Uppal Skywalk: 'ఉప్పల్ స్కైవాక్'ను ప్రారంభించిన కేటీఆర్.. ప్రత్యేకతలివీ..
హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ కూడలిలో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్‌ఎండీఏ దీన్ని నిర్మించింది..
660 మీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ స్కైవాక్‌కు మొత్తంగా రూ.25 కోట్లు కేటాయించారు.
నాలుగు వైపుల నుంచి నేరుగా ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులతో పాటు మెట్రో స్టేషన్‌కు ఈ వంతెనను అనుసంధానించారు.
మెట్లు ఎక్కలేని వారికోసం ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. స్కైవాక్ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇక గ్రీనరీ, పాదచారుల కోసం టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు విదేశాల నుంచి తెప్పించ్చిన రూఫ్‌లను ఏర్పాటు చేశారు..
స్కైవాక్ ప్రత్యేకతలివీ..
• నిర్మాణ వ్యయం: రూ.25 కోట్లు
• నిధులు: రాష్ట్ర ప్రభుత్వం నుంచి
• పొడవు: 660 మీటర్లు
• వెడల్పు: 3, 4, 6 మీటర్ల చొప్పున
• ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుసంధానం
• మెట్రో స్టేషన్ నుంచి నిత్యం ప్రయాణించే వారు: 25-30 వేల మంది
• రింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య: సుమారు 20 వేలు
• పాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నడక సాగించే వీలు
Jun 26 2023, 20:41