ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే
•సర్వరోగ నివారిణి యోగ
•ముఖ్యఅతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్
ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ ఆర్గనైజేషన్ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో పెద్దకాపర్తి గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారు హాజరై విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు. యోగ డే సందర్భంగా పల్లపు బుద్ధుడు పాఠశాల విద్యార్థులచే యోగా ఆసనాలు, ప్రాణాయామం బస్రిక, మెడిటేషన్ సాధనలు నేర్పించారు.
సర్వరోగ నివారిణి యోగ అని అన్నారు, ప్రతినిత్యం యోగ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం అని, ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందని తెలియజేశారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు 1982 సంవత్సరంలో స్థాపించారు విశ్వశాంతి కొరకు ఇప్పటివరకు 186 దేశాలలో అన్ని వర్గాల ప్రజలు సుదర్శన క్రియ, మెడిటేషన్, యోగ ద్వారా ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతున్నారన్నారు. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు, పద్మాసనాలు, ప్రాణాయామం, బస్రిక, సుదర్శన క్రియ చేయడం వలన మనలోని జీవశక్తిని పెంపొందించుకొని ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవించగలమన్నారు.
పెద్దకాపర్తి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రతినిత్యం ప్రతి ఒక్కరు జీవితంలో ఆనందదాయకంగా ఉండాలంటే యోగా, సుదర్శన క్రియ ప్రతిరోజు ఒక గంట సేపు చేయాలన్నారు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ ద్వారా హ్యాపీనెస్ అనే కోర్సుతో ఒత్తిడిని పారదోరి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుందని పల్లపు బుద్ధుడు తెలియజేశారు.
ధ్యానం మరియు ఉఛ్వాస నిశ్వాసలను చక్కగా పొందుతారని తెలిపారు. శ్వాసను పట్టుకో ఆరోగ్యాన్ని పెంచుకో జీవితం ఆనందదాయకంగా ఉంటుందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ సభ్యులు ముఖ్యఅతిథి బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారికి, పెద్ద కాపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామలింగచారీ గారికి, smc వైస్ చైర్మన్ నిలకంఠం నరేష్ గారికి శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లోకందర్ రెడ్డి , శకుంతల, లచ్చిరెడ్డి, రామ్ భోపాల్, కైలాసం, జ్ఞానేశ్వర్ చారి , నాయకులు గంజి గోవర్ధన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాలంటరీస్ పాకాల దినేష్, బూత్ అధ్యక్షుడు మోర ధనుంజయ , మర్రి హరీష్ రెడ్డి, ,అనగంటి తిరుమలేష్,గుండెబోయిన నర్సింహ, కాటం సందీప్ యాదవ్ , ఈరటి తేజ , బత్తుల శివ, అనగంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Jun 21 2023, 15:05