/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్‌ చేరువ..! Yadagiri Goud
ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్‌ చేరువ..!

వాషింగ్టన్‌: భారత అంతరిక్ష రంగం (Indian Space Industry)లో కీలక పరిణామం. ఇప్పటివరకు భారతీయ వ్యోమగామి (Indian Astronaut) అడుగుపెట్టని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మనకు చేరువకానుంది.

2024లో ఐఎస్‌ఎస్‌కు ఉమ్మడి మిషన్‌ (Joint Mission)ను భారత్- అమెరికాలు ప్రకటించనున్నట్లు వైట్‌హౌస్‌ (White House) వెల్లడించింది.

నాసా (NASA), ఇస్రో (ISRO)ల నడుమ ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికాలో పర్యటిస్తున్న వేళ.. దీనిపై ఒక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు అంతరిక్ష అన్వేషణకు, ముఖ్యంగా జాబిల్లిపై ప్రయోగాలకు సంబంధించి అమెరికా రూపొందించిన 'ఆర్టెమిస్‌ ఒప్పందం (Artemis Accords)'లో భాగం కావాలని భారత్‌ నిర్ణయించినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది..

గ్రూపు-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని పిటిషన్.. టీఎస్ పీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు!

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓఎంఐర్‌పై హాల్ టికెట్ నెంబర్, ఫొటో ఎందుకు లేదని, బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్ పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో స్పందించిన కోర్టు అక్టోబర్‌లో నిర్వహించిన మాదిరిగా ఈసారి ఎందుకు పరీక్షను నిర్వహించలేదని ప్రశ్నించింది. పరీక్షల్లో అక్రమాలు నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని ప్రశ్నించింది. దీంతో కమిషన్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పరీక్షల ఏర్పాట్లు అనేవి టీఎస్ పీఎస్సీ విచక్షణ అధికారమని కోర్టు దృష్టికి తీసుకుచ్చారు.

బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫొటో అనేది ఖర్చుతో కూడుకుందని దీనికోసం సుమారు రూ.1.50 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. అయితే ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా ఇన్విజిలేటర్ల అభ్యర్థులను ధృవీకరించారని కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను చాలామంది రాసినప్పటికీ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదని కేవలం ముగ్గురు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల వద్ద నుండి డబ్బులు తీసుకున్నారు కదా అని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల విషయంలో ఖర్చులు ముఖ్యం కాదని పేర్కొంది. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్ పీఎస్సీ బాధ్యత అని ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ దీనిపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది........

CM KCR: ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయం.. ప్రారంభించిన కేసీఆర్

కొల్లూరు: ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సంగారెడ్డి జిల్లా జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 15,660 డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

ఈ గృహాల సముదాయానికి 'కేసీఆర్‌ నగర్‌ 2బీకే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీ'గా నామకరణం చేశారు. ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను సీఎం అందజేశారు.

అనంతరం అక్కడి గృహాలను కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

ఈ గృహ సముదాయంలో ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టారు.

117 బ్లాకులుగా విభజన చేశారు. జీ+9, జీ+10, జీ+11 అంతస్తుల చొప్పున కట్టారు. 37శాతం భూమిలో ఇళ్లు నిర్మించారు. మిగిలిన 63శాతం భూమిలో మౌలిక సదుపాయాలు కల్పించారు.

అమరవీరుల కుటుంబ సభ్యుల అరెస్ట్

సచివాలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన తెలుపుతున్న అమరవీరుల కుటుంబసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అమరవీరుల స్థూపం ఆవిష్కరణకు తమను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను విస్మరించారంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ఒకవైపు తెలంగాణ దశాబ్ది వేడుకల ముగింపు సమావేశాలు కొనసాగిస్తూనే.. ఇంకొకవైపు అమరవీరుల దినోత్సవం జరుపుతున్నారు. అందులో భాగంగా అమర జ్యోతిని ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం పంపలేదు. అయితే తమకు ఎందుకు ఆహ్వానించలేదని అమరవీరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సచివాలయం వద్దకు వచ్చి నిరసన తెలిపాయి.

ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అధికారులు ఆరు కుటుంబాలకే ఆహ్వానాలు ఇచ్చారని, ఆ ఆరు కుటుంబాలతోనే తెలంగాణ వచ్చిందా? అని ప్రశ్నించారు. 12 వందలమంది తల్లి కడుపు కోతలు ఏమవుతాయని వారు నిలదీశారు.

సీఎం కేసీఆర్‌ను కలుస్తామని మీడియా ద్వారా చాలా సార్లు తెలియజేశామని.. ఇంతవరకు ముఖ్యమంత్రి తమను పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు 12 వందల మంది బలదానం చేసుకున్నారని చెప్పారని, ఇప్పుడు 6 వందలమందిని మాత్రమే గుర్తించారని, 12 వందల మందిని గుర్తించాలని వారు కోరుతూ భావోద్వేగానికి లోనయ్యారు....

మళ్లీ గెలిపించండి.. పటాన్ చెరు-హయత్ నగర్ వరకు మెట్రో తీసుకొస్తా…

మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో తీసుకొస్తానని సీఎం కేసీఆర్‌ అన్నారు. సంగారెడ్డిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుప్రతికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఒక్కటే మాట మనవి చేస్తున్నా.. మోసపోతే.. గోసపడుతాం.. ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నమో.. దాన్ని బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరంగా ముందుకెళ్తున్నాం.. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నాం.. కేసీఆర్‌ కిట్‌ ఎలా ఉంటుందో చూశారన్నారు.

హరీశ్‌రావు ఆరోగ్యమంత్రిగా వచ్చాక వైద్యరంగం కొత్త పరుగులు పెడుతున్నదన్నారు. కేసీఆర్‌ కిట్‌ కాదు.. మహిళలు గర్భిణులగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ, తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్‌ కిట్‌ను తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్య రంగంలో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసు. హైదరాబాద్‌కు వెళ్లే గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌ తప్ప మరొకటి లేకుంటే. అద్భుతమైన ఐదు కార్పొరేట్‌ స్థాయిలో ఆసుపత్రులు తీసుకువస్తున్నామన్నారు.

ప్రభుత్వరంగంలోనే 17వేల బెడ్స్‌ ఉంటే.. ప్రస్తుతం 50వేల బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా పత్రి బెడ్‌కు ఆక్సిజన్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దగ్గరలోని ఇస్నాపూర్‌లోనే 500 టన్నుల ఆక్సిజన్‌ తయారుచేసే యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఎవరినో అడుగకుండా మన ఆక్సిజన్‌ మనమే తీసుకునే విధంగా పెట్టుకున్నామన్నారు . కొనసాగుతున్న ఈ రాష్ట్ర ప్రగతి ఇదే విధంగా మళ్లీ ముందు కొనసాగాలంటే.. నిన్నా మొన్న 20 రోజుల నుంచి కార్యక్రమాలు ఎలా చేశారో.. అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని దీవించినట్లయితే బ్రహ్మాండమైన అభివృద్ధిని చేసుకుందామన్నారు. కావాల్సిన పనులన్నీ చాలా గొప్పగా చేసుకొని ముందుకెళ్దామన్నారు.

ఈ రాష్ట్రం ఇంత త్వరలో ఇంత బాగైతుందని ఎవరూ ఊహించలేదన్నారు. తెలంగాణ ఏర్పడకూడదని మాట్లాడినటువంటి పెద్దలే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే గతంలో ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో ఐదారెకరాలు కొనుక్కుందుము.. ఇప్పుడు తెలంగాణలో ఒకరం అమ్మి ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుకుంటున్నరని చంద్రబాబు నాయుడే చెప్పారన్నారు. అంటే విషయం తారుమారైంది.. మంచి నాయకత్వం, మంచి ప్రభుత్వం ఉంటే అన్నీ సాధ్యమేనన్నారు. తెలంగాణ భూములు ఎలా పెరిగాయో తెలుసు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా వారిని సమైక్య శక్తులు కన్ఫ్యూజ్‌ చేశాయన్నారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని చెప్పారు. కానీ, పటాన్‌చెరువులో ఇవాళ ఎకరం భూమి ధరం ఎంత ? ఆ రోజు ఎంత ఉండే ? ఇప్పుడు రూ.30కోట్లు పలుకుతున్నదన్నారు. రూ.30కోట్లు పలికితే చంద్రబాబు అన్నట్లుగా ఆంధ్రాకు వెళ్లి వంద ఎకరాలు కొనుగోలు చేయవచ్చన్నారు. ఇంకా నేను కలలుగన్న బంగారు తెలంగాణ సాకరమై తీరుతుందన్నారు...

భాగ్యనగరంలో బోనాల పండుగ షురూ

ఆషాఢమాసం ప్రారంభమైంది.ఇక ఆషాడం మొదలైంది అంటే తెలంగాణ వ్యాప్తంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

నేటి నుంచి బోనాల సందడి మొదలైంది. మొదటి బోనం గోల్కొండ కోట పైన జగదాంబ మహంకాళి అమ్మవారికి సమర్పించనున్నారు.

ఇక్కడ తొమ్మిది వారాలపాటు ప్రతి గురు, ఆదివారాలలో బోనాల సందడి ఉంటుంది. ఇవాళ గోల్కొండ జగదాంబికా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తొలి పూజ నిర్వహించడానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయానికి చేరుకున్నారు.

మొదటి బోనాన్ని గోల్కొండ కోట పైన ఆనవాయితీగా వస్తున్న మొదటి పూజ చేసేందుకు.. మొదటి బోనాన్ని సమర్పించడానికి కుమ్మరులంతా సన్నద్ధమవుతున్నారు...

న్యూయార్క్ టైమ్స్ ప్రధాని మోదీ ప్రజాదరణ రహస్యాన్ని చెప్పింది, తీవ్రంగా ప్రశంసించింది

మోడీ మాయాజాలం ప్రజల తలలపై మాట్లాడుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన దేశంలోని ప్రతి చిన్నారి నాలుకపై బతుకుతున్నారు. అదే సమయంలో, వారు ప్రపంచ దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందారు. అయితే వారి ప్రజాదరణ వెనుక ఉన్న కారణం మీకు తెలుసా? ఆయన పాపులారిటీ గురించి అమెరికాలోని ప్రముఖ వార్తాపత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' (NYT)లో ఒక కథనం ప్రచురించబడింది. కథనం ప్రకారం, పిఎం మోడీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయినందున మాత్రమే కాకుండా దేశ ప్రజలపై చాలా ప్రభావం చూపుతున్నందున ప్రజాదరణ పొందారు. అదేంటంటే.. మోడీ ప్రభుత్వాన్ని చాలాసార్లు విమర్శించిన పత్రిక ఇదేనని చెప్పుకుందాం.

'మన్ కీ బాత్' ప్రధాని మోదీకి ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం

న్యూయార్క్ టైమ్స్‌లో ముజీబ్ మషాల్ రాసిన కథనం, ప్రధాని మోడీకి ప్రజాదరణ రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి అతని రేడియో షో 'మన్ కీ బాత్' అని పేర్కొంది మరియు అంతర్జాతీయ స్థాయిలో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ఇస్తుంది. ప్రతి నెలా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో, దేశంలో జరుగుతున్న ప్రతి చిన్న మరియు పెద్ద సానుకూల మార్పు గురించి ప్రధాని మోదీ మాట్లాడతారు. కథనం ప్రకారం, పిఎం మోడీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయినందున మాత్రమే కాకుండా దేశ ప్రజలపై చాలా ప్రభావం చూపుతున్నందున ప్రజాదరణ పొందారు. అలాగే, అతని విధానాలు అతని వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.

"మన్ కీ బాత్" ద్వారా దేశంలోని పెద్ద జనాభాతో కనెక్ట్ అవుతుంది

నెలకోసారి ప్రధాని మోదీ తన ప్రభుత్వ బంగ్లాలో నిర్మించిన స్టూడియోకు వెళతారని న్యూయార్క్ టైమ్స్ నివేదికలో పేర్కొన్నారు. అతను తన రేడియో కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభిస్తాడు. ఇప్పటి వరకు ప్రధాని 100కి పైగా 'మన్ కీ బాత్' చేశారు. అతను ప్రదర్శనను 'మేరే ప్యారే దేశస్థులు, నమస్కార్!'తో ప్రారంభిస్తాడు. ఈ కార్యక్రమం ద్వారా పీఎం మోదీ సమస్యలకు పరిష్కారాలు చెప్పడమే కాకుండా దేశంలోని అత్యధిక జనాభాతో అనుసంధానం చేస్తున్నారు.పాఠశాల పరీక్షల సమయంలో ఏర్పడే ఒత్తిడిని నివారించే మార్గాలను తన కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ వివరించారు. కొన్నిసార్లు అతను నీటి సంరక్షణ గురించి మాట్లాడతాడు మరియు కొన్నిసార్లు అతను గ్రామం మరియు వ్యవసాయ జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు సలహాలు ఇస్తాడు. ప్రోగ్రామ్ ద్వారా, అతను కొన్నిసార్లు ఉపాధ్యాయుడిలా, కొన్నిసార్లు స్నేహితుడిలా మాట్లాడతాడు.

'ప్రధాని మోదీకి రెండు అతిపెద్ద బలాలు ఉన్నాయి'

PM మోడీ యొక్క ప్రజాదరణను కూడా అతని పార్టీ ప్రభావితం చేస్తుందని మషాల్ రాశారు, ఇది సోషల్ మీడియాలో బలమైన పట్టును కలిగి ఉంది, ఇది సోషల్ మీడియాలో అతని ప్రసంగాల వీడియోలు మరియు టెక్స్ట్‌లను ప్రసారం చేస్తుంది. ప్రధాని మోదీకి రెండు పెద్ద బలాలు ఉన్నాయి, ఒకటి దేశం గురించి అట్టడుగు స్థాయి అవగాహన, మరొకటి కథ చెప్పగల సామర్థ్యం. ఈ లక్షణాల కారణంగా, PM మోడీ దేశప్రజలతో కనెక్ట్ అవ్వగలుగుతున్నారు మరియు ఉచిత రేషన్ మరియు మెరుగైన మౌలిక సదుపాయాల వంటి తన ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజల ముందు ఉంచగలుగుతారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా, ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా టీకా కోసం ప్రజలను ప్రేరేపించారు. అలాగే, తమ ప్రయత్నాల ద్వారా చిన్న చిన్న మార్పులను తీసుకువస్తున్న సమాజంలోని అలాంటి వ్యక్తుల గురించి అతను మాట్లాడాడు.

"అతను జాతీయ కల్పనను స్వాధీనం చేసుకున్నాడు"

ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశానికి PM మోడీ దాదాపు 30 నిమిషాల ప్రసార హోస్టింగ్ - ఒక విధంగా, భారతదేశం యొక్క విస్తారతలో తనను తాను సర్వవ్యాప్తి చేసింది. అతను తన విమర్శలకు అతీతంగా కనిపించే జాతీయ కల్పనను స్వాధీనం చేసుకున్నాడు.

అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ కు లేదు : కత్తుల వంశీ

రాష్ట్ర సాధన ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో ఏ రోజు కనపడని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని భారత రాష్ట్ర సమితి యువజన రాష్ట్ర నాయకులు, తెలంగాణ విద్యార్థి జేఏసీ కన్వీనర్ కత్తుల వంశీ ఒక ప్రకటనలో తెలిపారు.

అసలు ఉద్యమంలో రేవంత్ పై ఎన్ని కేసులు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలపాలని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వాన్ని కుల్చలని కుట్రలు పన్నిన రేవంత్ రెడ్డి అమరవీరుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు గా ఉందన్నారు.

రేవంత్ చేసే పోరాటం రాష్ట్ర ప్రజల కోసం కాదని ఆయన వ్యక్తిగత అధికారం కోసమేనని ఆయన అన్నారు. పూటకో పార్టీ మార్చే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తనకే తెలియదని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణ కు శ్రీరామా రక్షా అని అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఆయనకు ఈ టి పిసిసి పదవి ఎలా వచ్చేదో ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు.

మునిగిపోయే నావ లాంటిది కాంగ్రెస్ పార్టీ అని, గతంలో కాంగ్రెస్ పార్టీ చేయని పనులను కేసీఆర్ కేవలం ఎనిమిది సంవత్సరాల లోనే పూర్తి చేశారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలవడం మళ్ళీ సిఎం కేసీఆర్ కావడం వందకు వందశాతం జరుగుతుంది అని దానిని ఎవ్వరూ ఆపలేరని కత్తుల వంశీ పేర్కొన్నారు.

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు!!

హైదరాబాద్‌:జూన్ 22

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు సాయంత్రం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్‌ పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు.

ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి నెక్లెస్‌ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ల మధ్య ట్రాఫిక్‌కు అనుమతి లేదు. పంజగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్డు రోటరీ వైపు వెళ్లేందుకు అనుమతించరు. ఈ వాహనాలను షాదాన్‌ కళాశాల నుంచి నిరంకారి వైపు మళ్లిస్తారు.

ఇక్బాల్‌ మినార్‌ నుంచి వచ్చే వాహనాలకు రోటరీ చౌరస్తా వైపునకు అనుమతి ఉండదు. బుద్ధ భవన్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌వైపు వెళ్లడానికి నల్లకుంట చౌరస్తా నుంచి మళ్లిస్తారు. లిబర్టీ, అంబేడ్కర్‌ విగ్రహం నుంచి వచ్చే ట్రాఫిక్‌ ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపునకు వెళ్లడానికి అనుమతి లేదు. రాణీగంజ్, కవాడిగూడల నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్‌ వైపు అనుమతించరు. బడా గణేష్‌ నుంచి ఐమాక్స్, నెక్లెస్‌ రోటరీ వైపు, మింట్‌ లేన్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ బడా గణేష్‌ వద్ద నుంచి రాజ్‌దూత్‌ లేన్‌ వైపు మళ్లింపు ఉంటుంది.

తెలంగాణ అమరవీరుల స్మారక ప్రారంభోత్సవం దృష్ట్యా 22న ఎన్టీఆర్‌ గార్డెన్, నెక్లెస్‌ రోడ్డు, లుంబినీపార్క్‌ మూసి ఉంటాయి. సికింద్రాబాద్‌ నుంచి ఎగువ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌కు అనుమతి లేదు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్‌ డైవర్షన్లను గమనించి ప్రత్యామ్న్యాయ మార్గాల్లో వెళ్లాలని సుధీర్‌బాబు సూచించారు. ...

రచ్చకెక్కిన అద్దంకి సీఐ రాసలీలలు

బాపట్ల జిల్లా:జూన్ 22

అద్దంకి సీఐ రోశయ్య గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన రాసలీల ఆడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో చీరాల సీఐగా పనిచేసిన కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, సీఐ ప్రవర్తనతో ఓ వ్యక్తి ఉరివేసుకుని చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడని మొదలు పెట్టి వివిధ కారణాలతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే మహిళల్ని లోబర్చుకుని వేధింపులకు గురి చేస్తున్నారంటూ సిఐపై ఆరోపణలు చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన ఆడియో క్లిప్‌లు పోలీసుశాఖలో హాట్ టాపిక్ గా మారాయి.

తనతో మాట్లాడకుండా ఫోన్‌ను బ్లాక్ చేస్తే మామూలుగా ఉండదంటూ ఓమహిళను బెదిరిస్తున్న ఆడియో కూడా ఒకటి లీక్ అయి కలకలం రేపింది. ఇక అదే సమయంలో తన ఆడియోలపై వస్తున్న వార్తలపై కానిస్టేబుల్‌తో సెటెరికల్‌గా స్పందించిన సీఐ ఆడియో కూడా మరోకటి బయటకు వచ్చి మరింత రచ్చకు దారి తీసింది.

వాళ్ళ దగ్గర ఆడియో లేకపోతే చెప్పు నేను ఆ పనిలో ఉన్నప్పుడు చెబుతా వచ్చి వీడియోలు తీసుకోమను, అవి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి, నేను మగాణ్ణి అంటూ కానిస్టేబుల్‌తో మాట్లాడినట్టు ఆడియోలో ఉంది.

ఈ ఆడియోల కలకలంతో అద్దంకి సీఐ రోశయ్యను వీఆర్ కు పంపారు పోలీస్ అధికారులు. అద్దంకి సీఐ రోశయ్య వ్యవహారాలపై ఒక మహిళా పోలీస్ ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది. తనను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయిస్తానని బెదిరించి రాజశేఖర్ అనే కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేయించారని మహిళా కానిస్టేబుల్ ఆరోపిస్తోంది.

నిజానికి ముందు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు రాజశేఖర్ ను సస్పెండ్ చేశారు పోలీసు అధికారులు. సస్పెండ్ అయిన కానిస్టేబుల్ రాజశేఖర్ ని మెడికల్ టెస్టుల కోసం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించగా తనపై కక్షతోనే సీఐ రోశయ్య ఇదంతా చేశారంటున్న కానిస్టేబుల్ రాజశేఖర్, కోర్టుకు వెళ్లే లోపు తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి మరి...