శేపూరి రవీందర్ గారికి చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా సన్మానం
•బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమితులైన చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ చిట్యాల మండలం మాజీ జెడ్పిటిసి శేపూరి రవీందర్ గారికి ఈరోజు మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
నకిరేకల్ నియోజకవర్గంలో బిజెపి బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న శేపురి రవీందర్ గారికి ప్రతి ఒక్కరం అండగా నిలుస్తామని నకిరేకల్ నియోజకవర్గం లో బిజెపి జెండా ఎగరవేసే వరకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని తెలియజేశారు.
ఈ ప్రాంత ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అనునిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న శేపూరి రవీందర్ కు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు నకిరేకల్ బిజెపి కేడర్లో జోష్ వచ్చిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, బిజెపి జిల్లా నాయకులు ముడుసు బిక్షపతి, నార్కట్ పల్లి మండల ప్రధాన కార్యదర్శి తరాల శ్రీనివాస్, మీడియా సెల్ కన్వీనర్ ఉయ్యాల లింగస్వామి గౌడ్, యువజన నాయకులు పాకల దినేష్, మర్రి హరీష్ రెడ్డి, వెంకన్న, నరసింహ, లింగయ్య, యాదయ్య, సందీప్, నవీన్, అశోక్, నాగరాజు, శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు.
Jun 25 2023, 17:38