/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 5 బోగీలు పూర్తిగా దగ్ధం Yadagiri Goud
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 5 బోగీలు పూర్తిగా దగ్ధం

భువనగిరి జిల్లా:జులై 07

యాదాద్రి జిల్లాలో శుక్రవారం ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా బోగీలో మంటలు చెలరేగాయి. మొత్తం 6 బోగీలకు వ్యాపించిన మంటలు.. పక్కనే ఉన్న బోగీలకు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి కిందకు దూకారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో బోగీలు దగ్ధం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. లోకో పైలట్ గమనించి రైలును ఆపాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా రైలును అక్కడికక్కడే ఆపాల్సి వచ్చింది. ఈ రైలులో దాదాపు 1500 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 80 నుండి 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. భువనగిరి సమీపంలో రైలు వేగాన్ని తగ్గించడంతో మంటలను గుర్తించారు. ఈ రైలులోని ఎస్3, ఎస్4, ఎస్5, ఎస్6 కోచ్‌లు దగ్ధమైనట్లు సమాచారం.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ హరా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో గంటలో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకుంటారనగా ప్రమాదం జరిగింది. మంటలు ఇతర బోగీలకు వ్యాపించే చోట బోగీల మధ్య ఉన్న లింక్‌ను తొలగించారు. దీంతో ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఛార్జింగ్ పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే మంటలు చెలరేగాయని ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు.

నేడు టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు

ఈ రోజు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జూన్‌ 14 నుంచి 22 వరకూ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 60 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు కూడా రెండుమూడు రోజుల్లో విడుదల కానున్నాయి. జూన్‌ 12 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగ్గా, 4,12,325 మంది విద్యార్థులు హాజరయ్యారు....

సర్వీస్ రివాల్వర్ కాల్చుకున్న కోయంబత్తూర్ డిఐజి

తమిళనాడు:జులై 07

కోయంబత్తూరు డీఐజీ విజయ్ కుమార్ (45) ఈరోజు తెల్లవారుజామున క్యాంపు కార్యాలయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన విజయకుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. మొదటగా నెల్లై జిల్లా వల్లియూర్‌లో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు.

దీని తర్వాత కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. సీబీసీఐడీలో ఎస్పీగా కూడా పనిచేసిన విజయకుమార్ సాతంకుళం జంట హత్య కేసును తొలిసారిగా దర్యాప్తు చేశారు. కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, నీలగిరి నాలుగు జిల్లాల పర్యవేక్షణ అధికారిగా పని చేశారు. గత జనవరిలో విజయకుమార్ కోయంబత్తూరు డీఐజీగా బాధ్యతలు చేపట్టారు.

గత రెండు రోజులుగా విజయకుమార్ కుటుంబ కారణాలవలన మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆయన కొంత కాలంగా నిద్ర సరిగా ఉండటం లేదని తోటి అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి డిప్రెషన్‌తోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. నిన్న రాత్రి కోయంబత్తూరు డిప్యూటీ కమిషనర్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరైన విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కాగా.. విజయకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాంథియా రోడ్డు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై కూడా విచారణ జరుపుతున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.. విజయ్ కుమార్ మృతి విషయం తెలుసుకుని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు స్టాలిన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు...

మంత్రి మల్లారెడ్డా? : మజాకా ❓️

నెత్తిన గొంగడి, చేతిలో కర్రతో గొర్రెల వెంట వెళుతున్న ఈ వ్యక్తిని గుర్తు పట్టారా? అవును.. మంత్రి మల్లారెడ్డే. మేడ్చల్‌ మండలంలోని గౌడవెల్లి గ్రామం లో గురువారం సాయంత్రం

పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 18 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయ గా, లబ్ధిదారులకు అందించిన గొర్రెలు గుంపుగా కనిపించడంతో

సంతోషం పట్టలేని మంత్రి యాదవుల వద్ద ఉన్న గొంగడి వేసుకుని, కట్టె చేత పట్టుకుని కాసేపు గొర్రెల మంద వెంట తిరిగారు. ఆశ్చర్యానికి గురైన నాయకులు, యాదవులు సరదాగా కాసేపు నవ్వుకుని మంత్రిని అనుసరించారు.......

హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న రాజధాని బస్సులో చెలరేగిన మంటలు

హైదరాబాద్‌ శివార్లలోని పెద్దంబర్‌పేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్‌ఈఎల్‌ డిపోకు చెందిన రాజధాని బస్సులో పెద్దంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అయితే మంటలను గమనించిన డ్రైవర్‌.. వెంటనే బస్సును ఆపి, అందులోనుంచి ప్రయాణికులను దించివేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

అయితే మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఏసీలో మంటలు చెలరేగడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు...

నేడు షిరిడీ సాయిని ద‌ర్శించుకోనున్న భార‌త రాష్ట్ర‌ప‌తి

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శుక్ర‌వారం షిరిడీ సాయినాథుడిని ద‌ర్శించుకుకోనున్నారు. ప్రత్యేక విమానంలో షిరిడీ రానుండ‌డంతో అధికారులు ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. రాష్ట్రపతి ముర్ము సుమారు మూడు గంటల పాటు షిర్డీలో ఉంటార‌ని, మధ్యాహ్నహారతికి హాజరవుతార‌ని సంస్థాన్ సీఈవో పి. శివ‌శంక‌ర్ తెలిపారు.

సాయి సమాధి వద్ద రాష్ట్ర‌ప‌తి పూజ చేస్తార‌ని, ఆ తర్వాత సాయిబాబా రాకను గుర్తుచేసే గురుస్థాన్ ఆలయాన్ని, నిమ్మాక్ చెట్టును సందర్శించే అవ‌కాశం ఉంద‌న్నారు. బాబా నివసించిన సర్వమత సమానత్వానికి ప్రతీక అయిన ద్వారకామాయిలో కూడా ముర్ము సంద‌ర్శించ‌నున్నారు.

కాగా, సాయి సంస్థాన్ సీఈవో పి. శివశంకర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది టూర్‌ ప్లాన్‌లో బిజీగా ఉన్నారు. ఇక‌.. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు గవర్నర్ రమేశ్ బైస్, మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్, ఎంపీలు సదాశివ లోఖండే, డాక్టర్ సుజయ్ విఖే పాటిల్ కూడా రాష్ట్ర‌ప‌తితో పాటు రానున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. గ‌తంలో భార‌త రాష్ట్ర‌ప‌తులుగా ఉన్న వారిలో నీలం సంజీవ్‌రెడ్డి, శంకర్‌దయాళ్‌ శర్మ, ప్రతిభా పాటిల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, రామ్‌నాథ్‌ కోవింద్‌ సాయిదర్శనం సందర్భంగా షిర్డీని సందర్శించారు..

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం 8న ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు.

ఉదయం 11.30 గంటలకు హనుమ కొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.10 గంటలకి తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు..

స్నేహితుడు చెప్పాడని కారు వేగంగా నడిపి.. ఇద్దరి మృతికి..

హైదరాబాద్‌: తెల్లవారుజామున రోడ్డు మీద ట్రాఫిక్‌ లేదు.. కారు వేగంగా వెళ్తేనే మజాగా ఉంటుందని స్నేహితుడు చెప్పాడని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాడు..

ఇద్దరి ప్రాణాలు బలి తీసుకున్నాడు. మరో ఇద్దర్ని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేశాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రధాన నిందితుడు మహమ్మద్‌ బదియుద్దీన్‌ ఖాద్రి తన స్నేహితుడు బానోత్‌ గణేశ్‌ చెప్పడం వల్లే వేగంగా నడిపినట్లు పోలీసులకు చెప్పాడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని తెలిసినా బదియుద్దీన్‌కు అబ్దుల్‌ రెహమాన్‌ వాహనం ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. డ్రైవింగ్‌ పక్క సీట్లో బానోత్‌ గణేశ్‌, వెనక సీట్లో మహ్మద్‌ ఫయాజ్‌, సయ్యద్‌ ఇబ్రహీముద్దీన్‌ కూర్చున్నారు. ప్రమాదం తరువాత ఇద్దరు చనిపోయారని తెలుసుకున్న నలుగురూ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు..

తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :జులై 07

తిరుమల లో భక్తుల రద్దీ పెరిగిపోయింది. నేడు శుక్రవారం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక గురువారం స్వామివారిని 66,977 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.39 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,020 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను మరింత ఉదృతం చేస్తాము

•జేఏసీ చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ

తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నాడు నలగొండ ఎంపీడీవో ఆఫీస్ ముందు పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె ను జేఏసీ చైర్మన్ చినపాక లక్ష్మీనారాయణ ప్రారంభించారు. సమ్మనుద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుండి పంచాయతీ కార్మికులందరూ నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారని ప్రభుత్వం నిర్లక్ష్య మొండి వైఖరిని వీడి సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

పరిష్కరించకపోతే ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులు పంచాయతీల్లో సేవలు చేస్తూ అర్దాకలతో అలమటిస్తున్నారని అన్నారు. మల్టీ పర్పస్ వర్కర్ విధానం వలన కార్మికులకు అనుభవం లేని పనులు ట్రాక్టర్ డ్రైవింగ్ చేయడం, కరెంటు స్తంభాలు ఎక్కడం లాంటి పనులతో ప్రమాదాలకు గురై మరణిస్తున్నారని అన్నారు కానీ ప్రభుత్వం మాత్రం చస్తే 5000/ ఇస్తాం అనే చందంగా వ్యవహరిస్తుంది తప్పితే ఆ కార్మికుని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వకుండా కుటుంబాన్ని బజారున పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం పదిలక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్, ఇతర వస్తువుల ధరలు పేరుగుతున్న తరుణంలో కార్మికుల జీతాలు మాత్రం పెరుగుదల లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 11వ పిఆర్సి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% వేతనాలు పెంచుతున్నట్లుజీవోలు జారీ చేశారు అవి అమలు కూడా అవి అయ్యాయి కానీ ప్రభుత్వంరంగ సంస్థ అయినా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం మాత్రం చిన్న చూపే చూసిందే తప్ప వాళ్లకు వేతనాలు పెంచలేదు కాబట్టే మేము ఈరోజు సమ్మెలోకి వెళ్ళామని అన్నారు.ఆలోపు జీవో నెంబర్ 60 ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఏ విధమైన వేతనాలు ఇస్తున్నారు అదే తరహా వేతనాలను పంచాయతీ కార్మికులకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పైన ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక వినోద్ కుమార్, యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు మండల అధ్యక్ష కార్యదర్శులు కాశీ మల్ల రాములు, పోలే సత్యనారాయణ జేఏసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఇరిగి ఎల్లేష్, పగిళ్ల ముత్తయ్య, వంగూరి శ్రీకాంత్, పెరిక రాంబాబు, యాదగిరి, చింతకింది భద్రయ్య, నరేష్, పోలే సుధాకర్, రేణుక, కళావతి, వాణి, చింత నాగయ్య, గోవర్ధనా చారి తదితరులు పాల్గొన్నారు.