహా ఇతర శాఖల్లో వీఆర్‌ఏలను సర్దుబాటు చేసే విషయమై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో వీఆర్ఏల సర్దుబాటుపై ఈ నెల 11న జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది.

వీఆర్​ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జులై 10న నిర్వహించిన సమీక్షలో అధికారులకు చెప్పారు. ఇందుకోసం కేటీఆర్ నేతృత్వంలోని ఉపసంఘం... వీఆర్​ఏలతో చర్చలు ప్రారంభించాలని తెలిపిన విషయం తెలిసిందే. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకొని వీఆర్​ఏల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఉపసంఘం కసరత్తు పూర్తయి నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి:కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ కార్యదర్శి

పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

దేశవ్యాప్త ర్యాలీ, ప్రదర్శనలు, ధర్నాలు జయప్రదం. 

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సీ.సీ.పీ.ఏ) ఆధ్వర్యంలో జులై 21న వేలాది పెన్షనర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతం గానున్న సమస్యల పరిష్కారానికై భారీ ర్యాలీ నిర్వహించి లక్షలాది సంతకాలతో ప్రధాన మంత్రికి కోర్కెల పత్రం సమర్పించారు.

వర్షాలను, వయస్సును లెక్క చేయకుండా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (తాప్రా) పిలుపు మేరకు దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పోరాట స్ఫూర్తితో సామూహిక ప్రదర్శనలు నిర్వహించి గురువారం కలెక్టర్ల ద్వారా చీఫ్ సెక్రటరీకి వినతి పత్రాలను సమర్పించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ఈపియస్, సింగరేణి తదితర పెన్షనర్లకు ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ అభినందనలు తెలిపారు.

ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీ.పి.ఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓ.పి.ఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పి.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పెన్షనర్లు పొందేది జీవనభృతి కావున ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీలలో గతంలో రద్దు చేసిన రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

8వ కేంద్ర వేతన కమీషన్ (సి.పీ.సీ), రాష్ట్ర పే రివిజన్ కమీషన్ (పి.ఆర్.సీ)లను వేసి ఇంటరిమ్ రిలీఫ్ ను ప్రభుత్వాలు ప్రకటించాలని, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రీస్టోర్ కాలాన్ని 15 సంవత్సరాలకు బదులుగా 12 సంవత్సరాలకు కుదించాలని కోరారు. అన్ని జిల్లాల్లో వెల్ నెస్ సెంటర్లను ఏర్పరిచి వైద్య సౌకర్యాలను మెరుగుపరచాలని, నగదు రహిత చికిత్స వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు.

*ఈ.పి.ఎస్- 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.1000/- నుంచి పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పులను నిజ స్ఫూర్తితో అమలు పరచాలని, పెన్షన్ ఫండ్ల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సింగరేణి తదితర కోల్ మైన్ పెన్షనర్ల కనీస పెన్షన్ ను రూ.350/-, రూ.250/- నుంచి పెంచాలని, కరువు భత్యం చెల్లించాలని, పెన్షన్ ను పెంచాలని వి.కృష్ణ మోహన్ కోరారు. సమస్యలు వెంటనే పరిష్కరించనట్లైతే ఉద్యోగులు, ఆఫీసర్లు, పెన్షనర్లు ఐక్యంగా ఆందోళనా కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాలకు హెచ్చరించారు.

దివ్యాంగుల దేవుడు సీఎం కెసిఆరే:టి.వి.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్,వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి

మాట తప్పని మడమ తిప్పని సీఎం కెసిఆర్

దివ్యాంగుల దేవుడు సీఎం కెసిఆరే

దివ్యాంగులకు పెంచిన పింఛన్ 4016 రూ.జీవో అర్ టి నెంబర్ 25 జారీ.

  --- టి.వి.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్,వికలాంగుల-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ పల్లకొండ కుమారస్వామి సీఎం కెసిఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు..

      ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు దివ్యాంగులను గుర్తించలేని విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సమాజంలోని అత్యంత బలహీన వర్గాలను రక్షించడానికి,పెరుగుతున్న వయస్సుతో జీవనోపాధిని కోల్పోయిన దివ్యాంగులు,వృద్దులు,వితంతువులు,ఒంటరి మహిళలు,నేత,గీత,బీడీ కార్మికులందరూ మరియు ఇతరులు గౌరవప్రదమైన,సామజిక భద్రతతో కూడిన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 2014లో ఆసరా పింఛన్ పథకం ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి తెలిపారు.

     తెలంగాణ రాక ముందు 3,50,487 మంది దివ్యాంగులకు రూ.500 చొప్పున నెలకు 17.52 కోట్లు అందేవి.ప్రస్తుతం పెంచిన పింఛన్ ప్రకారం 5,11,656 మంది దివ్యాంగులకు రూ.4016 చొప్పున నెలకు 205 కోట్ల 48 లక్షల 10 వేల 496 రూపాయలు అందుతున్నాయని కోరారు.

      దేశంలో ఎక్కడ లేని రీతిలో మన రాష్ట్రంలోనే దివ్యాంగులకు 3016రూ, నుంచి 4016 రూ. పింఛన్ ఇవ్వడం దేశంలోనే ఏకైక తెలంగాణ రాష్ట్రమని గొప్ప విషయమని చెప్పారు.పెరిగిన పింఛన్ తో రాష్ట్రంలోని దివ్యాంగులందరూ గౌరవంగా తమ బతుకులు సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్నామని,మాట తప్పని మడమ తిప్పని సీఎం కెసిఆర్,ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దివ్యాంగులకు పింఛన్లు పెంచమని జీవో జారీ అర్.టి నెంబర్ 25 జారీ చేయడం జరిగిందన్నారు.సీఎం కెసిఆర్ ఉన్నంత వరకు రుణపడి తమకు అండగా ఉంటామని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లకొండ కుమారస్వామి ప్రత్యేకంగా సీఎం కెసిఆర్ కు,మంత్రులకు, మరియు రాష్ట్ర చైర్మన్ వాసుదేవరెడ్డికి కృతజ్ఞతలతో ధన్యవాదాలు దివ్యాంగ పక్షాన తెలుపుతున్నమన్నారు.

రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనార్టీలకు పూర్తి సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం

రాష్ట్రంలోని బిసిలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలనే ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తద్వారా మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదన్నారు.

మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సీఎం పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తున్నదని సీఎం అన్నారు. 

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆశయ సాధనలో అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆశయ సాధనలో అంతిమ పోరాటానికి సిద్ధం కావాలి.

- బకరం శ్రీనివాస్ మాదిగ 

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్

ఆగస్టు రెండో వారంలో మాన్యశ్రీ మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన మాదిగల విశ్వరూప మాహాసభను జయప్రదం చేయడానికై ఈనెల 30న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని స్థానిక బాబు జగ్జీవన్ రామ్ భవన్లో నిర్వహించబోయే నాగర్ కర్నూల్ జిల్లా సన్నాహాక సదస్సును మాదిగ, మాదిగ ఉపకులాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

శనివారం అచ్చంపేట నియోజకవర్గం స్థాయి సమావేశం ఎమ్మార్పీఎస్ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ సౌట ఖాసిం అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ హాజరై మాట్లాడుతూ....

ఈదేశాన్ని 9సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వం 100 రోజుల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తా అన్న హామీని కనీసం పార్లమెంటులో 100 నిమిషాల పాటు కూడా మాట్లాడకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న మాదిగ మాదిగ ఉపకాలాలను అవమానిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వ బీజేపీని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చేనెల రెండో వారంలో దక్షిణ భారతదేశంలో 30 లక్షల మంది మాదిగ, మాదిగ ఉపకులాలతో హైదరాబాద్ గడ్డమీద బిజెపి పార్టీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మహోత్తరమైనటువంటి న్యాయమైన ధర్మమైనటువంటి అంశానికి ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో MRPS, MSP, MSF, నాయకులు బుక్కాపురం మహేష్, భరత్, ఆంజనేయులు, కొయ్యల వెంకటేష్, గుద్దటి ప్రవీణ్, చిట్టి గోరి పవన్, శ్రీకాంత్, చింతకుంట్ల నిరంజన్, కొమ్ము రాంప్రసాద్, రాజు, భగవంతు, మల్లేష్, సురేష్, రేనయ్య తదితరులు పాల్గొన్నారు.

తమ నిధులనుండి 10 లక్షల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నవీకరించిన:ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. తమ నిధులనుండి 10 లక్షల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్... నవీకరించిన మొదటి అంతస్తు భవనాన్ని.. ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ...

 

ఇక్కడికి వచ్చిన వారంతా పెద్దవారుఎంతో అనుభవం ఉన్నవారని .. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో .... ఎంతోమంది బలిదానాలు చేసినా... సంకుచిత రాజకీయాలతో తెలంగాణను అడ్డుకున్నారని... నేడు కేసీఆర్ నాయకత్వంలో.... అకుంఠిత దీక్షతో.. అహింసా పద్ధతులతో... మీ అందరి సహకారంతో.. చావు అంచుల వరకు వెళ్లి, ఢిల్లీ నాయకుల మెడలు వంచి.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని.. తెచ్చిన తెలంగాణాన్ని... బంగారు తెలంగాణగా దేశంలోనే అగ్రభాగాన నిలిపారని... కెసిఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు... అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారని.. ఒకప్పుడు మూడు లక్షల టన్నుల ధాన్యం పండించలేని తెలంగాణ రాష్ట్రం ఈనాడు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే అగ్ర భాగాన నిలిచిందని... ఈరోజు దేశానికే తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించిందని తెలియజేశారు....

నల్లగొండలో మార్పు కోసం... శాసనసభ్యుగా తనను గెలిపించిన తర్వాత... కెసిఆర్ దత్తత తీసుకున్న నల్లగొండ ను 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి... సుందర నందన వనంగా తీర్చిదిద్దుతున్నామని... ఇప్పటికి కేవలం 25% పనులు మాత్రమే పూర్తయ్యాని మరో 75% పనులకు నిధులు కేటాయించబడి పనులు పురోగతిలో ఉన్నాయని... మరో రెండు సంవత్సరాల తర్వాత అవి పూర్తి అయ్యి నల్లగొండ రూపురేఖలే మారతావని తెలియజేశారు...

 

ఈ భవనం. నవీకరణ కోసం మరో 15 లక్షల రూపాయలు తమ నిధులనుండి మంజూరు చేస్తున్నట్టు తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్... టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్.. రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు... వెంకటరెడ్డి, శంకర్ రెడ్డి... లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

నల్లగొండలో బీసీల సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

నల్లగొండలో బీసీల సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ

బీసీ సంక్షేమ, ఉద్యోగ ,యువజన, మహిళ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 6 తేదీన నల్లగొండ పట్టణం చిన్న వెంక రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న బీసీల సింహ గర్జన సభ పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది 

 ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, పెద్దలు, బీసీల ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారు హాజరవుతున్నారు కావున బీసీ బంధుమిత్రులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయాలని సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కె పర్వతాలు, రమణ ముదిరాజ్ ,ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ ,యువజన సంఘం అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్, మేకల యాదన్న యాదవ్, అల్లి వేణు యాదవ్, గుండు వెంకటేశ్వర్లు కొండ భవాని ప్రసాద్ ,బత్తుల శ్రీనివాస్ ,దూది గామ స్వామి, సొల్లేటి లక్ష్మణాచారి, కర్ణాటయాదగిరి వడ్డే బోయిన, సైదులు, వెంకన్న యాదవ్ బక్కతట్ల, ప్రణీత్ రాచకొండ గిరి ,ఎస్కే ఖదీర్ ,సతీష్ యాదవ్ ,వళ్ళ కీర్తి శీను, సింగం లక్ష్మీనారాయణ, భరత్ ,సదానంద్ ,కె శేఖర్, శంకరదుర్గ, నామ ప్రసాద్, పాముల అశోక ,రుద్ర లక్ష్మణ్, పున్న వీరేష్ ,పున్న పాండు ,చల్లేటి రవి ,వనం లలిత ,చిలుకూరి శీను, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మెబిలిటీ కార్డు

హైదరాబాద్ నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి ఉపయుక్తంగా ఉండేలా ఒక కామన్ మెబిలిటీ కార్డుని తీసుకువచ్చే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ సంస్ధలు కార్యచరణ ప్రారంభించాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రధానమైన ప్రజా రవాణా మార్గాలుగా ఉన్న మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకునేందుకు వీలుండే విధంగా ఈ కార్డు ఉండనున్నది. 

మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆర్టీసీ మరియు మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన పలు వివరాలను అందించారు. ఈ కార్డు జారీ ప్రక్రియ నుంచి మొదలుకొని వివిధ ప్రాంతాల్లో దాని ఉపయోగం వరకు నగర ప్రజలకు అందుబాటులో ఉండే సేవల వివరాలను అధికారులు మంత్రులకు తెలియజేశారు. 

మొదట మెట్రో రైల్ మరియు ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డుని జారీ చేస్తామని, ఇదే కార్డుతో సమీప భవిష్యత్తులో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకునే విధంగా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. ఇదే కార్డుతో భవిష్యత్తులో పౌరులు తమ ఇతర కార్డుల మాదిరే కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరం వరకు ఈ కార్డు జారీ ఉంటుందని, త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్డు సేవలు అందించేలా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. ఈ కార్డు కలిగిన పౌరులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. దీంతో ప్రభుత్వం జారీ చేస్తున్న ఈ కార్డు వలన ఇతర మెట్రో నగరాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆర్టీసీ బస్సులు లేదా మెట్రో రైల్ ఇతర ప్రజా రవాణా వ్యవస్థను ఎలాంటి ఇబ్బందులు లేకుండా

వాడుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్డును ప్రయోగాత్మకంగా ఆగస్టు రెండవ వారంలోగా నగర పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేయాలని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి మెట్రో రైల్ మరియు ఆర్టీసీ సంస్థ అధికారులు సమన్వయంతో వేగంగా ముందుకు పోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనున్న ఈ కామన్ మొబిలిటీ కార్డుకి ఒక పేరును సూచించాలని కోరారు.

వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండాలి:మంత్రి హరీష్ రావు సమీక్ష

వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండాలి.. మంత్రి హరీష్ రావు సమీక్ష* 

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సన్నద్ధత ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు గురువారం సమీక్షించారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలి. సబ్ సెంటర్ స్థాయి నుంచి హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండి ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలి. ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించే విషయంలో అవసరమైతే హెలికాప్టర్ సేవలు వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు గాను రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు. 108, 102 వాహన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించాలి. గర్భిణులు, డయాలసిస్ పేషెంట్లకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో ఆయా పరిధిలోని ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్స్ వెళ్లి సందర్శించాలి. కలుషిత ఆహారంపై అవగాహన పెంచాలి." అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

భారీ వర్షాలు... సెలవులు పొడిగించిన ప్రభుత్వం

భారీ వర్షాలు... సెలవులు పొడిగించిన ప్రభుత్వం

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది.

జిహెచ్ఎంసి పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రవేటు సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.