కెసిఆర్ తక్షణమే అనాథలకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి - MRPS
కలెక్టర్ కార్యాలయం ముందు "అనాథల అరిగోస దీక్ష"
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాథలకు అనేక హామీలు ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఒక్క హామీ కూడా ఇప్పటివరకు కేసీఆర్ నెరవేర్చలేదని తక్షణమే అనాథలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ గారి పిలుపుతో నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు MRPS, మహాజన సోషలిస్ట్ పార్టీ(MSP) ఆధ్వర్యంలో అనాథ పిల్లలతో "అనాథల అరిగోస దీక్ష"ను చేపట్టారు.
ఈ దీక్షకు MSF జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ.. సమాజంలో తల్లిదండ్రులు లేని, సంరక్షకులు లేని అత్యంత నిస్సహాయులైన అనాథలను సైతం మోసం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.
KCR అనాథలకు అనేక హామీలుఇస్తూ అనాథలకు ఇక ప్రభుత్వమే అమ్మానాన్న అని, వారికి గురుకుల పాఠశాలలు ఏర్పరుస్తామని, అనాథ పిల్లలందరికీ స్మార్ట్ కార్డులు ఇస్తామని, వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, వారికి ఆర్థిక భద్రతను కల్పిస్తామని, రోడ్లపైన కూడళ్ల పైన బిక్షటన చేసే వారిని ప్రభుత్వమే గుర్తించి హోమ్స్ లో షేల్టర్ కల్పిస్తామని, అనాథల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై పీడి యాక్ట్ నమోదు చేస్తామని అనేక హామీలు ఇచ్చి వీటి పైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు కూడా చేసి ఇప్పటివరకు ఒక్క హామీనీ నెరవేర్చలేదని అన్నారు.
తక్షణమే వారికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని,వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ దీక్షలో అనాథ బాలురు, బాలికలు పాల్గొన్నారు.
ఈ దీక్షలో MSP నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, MRPS నల్లగొండ జిల్లా ఇంచార్జీ బోడ సునీల్ మాదిగ, MRPS జిల్లా కో- కన్వీనర్ ఇరిగి శ్రీశైలం మాదిగ, MSP జిల్లా నాయకులు ఆడేపు నాగార్జున మాదిగ, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి మేడి శంకర్ మాదిగ, MSP నాగార్జునసాగర్ ఇంచార్జ్ మడుపు శ్రీనివాస్ మాదిగ, MSP మిర్యాలగూడ ఇంచార్జ్ మచ్చ ఏడుకొండల్ మాదిగ, MSP మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జ్ కొమిరే స్వామి మాదిగ, ఎంఎస్పి నల్గొండ మండలం ఇంచార్జ్ బొజ్జ దేవయ్య MRPS నాయకులు సన్నీ మాదిగ, ఏర్పుల వెంకటయ్య బోర్ర మోష, ఏడుకొండలు మాదిగ , MSF నాయకులు త్రినేత్ర మాదిగ, వంగూరి బన్ని మాదిగ, విజ్ఞాన్ మాదిగ, శివ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి తదితర నాయకులు పాల్గొన్నారు.
Jun 23 2023, 18:33