/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పాఠశాలల్లో నో "బ్యాగ్" డే ప్రవేశపెట్టనున్న సర్కార్? Yadagiri Goud
పాఠశాలల్లో నో "బ్యాగ్" డే ప్రవేశపెట్టనున్న సర్కార్?

విద్యార్థులకు పుస్తకాల భారాన్ని, ఒత్తిడిని తగ్గించేందుకు రాష్ర్టంలోని అన్ని పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబోధన అందించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాటించనున్నారు.

28 రకాల కార్యకలాపాలు

ప్రైమరీ విభాగంలో షో టైమ్, ఫన్ స్టేషన్, క్రియేటివ్ సర్కిల్ అనే మూడు సెషన్లు ఉంటాయి. 1వ మరియు 2వ తరగతి విద్యార్థులు తమ కుటుంబం గురించి మాట్లాడడం, కుటుంబ సభ్యుల్లో ఒకరిలా నటించడం వంటి టాస్క్ ఉంటుంది. దీంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సృజనాత్మకతను పెంపొందించుకునే కుటుంబ సభ్యుని స్కెచ్‌ని గీయమని కోరతారు. వీటితో పాటు విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల సందర్శనలు, సైన్స్ ప్రయోగాలు, డూడ్లింగ్, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎలక్షన్స్ వంటి ఇండోర్ కార్యకలాపాలు ఉంటాయి.

3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు

మూడు నుంచి ఐదు తరగతులు చదివే విద్యార్థులకు కార్యాచరణ ఆధారిత అభ్యాసంలో భాగంగా, జీవనోపాధిపై ఒక థీమ్‌ను అభివృద్ధి చేశారు. వృత్తిలో ఉపయోగించే పనిముట్లను గీయడం, నచ్చిన వృత్తిపై మాట్లాడడం, ఆ పనిని చేయడంపై అసైన్‌మెంట్ ఇస్తారు.

సెకండరీ స్థాయిలో

సెకండరీ స్థాయిలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కుటుంబ బడ్జెట్ సర్వే, పోస్ట్ ఆఫీస్, నిర్మాణ స్థలాలు, రేషన్ షాపుల సందర్శన, ఫీల్డ్ విజిట్‌లు, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎలక్షన్, అవుట్‌డోర్ మరియు ఇండోర్ కార్యకలాపాలు ఉంటాయి. సెకండరీ స్కూల్ స్థాయి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు, దాని అప్లికేషన్లు, కెరీర్ అవకాశాలను సైతం పరిచయం చేయనున్నారు. పా శాలలు ఆరంభమై 12 రోజులు కావడంతో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంది. జులై నుంచి కచ్చితంగా అమలు చేసేందుకు పాఠశాలల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి...

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల :జూన్ 26

కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమలలో సోమవారం రోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.

నిన్న ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.47 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నిన్న ఒక్కరోజే 87,407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 31,713 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు...

పొంగులేటి అనుచరులకు షాక్‌.. పాత కేసులపై పోలీసుల నోటీసులు?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇక, ఖమ్మం జిల్లాలో పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

అయితే, పొంగులేటి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులను అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ టార్గెట్‌ చేసినట్టు తెలుస్తోంది.

తాజాగా పొంగులేటి అనుచరులపై పాత కేసులు తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్‌ ప్రధాన అనుచరులు తుళ్లూరి బ్రహ్మయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ మువ్వా విజయ్‌ బాబుపై పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఓ ఘటన ఆధారంగా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ విజయ్‌ బాబు బ్యాంకు కేసును సీఐడీకి అప్పగించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పొంగులేటి మద్దతుదారులు స్పందించారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కక్షపూరితంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసులు నమోదు చేసినట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డితో పొంగులేటి నేడు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలో చేరికపై రాహుల్‌ గాంధీతో వీరు చర్చించనున్నారు. ఈ క్రమంలో ఖమ్మంపై కాంగ్రెస్‌ పార్టీ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీంతో, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ అలర్డ్‌ అయ్యింది. సీఎం కేసీఆర్‌ కూడా ఖమ్మంపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్‌తో మాట్లాడుతూ అక్కడి పొలిటికల్‌ సమీకరణాలను తెలుసుకుంటున్నారు. అటు, బీజేపీ కూడా ఖమ్మం రాజకీయాలను పరిశీలిస్తోంది. దీంతో, ఖమ్మంలో పొలిటికల్‌ వాతావరణం హీటెక్కింది.......

శేపూరి రవీందర్ గారికి చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా సన్మానం

•బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమితులైన చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ చిట్యాల మండలం మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్ గారికి ఈరోజు మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

నకిరేకల్ నియోజకవర్గంలో బిజెపి బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న శేపురి రవీందర్ గారికి ప్రతి ఒక్కరం అండగా నిలుస్తామని నకిరేకల్ నియోజకవర్గం లో బిజెపి జెండా ఎగరవేసే వరకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని తెలియజేశారు.

ఈ ప్రాంత ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అనునిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న శేపూరి రవీందర్ కు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు నకిరేకల్ బిజెపి కేడర్లో జోష్ వచ్చిందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, బిజెపి జిల్లా నాయకులు ముడుసు బిక్షపతి, నార్కట్ పల్లి మండల ప్రధాన కార్యదర్శి తరాల శ్రీనివాస్, మీడియా సెల్ కన్వీనర్ ఉయ్యాల లింగస్వామి గౌడ్, యువజన నాయకులు పాకల దినేష్, మర్రి హరీష్ రెడ్డి, వెంకన్న, నరసింహ, లింగయ్య, యాదయ్య, సందీప్, నవీన్, అశోక్, నాగరాజు, శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు.

విపక్ష కూటమి పేరు యూపీఏ కాదు పీడీఏ అని సిమ్లా మీటింగ్‌లో ముద్ర వేయనున్నారు

2024 లోక్‌సభ ఎన్నికల కోసం విపక్షాల కూటమి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నివాసంలో 15 విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి సమావేశమయ్యాయి.

ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. ఈసారి కూడా ఈ కూటమి పేరు యుపిఎ అంటే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లేదా యుపిఎ అని ఊహాగానాలు జరుగుతున్నాయి, అయితే అలాంటి అవకాశం తక్కువ. సీపీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కూటమి పేరు పీడీఏ అంటే పేట్రియాటిక్ డెమోక్రటిక్ అలయన్స్ అని పేర్కొన్నారు.

సీపీఐ పత్రికా ప్రకటనలో పేరు ప్రస్తావనకు వచ్చింది

సిమ్లాలో జరిగే సమావేశంలో కూటమి పేరు ఖరారవుతుందని సీపీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ పత్రికా ప్రకటనలో సీపీఐ నేత డి రాజాను ఉటంకిస్తూ కొత్త కూటమి పేరును పిడిఎగా పేర్కొన్నారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పీడీఏ పేరుతో వెనుకబడిన, దళిత, మైనారిటీల కూటమి గురించి చెప్పిన సంగతి తెలిసిందే. దీని తర్వాత, సీపీఐ పత్రికా ప్రకటనలో కూడా ఈ పేరును ప్రస్తావిస్తూ ఈసారి ప్రతిపక్ష పార్టీల కూటమి పేరు UPA నుండి PDA గా మారనుంది.

నితీష్ కుమార్ కసరత్తు ప్రారంభించారు

2024 లోక్‌సభ ఎన్నికల కోసం, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో జరిగిన ఈ సమావేశానికి హాజరు కావాలని అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించారని, ఆ తర్వాత ఈ సమావేశం శుక్రవారం జరిగిందని మీకు తెలియజేద్దాం. ఇప్పుడు తదుపరి సమావేశం కొన్ని రోజుల తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జరగనుంది. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో 15 పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం విపక్ష నేతలంతా సంయుక్తంగా మీడియాతోనూ మాట్లాడారు.అయితే ఈ మీడియా సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తప్పుకోవడం గమనార్హం.

Train Accident: పశ్చిమబెంగాల్‌లో రెండు రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 వ్యాగన్లు

బంకురా: పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అడ్రా డివిజన్‌ పరిధిలోని ఓండా స్టేషన్‌కు సమీపంలో గూడ్స్‌ రైలు, మెయింటెనెన్స్‌ రైలును ఢీకొంది..

ఈ ఘటనతో 12కిపైగా వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు గూడ్స్‌ రైలు ఇంజిన్‌.. మరో రైలు వ్యాగన్‌ పైకి చేరింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఓ రైలు డ్రైవర్‌ స్వల్ప గాయాల పాలయ్యాడు.

ప్రమాదం ఎలా జరిగిందంటే..?

తెల్లవారుజామున 4.05 గంటల సమయంలో ఓండా స్టేషన్‌ వద్ద రైల్వే మెయింటెనెన్స్‌ రైలు (బీఆర్‌ఎన్‌) షంటింగ్‌ పని జరుగుతోంది. ఆ సమయంలో గూడ్స్‌ రైలుకు రెడ్‌ సిగ్నల్‌ పడింది. కానీ, గూడ్స్‌ రైలు ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత బీఆర్‌ఎన్‌ మెయింటెనెన్స్‌ రైలును ఢీకొంది. దీంతో 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఉదయం 7 గంటల సమయానికి అప్‌ మెయిల్‌, అప్‌ లూప్‌ లైన్లను పునరుద్ధరించారు.

ఈ విషయాన్ని ఆగ్నేయ రైల్వే సీపీఆర్‌వో వెల్లడించారు.

ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు మాట్లాడుతూ.. రెండు రైళ్లలో ఎటువంటి లోడు లేదని వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఘటన చోటు చేసుకొన్న అడ్రా డివిజన్‌.. పశ్చిమబెంగాల్‌లో నాలుగు జిల్లాలైన వెస్ట్‌ మిడ్నాపుర్‌, బంకురా, పురులియా, బృందావన్‌లో రైళ్ల రాకపోకలకు కీలకమైంది. ఇక ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌, బొకారో, సింగభూమ్‌ పై కూడా కొంత ప్రభావం పడవచ్చు. ప్రమాదం జరిగిన మార్గంలో వీలైనంత త్వరగా రాకపోకలను

పునరుద్ధరించి.. పురులియా ఎక్స్‌ప్రెస్‌ వంటి సర్వీసులను పునరుద్ధరించేలా రైల్వే అధికారులు తక్షణమే ప్రయత్నాలు మొదలుపెట్టారు..

హైదరాబాద్ బయలుదేరిన కేటీఆర్ బృందం

రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని మంత్రి కేటీఆర్ బృందం ఆదివారం ఉదయం హైదరాబాద్ బయలు దేరింది. రెండు రోజుల్లో ముగ్గురు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం అయి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై కేటీఆర్ చర్చించారు.

కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పురి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌ లతో కేటీఆర్ బృందం భేటీ అయింది.

హైదరాబాదులో పలు ప్రాంతాల్లో రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే అంశంపై రాజనాథ్ సింగ్‌తో మంత్రి కేటీఆర్ చర్చించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు అనుమతి ఇవ్వాలని, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అణువుగా స్కై వేలు ఫ్లై ఓవర్ నిర్మాణం జరిపేందుకు పూర్తిస్థాయి సహకారం అందించాలని హరిదీప్ సింగ్ పురికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా పట్టణాల్లో కార్మికుల సంఖ్య పెరుగుతున్నందున పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని కేటీఆర్ ప్రతిపాదించారు.

తెలంగాణ నుంచి అదనంగా 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రులతో చర్చించిన సందర్భంలో కొంత సానుకూలత కొంత ప్రతికూలత వచ్చిందని మంత్రి తెలిపారు. తర్వాత రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్‌లో ఉన్న అంశాలు, హోంశాఖ పరిధిలోని భూములను అభివృద్ధి అవసరాల నిమిత్తం రాష్ట్రానికి బదలాయించాలని, ఇతర విషయాలపై చర్చించేందుకు తొలుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమయం ఖరారు చేశారు. అయితే మణిపూర్ ఘటనలపై అఖిలపక్ష సమావేశం, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఆలస్యం అవ్వడంతో... అపాయింట్‌మెంట్ రద్దు చేసినట్లు కేటీఆర్‌కు హోంశాఖ మంత్రి కార్యాలయ అధికారులు సమాచారం పంపారు. దీంతో రెండు రోజుల పర్యటన ముగియడంతో ఆదివారం ఉదయం ఎంపీలతో కలిసి మంత్రి కేటీఆర్ హైదరాబాదు బయలుదేరారు...

విఠలేశ్వరుడి దర్శనానికి సీఎం కేసీఆర్‌?

బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఈ నెల 26, 27 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నారు.

సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రానికి సోలాపూర్‌ చేరుకుంటారు.

ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు భారీ కాన్వాయ్‌గా తరలి వెళ్లనున్నారు. ఆ రాత్రి అక్కడే బసచేస్తారు. ఈ సందర్భంగా సోలాపూర్‌లోని పలువురు మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలు సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

మంగళవారం ఈనెల 27న ఉదయం సోలాపూర్‌ జిల్లాలో పండరిపూర్‌కు చేరుకొని అక్కడి విఠోభారుక్మిణి మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సోలాపూర్‌ జిల్లా ప్రముఖ నాయకుడు భగీరథ్‌ బాల్కే సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌ తిరిగి ప్రయాణం కానున్నారు. హైదరాబాద్‌ వస్తు న్న క్రమంలో దారాశివ్‌ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్‌కు అదే రోడ్డుమార్గాన చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి....

అటవీ శాఖ ఉద్యోగుల : సస్పెన్షన్​?

భద్రాది జిల్లా :జూన్ 25

బూర్గంపాడు మండలంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీశాఖ సెక్షన్ అధికారి,

బీట్ అధికారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించిన ఘటన ఆలస్యంగా శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది.

బూర్గంపాడు మండల పరిధిలోని ఇరవెండి బీట్ లో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్లాంటేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తొలగించిన కలప విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

దీంతో వీరిద్దరిని బాధ్యులను చేస్తూ సెక్షన్ అధికారి వీరన్న, బీట్ అధికారి లోకనాధం లను విధుల నుంచి తొలగిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు........

నీతో పనేంటి- ఆర్టీసీ బస్ నుంచి కండక్టర్‌ను గెంటేసిన మహిళా?

బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో మహిళలు దీన్ని వినియోగించుకుంటోన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలామందికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తోన్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్ చేయడానికి వెనుకాడట్లేదు.

ఈ నెల 11వ తేదీన కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీని కింద మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో ఆధార్ కార్డ్, ఓటరు కార్డు లేదా తాము కర్ణాటకలో నివసిస్తోన్నట్లు రుజువు చేసే ఏదైనా ఇతర గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.

ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తరువాత అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటోన్నాయి. ప్రత్యేకించి- బస్ కండక్టర్ల పరిస్థితి రోజు రోజుకూ అధ్వాన్నంగా తయారవుతోంది. బస్సు మొత్తాన్ని మహిళా ప్రయాణికులు ఆక్రమించేసుకోవడంతో ఇక మిగిలిన వారికి టికెట్లు ఇవ్వలేని దుస్థితిని ఎదుర్కొంటోన్నారు. సంయమనాన్ని కోల్పోతున్నారు. ధార్వాడ జిల్లాలోని హుబ్లీలో ఓ ప్రయాణికురాలిపై మహిళా కండక్టర్ చేయి చేసుకోవడం.. దీనికి నిదర్శనం.

కుండ్గోల్ నుంచి హుబ్లీకి బయలుదేరిన బస్సులో సీట్ల విషయంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో శనివారం ఓ ప్రయాణికురాలు.. మహిళా కండక్టర్‌తో గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. దీనితో మహిళా కండక్టర్ ఆ ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించారు. దీనితో తోటి ప్రయాణికులు..కండక్టర్‌ను నీతో పనేంటి అంటూ బయటికి గెంటి వేసే ప్రయత్నంలో చివరికి డ్రైవర్ కొన్ని నిమిషాల పాటు బస్సును నిలిపివేసి, వారిని సర్దిచెప్పాల్సి వచ్చింది.....