తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే....
•బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేపూరి రవీందర్. బిజెపి మహాజన్ సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల కాలంలో చేసిన సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ఎలికట్టే శక్తి కేంద్రం ఇంచార్జ్ బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్ అందిస్తూ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని 9090902024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రధాన మంత్రికి మద్దతు తెలపండి అని ప్రచారం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో అంత్యోదయ స్ఫూర్తి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా 12 కోట్ల మంది రైతులకు ఏడాదికి 6, 000 రూపాయల ఆర్థిక సహాయం, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అపూర్వ వృద్ధి, ఈశాన్య రాష్ట్రాల చారిత్రక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వంలో కొత్త శకం, రైతు సంక్షేమానికి పెద్దపీట,
నారీ నారాయణి: మహిళా సాధికారత, భారతదేశ అమృతకాలం భావితరం సశక్తీకరణ, అందరికీ ఆరోగ్యకరమైన జీవితం, మధ్య తరగతికి సులభతర జీవితం, సశక్త భారతదేశం, నేడు భారతదేశంలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కరోనా కష్టకాలంలో దేశ ప్రజలకు వాక్సినేషన్, వందే భారత్ మిషన్, భారతదేశం భద్రత పటిష్టం, ఆర్టికల్ 370 రద్దు, వసుదైవ కుటుంబం, డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా భారతదేశాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీర్చిదిద్దాడన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల రూరల్ అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్, ఎలికట్టే బూత్ కమిటీ అధ్యక్షులు గుడిపాటి సందీప్, లింగస్వామి, చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, నకిరేకల్ ఎస్సీ మోర్చా కన్వీనర్ కోరబోయిన లింగస్వామి బూత్ కమిటీ అధ్యక్షులు రావుల వెంకన్న, ఈదుల పవన్, శ్రీనివాస్, నవీన్, రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Jun 30 2023, 09:52